-
బాలీవుడ్‌నూ మడతెట్టేశాడుగా.. దటీజ్ తారక్
-
షూటింగ్... పార్టీయింగ్...
ఎన్టీఆర్ ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కోసం అక్కడే ఉన్నారు ఎన్టీఆర్. ‘వార్ 2’ షూటింగ్లో బిజీ బిజీగా ఉంటున్న ఆయన పార్టీలనూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ పార్టీలో బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. పార్టీ జరుగుతున్న హోటల్ వద్దకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎన్టీఆర్‌తో ఫొటోల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ లేడీ ఫ్యాన్ అయితే.. ‘ఎన్టీఆర్ సార్.. ఈ రోజు నా బర్త్ డే.. మీతో సెల్ఫీ దిగాలని ఉంది’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో.. ఆమెతో ఫొటో దిగారు ఎన్టీఆర్. ఇక హిందీలో ‘వార్ 2’తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. -
హిందీ వార్‌లో హాలీవుడ్ యాక్షన్
బాలీవుడ్ ‘వార్ 2’లో హాలీవుడ్ తరహా యాక్షన్ కనిపించనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారట. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట మేకర్స్. ఈ పోరాట దృశ్యాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేశారని బాలీవుడ్ సమాచారం. ఇక ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేశారు స్పిరో. కాగా స్పై జానర్లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. -
వార్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. కొత్త లుక్ ఫోటోలు వైరల్
బాలీవుడ్ ‘వార్’లో అడుగుపెట్టేశారు జూనియర్ ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయనే విషయం తెలిసిందే.. హృతిక్‌రోషన్‌కు సంబంధించిన చాలా సీన్లు మేకర్స్ చిత్రీకరించేశారు. తాజాగా తారక్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్లో తారక్ పాల్గొననున్నారు. వార్2 కోసం ఎన్టీఆర్ 60రోజులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హృతిక్, తారక్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిద్దరు కలిసి మొత్తంగా 30 రోజుల పాటు కలిసి షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్ పనులతో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. 2024 అక్టోబర్ 10న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై వెంటనే ప్రశాంత్ నీల్‌తో తారక్ సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తారక్ వచ్చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియాలో తారక్ క్రేజీ భారీగా పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by ɴᴛʀ ғᴀɴs ᴄʟᴜʙ™ (@ntrloversoffl) -
వార్‌కు రెడీ!
బాలీవుడ్ ‘వార్’కు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ మొదలైందని, హృతిక్‌రోషన్ పాల్గొనగా కొంత చిత్రీకరణ కూడా జరిపారని టాక్. కాగా ఈ వారంలో ‘వార్ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట అయాన్ ముఖర్జీ. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్‌కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్‌తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్‌క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement