చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ | Sakshi
Sakshi News home page

చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ

Published Mon, May 6 2024 11:10 AM

Mudragada Padmanabham Serious Comments On Pawan Kalyan

సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీరియస్‌ అయ్యారు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.

కాగా, ముద్రగడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏనాడూ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్‌ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్‌ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.

అలాగే, మీ కుటుంబంలో డ్రగ్స్‌ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement
Advertisement