ఆ సన్నాసి ఏ సన్నాసితో మాట్లాడినాడో... | T Congress Leader Mallu Bhatti Vikramarka fires on CM KCR | Sakshi
Sakshi News home page

ఆ సన్నాసి ఏ సన్నాసితో మాట్లాడినాడో...

Jun 19 2015 2:52 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఆ సన్నాసి ఏ సన్నాసితో మాట్లాడినాడో... - Sakshi

ఆ సన్నాసి ఏ సన్నాసితో మాట్లాడినాడో...

‘ఆ సన్నాసి ఏ సన్నాసితో మాట్లాడినాడో... కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనాయకులతో మాట్లాడలేదు’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ...

కేసీఆర్‌పై భట్టి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘ఆ సన్నాసి ఏ సన్నాసితో మాట్లాడినాడో... కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనాయకులతో మాట్లాడలేదు’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ తెలంగాణపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, బి.బిక్షమయ్యతో కలసి గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు కోట్లు వ్యవహారంలో కాంగ్రెస్ నేతలను సన్నాసులు అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘కాంగ్రెస్‌లో ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికే ఓటేశారు.

డబ్బుకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్ పార్టీలో లేరని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ‘చంద్రబాబు గాలం వేసినట్టుగా కాంగ్రెస్ సన్నాసులకు నేనే చెప్పిన’ అని సీఎం కేసీఆర్ మాట్లాడడం సరికాదు. ఆ సన్నాసి (సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ) ఏ సన్నాసితో మాట్లాడినాడో తెలియదు. కాంగ్రెస్ వారితో మాత్రం మాట్లాడలేదు’ అని భట్టి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement