'దళితుడు కాలేదు, దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు' | Revanth Reddy criticises KCR | Sakshi
Sakshi News home page

'దళితుడు కాలేదు, దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు'

Oct 10 2014 6:43 PM | Updated on Sep 18 2018 8:28 PM

'దళితుడు కాలేదు, దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు' - Sakshi

'దళితుడు కాలేదు, దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలుగుదేశం నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

నల్లగొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలుగుదేశం నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితుడుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రజల్ని కేసీఆర్ మోసగించాడాని ఆయన విమర్శించారు. అయితే తెలంగాణకు ఓ దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 
 
మంత్రులను టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్లవద్ద కాపలా పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించాడు. టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకు రాకపోతే మంత్రి పదవుల నుంచి తప్పిస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బులు పెట్టి కరెంట్ కొంటుంటే.. డబ్బులు మూట కట్టి కేసీఆర్ రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు. బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం చాతకాకపోతే... చంద్రబాబును ఒప్పించి మేమే విద్యుత్ తీసుకువస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement