Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

LIVE  AP CM YS Jagan Public Meeting at Machilipatnam
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా) 

Perni Nani Slams PV Ramesh Tweet On Land Titling Act
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?

సాక్షి, కృష్ణా: చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా అంటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌పై‌ మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారని మంపడిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల తన పొలం మ్యుటేషన్‌ జరగట్లేదని చేసిన ట్వీట్‌ను ప్రస్తావించారు. పెద్ద పెద్ద చదువులు చదువున్న మీరు ఇంత అసహ్యంగా, దిగజారి మీరు ప్రవర్తించాలా?  అని ప్రశ్నించారు. పీవీ రమేష్‌ది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామమమని తెలిపారు. ఈ గ్రామంలో తన తండ్రి పేరుపై ఉన్న పొలం తన పేరుపైకి మార్చడం లేదంటూ అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రమేష్‌ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారని చెప్పారు.25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక చెరువు తవ్వి లీజుకు ఇస్తూ వస్తున్నారన్నారు పేర్ని నాని. ఏడాది క్రితం రమేష్‌ తండ్రి సుబ్బారావు మరణించారని, ఆయన మరణించిన తర్వాత రమేష్‌ మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేశారని, అప్పటి నుంచీ విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు, రమేష్‌కు కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.వివాదాల వల్లే..ఆ చెరువులో వీళ్లకి సంబంధించిన పొలం ఎంతో కొంత ఉంది.దీనికోసమే జనవరి నెలలో జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు. ఆ విచారణకు అందరు రైతుల్ని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మని చెప్పారు. అయితే పీవీ రమేష్‌ మాత్రం తన గుమస్తాకు ఫోటోస్టాట్‌ కాపీలిచ్చి పంపారట. ఫోటోస్టాట్‌ కాదు..ఒరిజినల్స్‌ పంపండి అని చెప్పారు. ఆయన రాడు..సరే గుమస్తాను పంపినా ఒరిజినల్స్‌ కావాలి కదా?క్కడ ఉన్న వివాదాన్ని తీర్చడం కోసమే మూడు నెలలుగా ఆ చెరువును అధికారులు ఎండబెడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిహద్దులు ఫిక్స్‌ చేసి ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.ఇంత కథ నడుస్తుంటే ఇంత విషం చిమ్మడం ధర్మమా పీవీ రమేష్‌?మీ వివాదానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి?అక్కడున్న రైతులందరికీ, మీకు తగాదా ఉండటం ఏంటి? అక్కడున్న ల్యాండ్‌ కన్నా మీరు అదనంగా లీజు పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. చెరువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కదా కొలతలు వేసి ఎవరి హద్దు ఏంటో చెప్పేది?.ఎటువంటి వివాదం లేకపోతే, అది వ్యవసాయ భూమి అయి హద్దులు క్లియర్‌గా ఉంటే..ప్రభుత్వాన్ని విమర్శించినా ఒక అర్ధం ఉంది.  ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి?చంద్రబాబు పంచన చేరి ఐఏఎస్‌ చదువుకుని పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా? చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్‌ కట్టమంటే ఆ డాన్స్‌ కడుతున్నారు. ఏ ట్వీట్‌ చేయమంటే ఆ ట్వీట్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం సంపాదించడం కోసం మీరు ఇలా తప్పుడు ప్రకటనలు చేసి జగన్‌గారి ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గమైన చర్య. మీరు విన్నకోట గ్రామం రండి.. అక్కడేం జరుగుతుందో చూడండి.మీ కోసమే.. ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా వీఆర్వోలను కాపలా పెట్టి మరీ చెరువును కాళీ చేయిస్తున్నారు.పోలింగ్‌ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి కూడా సమాచారం అందించారు. ఆ చెరువు మధ్యలోనే ఆవుల దొడ్డి కింద ఓ 3.5 ఎకరాల వివాదాస్పద భూమి కూడా ఉంది. మీతో ఉన్న ఆ 25 మంది రైతులు కూడా ఆ ఆవుల దొడ్డి భూమి మాదంటే మాది అని క్లెయిమ్‌ చేస్తున్నారు.ఇలాంటి చరిత్ర కలిగిన భూమిని మీ నాన్నగారు మీకు అప్పజెప్పారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల నాకు మ్యుటేషన్‌ అవ్వడం లేదని ఇంతగా దిగజారడం అవసరమా? ’ అని మండిపడ్డారు పేర్ని నాని. 

PV Ramesh Mis Lead Tweet On Land Titling ACT TDP Yellow Media
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ట్వీట్‌.. అడ్డంగా బుక్కైన పీవీ రమేష్‌

నిజం బయటకు వచ్చే లోపు అబద్దం ఊరంతా చుట్టేసి వస్తుందన్న సామేత టీడీపీ, పచ్చమీడియాకు సరిగ్గా సరిపోతుంది. భూయజమానులకు రక్షణ కల్పించే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ విషయంలో టీడీపీ ఆడుతున్న డ్రామానే ఇందుకు నిదర్శనం. గతంలో ఇదే చట్టంపై ఎంతో గొప్పగా కితాబిచ్చిన టీడీపీ.. ఇప్పుడు  దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది.ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రాష్ట్రంలో అమలైతే తమ ఉనికే ప్రమాదమని భావిస్తున్న ప్రతిపక్ష కూటమి.. తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనికితోడు తమ బ్యాండ్‌ బాజా బ్యాచ్‌ని సైతం బరిలోకి దించింది. తమ అనుకూల వ్యక్తులతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్‌యే ఉదాహరణ. కానీ పాపం అడ్డంగా దొరికిపోతానని గుర్తించలేదేమో.IAS అధికారిగా పని చేసిన పీవీ రమేష్‌.. ఇవ్వాళ ఉదయం ఓ ట్వీట్‌ వేశారు. అత్యంత కీలకమైన ఎన్నికల వేళ.. ప్రభుత్వం మీద, అధికారంలో ఉన్న వైఎస్సార్‌సిపి మీద బురద జల్లేలా ఈ ట్వీట్‌ ఉంది. దీని పూర్వపరాలు ఏంటంటే.. లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌కు తానే బాధితుడినని చెప్పుకుంటూ పీవీ రమేష్‌ తెరమీదకి వచ్చేశారు. ఆయన తన భూమికి సంబంధించిన కొన్ని వివరాలను పేర్కొన్నారు. పీవీ రమేష్‌ ట్వీట్‌ చేయగానే.. వెంటనే టిడిపి నేతలు రంగంలోకి దిగారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేష్‌ ఓ అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. సరే, పీవీ రమేష్‌ చేసిన ఆరోపణల్లో ఎంత నిజముందన్న విషయంపై కాస్తా తీగ లాగితే డొంక అంతా కదిలింది. పీవీ రమేష్‌ తనది అని చెప్పుకుంటున్న భూమి గురించి వివరాలు సేకరించగా... అది గత మూడేళ్లుగా కోర్టులో నడుస్తోన్న కేసు గురించి తెలిసింది. హైకోర్టులో WRIT PETITION No.31186 of 2022గా దాఖలైన పిటిషన్‌లో న్యాయస్థానం ఈ భూమిపై విచారణ జరపాలని కూడా ఆదేశించింది. సర్వే నంబర్లు 61, 62, 66, 486/1, 487/1, 489/1 and 490/1 , విన్నకోట గ్రామం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లాలోని ఈ భూముల్లో.. కొందరు ప్రైవేటు వ్యక్తులు.. కొంత ప్రభుత్వ భూమిని, అలాగే కొన్ని అసైన్డ్‌ భూములను కబ్జా చేసి చేపల చెరువులను నిర్మించారని తేల్చింది. 2021లో రిట్‌ పిటిషన్‌ 10556 కింద దాఖలు కాగా..  అప్పట్లోనే కోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా.. చేపల చెరువులను నిర్మించారని, పైగా ఈ భూముల్లో ప్రభుత్వ భూములున్నాయని తప్పు పట్టింది. 2021లో దాఖలైన రిట్‌ పిటిషన్‌ 3582 ద్వారా తెలిసింది ఏంటంటే.. తక్షణం భూములు ఆక్రమించిన వారిపై ఇంకా చర్యలు చేపట్టలేదని తేలింది. ఆ భూముల్లో ఏర్పాటైన ఆక్వా చెరువులు అన్నీ అనధికారమైనవని, అక్రమంగా నిర్మించినవని తేల్చింది. ఈ భూముల్లోకి ఎవరిని అనుమతించవద్దని కోర్టు సూచించింది. ప్రభుత్వం తరపున ఒక జాయింట్‌ సర్వే నిర్వహించాలని కోర్టు సూచిస్తే... ఈ వాస్తవాలన్నింటిని దాచి పెట్టి పీవీ రమేష్‌ నంగనాచిలా తనకు అన్యాయం జరిగిందంటూ ట్వీట్‌ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతెందుకు పీవీ రమేష్‌ ట్వీట్ పెట్టడంలోనూ నాలుక మడతేశారు. ఉదయం 9.37కు ట్వీట్‌ చేసిన పీవీ రమేష్‌.. దాన్ని వెంటనే 10.23గంటలకు ఎడిట్‌ చేసేశారు.  తొలుత ట్వీట్ చేసినప్పుడు నేరుగా ఈ యాక్టుకు తాను ప్రత్యక్ష బాధితుడిని అని చెప్పుకున్నారు. అయితే ఇంతలో ఎవరైనా ప్రశ్నించారేమో.. అసలు అమలులో లేని చట్టానికి మీరు ఎలా బాధితుడు అయ్యారని?!. వెంటనే ట్వీట్‌ను ఎడిట్ చేసేశారు. ఎడిట్ చేసి ట్వీట్‌లో ''చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి.’’ అనే లైన్‌ జత చేశారు.ఇక ఈ ట్వీట్‌పై పీవీ రమేష్‌ను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. సార్‌ మీరంటే ఎంతో గౌరవం ఉంది, కానీ నిజంగా ‘ప్యాకేజ్‌ మెటీరియల్’‌ కాకపోతే భూమి టైటిల్‌ వివాదం గురించిన పూర్తి వరాలు పెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి అంటూ సూచించారు. మరికొందరు మీ కేసుకు, ఈ చట్టానికి సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మీ‘ భూముల మ్యూటేషన్‌ దరఖాస్తును తహసీల్దార్ సరదాగా ఏమీ తిరస్కరించి ఉండరు. ఏదో వివాదం ఉండే ఉంటుంది. అది బయటకు వస్తే అసలు విషయం ఏమిటన్నది తేలుతుంది’ అంటూ మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. ‘ఇంకా చట్టం అమలులోకి రాలేదు. మరి అమలులో లేని చట్టానికి మరి పీవీ రమేష్ ప్రత్యక్ష బాధితుడిగా ఎలా మారారు’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నాడు: పేర్ని నానితాజాగా ఈ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బాబు చెప్పినట్లు.. పీవీ రమేష్ ఆడుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తన భూమి మ్యూటేషన్ జరగలేదని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్  చేస్తున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు.‘పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారు.. కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా భూమి లీజుకిచ్చారు. 70 ఎరనాల పొలాన్ని 25 ఏళ్ల క్రితమే చెరువు చేశారు.పీవీ రమేష్ ఏడాదిక్రితం మ్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రైతు నాగేంద్రకు, పీవీ రమేష్‌కు సరిహద్దు వివాదం ఉంది. జనవరిలో కలెక్టర్, ఆర్డీవో సమక్షంలో విచారణ జరిగింది.పీవీ రమేష్ తన గుమస్తాతో ఒరిజనల్స్ కాకుండా జిరాక్స్ పంపించారు. 70 ఎకరాల చెరువులో పీవీ రమేష్ పొలం ఎంతో తెలియదు.చెరువు సరిహద్దులు ఫిక్స్ చేస్తే ఆయన భూమి ఎంతో తేలుతుంది.పోలింగ్ అయ్యాక సర్వే చేస్తారు. పీవీ రమేష్ విన్నకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. 

Not Hardik Or Pant MSK Prasad Says This Star Was Groomed As India CaptainAfter Rohit
హార్దిక్‌ కాదు!.. రోహిత్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అతడే!

టీమిండియా భవిష్య కెప్టెన్‌ గురించి బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ తర్వాత భారత జట్టు సారథిగా పగ్గాలు చేపట్టగల అర్హత అతడికే ఉందంటూ ఓ ముంబైకర్‌ పేరు చెప్పాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత విరాట్‌ కోహ్లి స్థానంలో రోహిత్‌ శర్మను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఏక కాలంలో నంబన్‌ వన్‌గా నిలిచిన టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.ఫైనల్‌ వరకూ వచ్చినా టీ20 ప్రపంచకప్‌-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్‌ సేన.. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఓడి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అదే విధంగా.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లోనూ విజయ లాంఛనం పూర్తి చేయలేక.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఆఖరి మెట్టుపై టైటిల్‌ను చేజార్చుకుంది.ఇక ఇప్పుడు మరో మెగా టోర్నీకి టీమిండియా సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ ఈవెంట్‌కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్‌ శర్మ నాయకత్వంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఇందులో మిడిలార్డర్‌ బ్యాటర్, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయిన‌ శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా మాత్రం అయ్యర్‌ దూసుకుపోతున్నాడు. ‌ ‌ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేకేఆర్‌ ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ అయ్యర్‌ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు. ‘‘హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు.. శ్రేయస్‌ అయ్యర్‌ను టీమిండియా తదుపరి కెప్టెన్‌గా తీర్చిదిద్దబడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమపద్ధతిలో సారథిగా ఎదిగేందుకు బాటలు వేసుకున్నాడు.గత రెండేళ్లలో అతడి గణాంకాలు అద్బుతం. ఇక ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాకు తెలిసి ఇండియా- ఏ ఆడిన 10 సిరీస్‌లలో ఎనిమిది గెలిచింది. అందులో ఎక్కువసార్లు భారత జట్టును ముందుకు నడిపింది శ్రేయస్‌ అయ్యరే!టీమిండియా తదుపరి కెప్టెన్‌గా అతడు తయారుచేయబడ్డాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తర్వాత సారథిగా రిషభ్‌ పంత్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ పోటీపడుతున్నాడు. పంత్‌ కంటే ముందే..నిజానికి పంత్‌ కంటే కూడా శ్రేయస్‌ అయ్యర్‌ ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పవచ్చు’’ అని రెవ్‌స్ట్పోర్ట్స్‌తో ఎంఎస్‌కే ప్రసాద్‌ వ్యాఖ్యానించాడు.‌ అయితే, ఇదంతా గతం. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో అయ్యర్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోవడంతో ఇప్పుడు జట్టులో స్థానం గురించి పోటీ పడాల్సిన పరిస్థితి.చదవండి: ‘SRH అని ఎవరన్నారు?.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’ 

Election Commission Appointed Ap New Dgp Harishkumar Gupta
ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా.. నియమించిన ‘ఈసీ’

సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల కమిషన్‌(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని  గుప్తాను ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్‌ సెక్రటరీ(సీఎస్‌) ముగ్గురు సీనియర్‌ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీ‌ష్‌కుమార్‌గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది.

AP Elections 2024: CM YS Jagan Speech At Repalle Road Show
చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్‌

బాపట్ల, సాక్షి: పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఒక్క పథకం, చేసిన మంచి గుర్తుకు రాదని.. 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.రేపల్లె సిద్ధమేనా? మండుటెండను లెక్క చేయకుండా వచ్చిన మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. చంద్రబాబును నమ్మడం అంటే.. మళ్లీ మోసపోటం. చంద్రముఖిని నిద్ర లేపడమే. చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే.. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు ఇదే అర్థం. ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండి.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2లక్షల 70 వేల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.. నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు వెళ్లిపోయాయి. మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది  గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా?గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఇది. మీ బిడ్డ పాలనలోనే ఈ మార్పు అంతా.ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్స్‌, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన.. చదువుల కోసం తెచ్చిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా చూసారా?..అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని తోడుగా ఉంటూ..  ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు  అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల స్వాలంబన, సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎక్కడైనా ఉందా?అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ కానుక. ఇంటి వద్దకే పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ ఇంటికే వచ్చే పాలనగానీ, పథకాలుగానీ గతంలో ఎప్పుడైనా చూశారా?.  రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా రైతుభరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర,  నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని... పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు-నేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం ఓ మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఆయన చేసిన మంచి ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని నా అవ్వాతాతలను, అక్కాచెల్లెమ్మలను అడుగుతున్నాను. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చంద్రముఖి. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను.మన రాష్ట్రం ఒక పంట పొలం అనుకుంటే.. ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యతను జగన్‌ అనే ఒక రైతుకి ఇచ్చారనుకోండి. ఆ జగన్‌ అనే మీ బిడ్డ.. మీ అన్న ఈ ఐదేళ్లలో రాష్ట్రమనేఘీ పొలంలో గడగడా చెప్పిన స్కీమ్‌లు, చేసిన మార్పులు, విప్లవాత్మకమార్పులు.. వీటినే విత్తనాలుగా ఇంటింటా అభివృద్ధి, సంక్షేమం, మంచి భవిష్యత్తు అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇవాళ్టికి ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతీ గ్రామం, పట్టణం, సామాజిక వర్గంలో నాటిన మొక్కలు ఐదేళ్లుగా పెరుగుతూ వచ్చాయి. మరో పదిహేనేళ్లలో ఇవి వృక్షాలు అవుతాయి. పిల్లలు క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. బతుకులు, తలరాతలు మారుతాయి. పేదరికం మటుమాయమైపోతుంది. ఈ బిడ్డ ప్రతీ ఆలోచన పేదవాడి బతుకు ఎలా మార్చాలనే.  మరో వంక చంద్రబాబుని చూస్తే 14 ఏళ్లు పని చేసిన ఈ పెద్దమనిషి పేరు చెబితే.. తాను ఫలానా మంచి చేశాను, స్కీమ్‌ ఇచ్చానని చెప్పుకోలేని స్థితి. ఆయన మోసాలు గమనించాలి. చంద్రబాబు అధికారం వస్తే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్‌లెంట్‌ చూస్తే అర్థమవుతుంది.ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్‌ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. ప్రధాన హామీల పేరుతో సంతకం పెట్టిన ఈ పాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కాచెల్లెమ్మల పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు,  ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?.మూడో ముఖ్యమైన హామీ.. అక్కా మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఒక్కరి ఖాతాలో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ముఖ్యమైన హామీల్లోనాలుగోది.. ఇంటింటికీ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఐదో హామీ.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు.  ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, చేనేత పవర్‌ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు.. అయ్యిందా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు.. చేశాడా?.  సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? మన రేపల్లెలో ఏమైనా కనిపిస్తోందా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నా. కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నా. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?..ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. ఇదే చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ అంట నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఇలాంటి మోసగాళ్లతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్‌ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్‌ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు.. సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈవూరు గణేష్, ఎంపీ అభ్యర్థిగా నందిగాం సురేష్‌లపై‌పై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను అని చెబుతూ సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.

Dimple Kapadia Throwback Story
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్‌ హీరోకు అత్తగా..

డింపుల్ కపాడియా… బాలీవుడ్‌లో ఒకప్పుడు తన అందచందాలతో భారీగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న బ్యూటీగా పేరుగాంచింది. డింపుల్ అంటేనే అందం అనేంతగా యూత్‌ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో  రిషీ కపూర్‌‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్‌. తొలి మూవీతోనే హిట్‌ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా నాటికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. డింపుల్ కపాడియా 'రుడాలి'లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ నిలచింది.16 ఏళ్ల వయసులోనే గర్భండింపుల్ కపాడియా  1957లో బొంబాయిలో ఒక సంపన్న గుజరాతీ వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలో ఆమెను అమీనా అని పిలిచేవారు కానీ డింపుల్‌గానే ఆమె పేరు స్థిరపడింది. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం బాబీలో నటించిన డింపుల్ తన కంటే 15 ఏళ్లు సీనియర్ అయిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్‌ అయినట్లు కూడా ఆప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో 1973లో డింపుల్ తనకంటే 15 ఏళ్లు పెద్దవాడు అయిన రాజేష్ ఖన్నాను పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది. బాబీ సినిమాతోనే ఆమె సినిమా కెరియర్‌కు ఫుల్‌స్టాప్‌ పడిపోయింది.  తన భర్త కోరిక మేరకు  సినిమాలను వదిలేసింది. ఈ సంఘటనలతో ఆమె స్టార్‌డమ్‌ ఒక్కసారిగా కోల్పోయింది.స్టార్‌ హీరోకు అత్తగా..1974లో ట్వింకిల్ ఖన్నాకు ఆమె జన్మనిచ్చింది. అంటే ఆమె 16 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చారు.  ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌కు పిల్లనిచ్చిన అత్తగానే కాకుండా  ప్రత్యేకమైన పాత్రలతో పలు సినిమాల్లో డింపుల్‌ కపాడియా బిజీగా ఉంది.పిల్లల కోసం విడాకులకు దూరం1982లో రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయారు. 1985లో  ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'నేను, రాజేశ్ ఖన్నా వివాహం చేసుకున్న రోజుతోనే నా జీవితం ముగిసిపోయింది. ఆపై సంతోషం కూడా ముగిసింది.' అని చెప్పింది. రాజేశ్‌ ఖన్నా తనను మోసం చేశారని డింపుల్ రోపించింది. ఆ ఆరోపణలను రాజేశ్‌ ఎప్పుడూ ఖండించలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. వీరిద్దరూ విడిపోయిన తర్వాత 1984లో, డింపుల్, రిషి కపూర్ జంటగా సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సూపర్‌ హిట్‌ అందుకుంది. తరువాతి 10 సంవత్సరాలలో వరుస హిట్లు అందుకున్న డింపుల్‌ కపాడియా బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలలో ఒకరిగా స్థిరపడింది.సన్నీ డియోల్‌తో ప్రేమకథరాజేశ్‌ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్‌ మంచి సోల్‌మేట్‌ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. 1998లో సినిమా ఛాన్స్‌లు తగ్గిపోవడంతో కొవ్వొత్తుల వ్యాపారం ప్రారంభించింది.  సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్‌.  2012 జూలై 18న రాజేశ్‌ ఖన్నా మరణించారు.ఇప్పుడేం చేస్తుందిదిల్ చాహ్తా హై, లక్ బై ఛాన్స్, కాక్‌టెయిల్, దబాంగ్, బ్రహ్మాస్త్ర, పఠాన్ వంటి చిత్రాలలో డింపుల్ కనిపించింది. 2020లో, ఆమె 62 సంవత్సరాల వయసులో క్రిస్టోఫర్ నోలన్ హిట్‌ సినిమా 'టెనెట్‌'లో సహాయక పాత్ర ద్వారా హాలీవుడ్ అరంగేట్రం చేసింది. 2024లో, ఆమె రెండు చిత్రాలలో కనిపించింది.

Delhi Liquor Case: BRS MLC Kavitha Bail Rejected
కల్వకుంట్ల కవితకు బిగ్‌ షాక్‌

న్యూఢిల్లీ, సాక్షి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఆమె వేసిన రెండు పిటిషన్లను ట్రయల్‌ కోర్టు  కొట్టేసింది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్‌ చేస్తూ కవిత విడివిడిగా బెయిల్‌పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిగింది. రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ బెయిల్‌ పిటిషన్లపై వాదనలు విన్నారు. చివరకు బెయిల్‌ నిరాకరిస్తూ ఇవాళ(సోమవారం) తీర్పు ఇచ్చారు.లిక్కర్‌ స్కాం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఆపై జ్యూడీషియల్‌ రిమాండ్‌ కింద తీహార్ జైల్లో ఉన్న కవితను.. సీబీఐ కూడా అరెస్ట్‌ చేసింది.  ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి  అక్రమార్జన  చేశారని కవితపై అభియోగాలు నమోదు చేశాయి ఇరు దర్యాప్తు సంస్థలు. మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించినందుకుగానూ ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల రూపాయల లంచం కవిత ఇచ్చారని, ఆ వంద కోట్లను సౌత్‌ గ్రూప్‌ సిండికేట్‌ నుంచి వసూలు చేశారని ఈడీ, సీబీఐలు ఆరోపించాయి. అంతేకాదు.. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్ లో 33% వాటా కవిత దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  వాదనలు ఇలా.. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఇటు ఈడీ, అటు సీబీఐ వాదించాయి. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి.అయితే కేవలం రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని, కేవలం అప్రూవర్ల స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని కవితను అరెస్ట్‌ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాదు ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: కవిత అరెస్టు అక్రమం కాదు! వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా.. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ కవిత పిటిషన్లను డిస్మిస్‌ చేశారు.రేపటితో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది. బెయిల్‌ నిరాకరిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Delhi Police seized 15 tones of spurious spices arrest three individuals
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్‌ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్‌లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్‌ సమయంలో సింగ్‌తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్‌ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్‌కు కరవాల్ నగర్‌లోని కాలీ ఖాతా రోడ్‌లో మరో ప్రాసెసింగ్ యూనిట్‌ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్‌ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.సీజ్‌చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్‌ యాసిడ్‌.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థభారత బ్రాండ్లైన ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్‌ఎస్‌ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్‌ నుంచి 2024 ఏప్రిల్‌ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్‌) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్‌ఎస్‌ఏ అధికారులు ఇటీవల తెలిపారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all