మేకపాటి రాజమోహన రెడ్డి
యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి నోటీస్ను స్పీకర్కు అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఒక్క సభ్యుడు ఇచ్చినా స్పీకర్ స్వీకరిస్తారు. అయితే అవిశ్వాస తీర్మానానికి సభలో కనీసం 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతిస్తారు.
గతంలో మేకపాటి ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీస్ను స్పీకర్ మీరాకుమార్ లోక్సభలో చదివి వినించారు. సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానం చేపట్టలేకపోతున్నట్లు ఆమె తెలిపారు. సభ సజావుగా జరిగితే ఈ రోజు ఇచ్చిన నోటీస్ను మధ్యాహ్నం చర్చకు స్వీకరించే అవకాశం ఉంటుంది.


