భారత్-పాక్ మ్యాచ్ ఫిక్సింగా? | Was India-Pak cricket match fixed? | Sakshi
Sakshi News home page

భారత్-పాక్ మ్యాచ్ ఫిక్సింగా?

Feb 16 2015 11:34 AM | Updated on Sep 2 2017 9:26 PM

భారత్-పాక్ మ్యాచ్ ఫిక్సింగా?

భారత్-పాక్ మ్యాచ్ ఫిక్సింగా?

ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ గెలుపు ఏకపక్షంగా సాగిందనటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పాక్పై టీమిండియా 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

పాకిస్తాన్కు చెందిన అస్లాం ఖాన్ తనోలి అనే వ్యక్తి ఆదివారం ఉదయం 11 గంటలకే ఖచ్చితమైన స్కోర్లను ట్వీట్ చేయటం ఈ అనుమానానికి ఊతం ఇస్తోంది.  అస్లాం ఖాన్ తన ట్విట్టర్ అకౌంట్లో 'భారత్ 300 పరుగులు, పాకిస్తాన్ 220 పరుగులు చేస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నా. ఈ అంకెల్లో ఎలాంటి మార్పులుండవు' అని పోస్ట్ చేశాడు. కచ్చితంగా అతను ట్వీట్ చేసిన అంకెలకు దగ్గరగానే స్కోర్లు ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అస్లాం ఖాన్ అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగాడనే ప్రశ్న తలెత్తుతోంది.

అయితే అస్లాం ఖాన్ జ్యోతిష్కుడు కాదు. మరి అతడు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగాడు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్గా మారింది. కాగా అస్లాం ఖాన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ యూత్ వింగ్లో పనిచేస్తున్నాడు. అలాగే అతడు తన ట్వీట్లో మ్యాచ్ చివర్లో ఐదు ఫోర్లు వస్తాయని కూడా చెప్పాడు. అది కూడా ఆదివారం మ్యాచ్లో మనం గమనించాల్సిన విషయం.  ఏదైతేనేమీ అస్లాం ఖాన్ చెప్పినట్లు టీమిండియా మాత్రం ఘన విజయం సాధించటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement