● ‘శారీరక వ్యాయామం అవసరం’ | Sakshi
Sakshi News home page

● ‘శారీరక వ్యాయామం అవసరం’

Published Sat, May 18 2024 5:20 AM

● ‘శారీరక వ్యాయామం అవసరం’

అరసవల్లి: ఆరోగ్యకర ఆహారపు అలవాట్లతో పాటు నిత్యం వ్యాయామం చేయాలని జిల్లా వైద్యారోగ్య శా ఖాధికారి డాక్టర్‌ బి.మీనాక్షి తెలియజేశారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థాని క కార్యాలయం వద్ద నుంచి బయల్దేరిన ర్యాలీని ఆ మె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ నేటి సమాజంలో 18 ఏళ్లు నిండిన వారికి సైతం రక్తపోటు (బీపీ) సుమారు 25 శాతం మందిలో కనిపిస్తోందని, నిత్యం వ్యాయామం లేకపోవడంతో ఒత్తిడి పెరిగిపోతుందని వివరించారు. బీపీ ని యంత్రణలో ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ తమ ఆరో గ్యం కోసం తామే వ్యాయామాన్ని నిత్య కృత్యం చేసుకునేలా అవగాహన కల్పిస్తూ నినాదా లు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికా రి డాక్టర్‌ ఈశ్వరి, మాస్‌మాడియా అధికారి పైడి వెంకటరమణ వైద్యులు సుజాత, శ్రీదేవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement