'ఆ పరీక్ష పరికరాల్లో తేడా ఉందనిపిస్తోంది' | will more difference between our Sugar tests another reports, says GGH RMO ramesh | Sakshi
Sakshi News home page

'ఆ పరీక్ష పరికరాల్లో తేడా ఉందనిపిస్తోంది'

Oct 11 2015 10:04 PM | Updated on Oct 9 2018 7:52 PM

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి షుగర్ పరీక్షలు చేస్తున్న పరికరాల్లో తేడా ఉందనిపిస్తోందని జీజీహెచ్ ఆర్ఎఓ రమేష్ అనుమానం వ్యక్తం చేశారు.

గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి షుగర్ పరీక్షలు చేస్తున్న పరికరాల్లో తేడా ఉందనిపిస్తోందని జీజీహెచ్ ఆర్ఎఓ రమేష్ అనుమానం వ్యక్తం చేశారు. వేరే వాళ్లు చేసిన పరీక్షలకు.. తమ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పరికరాలనే తాము వాడుతున్నామని తెలిపారు. అయితే గ్లూకో మీటర్లలో తేడా ఉందో లేదో తాము రేపు చెక్ చేస్తామన్నారు.

ఇప్పటివరకు హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదన్నారు. వైద్య పరీక్షల వివరాలు తాము కూడా పత్రికల్లో చూస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు. బీపీ 100/60 పల్స్, 74, షుగర్ 88, బరువు 73.2 కిలోలు ఉందన్నారు. వేరే పరికరాలతో చేసిన రిపోర్టుకు.. తమ రిపోర్టుకు తేడా ఉందని రమేష్ అన్నారు. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటికీ మూడు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు జీజీహెచ్ ఆర్ఎఓ రమేష్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement