యూపీలో భార్యాభర్తల సవాల్..! | Wife and Husband to fight in lok sabha polls | Sakshi
Sakshi News home page

యూపీలో భార్యాభర్తల సవాల్..!

Mar 20 2014 2:50 AM | Updated on Aug 29 2018 8:56 PM

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ముజఫర్‌నగర్ నియోజకవర్గం ఆసక్తి రేకెత్తిస్తోంది. భార్యాభర్తలు ఎన్నికల బరిలో నిలవడమే ఇక్కడ విచిత్రం.

 ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ముజఫర్‌నగర్ నియోజకవర్గం ఆసక్తి రేకెత్తిస్తోంది. భార్యాభర్తలు ఎన్నికల బరిలో నిలవడమే ఇక్కడ విచిత్రం. ముజఫర్‌నగర్ సిటింగ్ ఎంపీ ఖదిర్ రాణా. గత ఎన్నికల్లో బీఎస్‌పీ తరఫున గెలుపొందిన ఆయనకు ఈసారి కూడా పార్టీ సీటు ఖరారు చేసింది. అయితే అనూహ్యంగా ఈ ఇక్కడి నుంచి రాణా భార్య షాహిదా బేగం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. రాణా మార్చి 22న నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముజఫర్‌నగర్ మత ఘర్షణల కేసులో సిట్ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న పది మందిలో రాణా కూడా ఒకరు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement