● నేటి నుంచే బ్రహ్మోత్సవాలు | Sakshi
Sakshi News home page

● నేటి నుంచే బ్రహ్మోత్సవాలు

Published Sat, May 18 2024 5:20 AM

● నేటి నుంచే బ్రహ్మోత్సవాలు

నరసన్నపేట: స్థానిక పెద్దపేటలో 150 ఏళ్ల కిందట వెలసిన వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివా రం ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాంతంలో ఎంతో గుర్తింపు కలిగిన వేంకటేశ్వర స్వామి ఆలయం ఇది. 1876లో పొట్నూరు వంశీకులు ఈ ఆల యాన్ని నిర్మించారు. 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్టీ ప్రతినిధి పి.కృష్ణప్రసాద్‌ తెలిపారు. శనివారం ఉదయం విశ్వక్సేన పూజ భగత్‌ పుణ్యాహవచనం, పరిషత్‌ విజ్ఞాపన, రుత్విక్‌ వరణం, రక్షా సూత్రాధారణ తదితర పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. అనంతరం యాగశాల ప్రతిష్ట చేపడతారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు హంస వాహనసేవ, తిరుచ్చీ సేవ, ధ్వజావరోహణం, ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వార్షిక కల్యాణం నిర్వహిస్తారు. 20న శేష వాహన సేవ, 21న అశ్వవాహన సేవ, 22న హనుమంత వాహన సేవ, 23న గరుడ వాహన సేవ, 24న సింహ వాహన సేవ, 26న గజ వాహన సేవ, 27న సూర్య ప్రభ వాహన సేవలు నిర్వహిస్తామని అర్చ కులు కృష్ణమాచార్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధి జగదీష్‌ బాబు తెలిపారు. వీటితో పాటు రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement