చారిత్రక నవలా ఝరి నోరి


తెలుగువారికి ఘనమైన గతం ఉంది. అందులో ఉత్థానపతనాలు రెండూ ఉన్నాయి. చారిత్రక నవల వికసించడానికి కావలసిన  తాత్వికత కూడా గుబాళిస్తూనే ఉంటుంది. అయినా ఆ ప్రక్రియ తగురీతిలో పరిఢవిల్లలేదన్నది నిజం. ఈ లోటును తీర్చడానికి కం కణం కట్టుకున్న మహనీయుడు కవిసమ్రాట్ నోరి నరసింహశాస్త్రి. చారిత్రకతనే కాదు, నాటి వాతావరణాన్ని కూడా ఆయన తన రచ నలలో అద్భుతంగా ఆవిష్కరించారు. పురాణ వైర గ్రంథమాల, కాశ్మీర రాజుల చరిత్ర (విశ్వనాథ), పిరదౌసి (జాషువా), గోన గన్నారెడ్డి, నారాయణరావు (అడవి బాపిరాజు), చదువు (కొకు) వంటివారు కొందరు చరిత్రకు, సమకాలీన చరిత్రకూ నవలారూపం ఇచ్చినా నోరి వారి నవలలకు ప్రత్యేకం స్థానం ఉంది. ఆయన మన కు అందించిన నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి, వాఘిరా, కవిద్వయం, కవిసార్వ భౌముడు, ధూర్జటి ఇందుకు గొప్ప నిదర్శనం. కవిద్వయం నవలలో చూస్తే నోరివారి చారి త్రక దృష్టి అవగతమవుతుంది. శ్రీనాథుడు, పోతనామాత్యుడు ప్రధాన పాత్రలుగా సాగే ఈ నవలలో ఆనాటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. కొన్ని నాటకాలు,  చలనచిత్రాలు ఆ మహాకవులిద్దరినీ సమ వయస్కులుగా చూపించిన మాటవాస్తవం. కానీ శ్రీనాథకవికి ఎనభైయేళ్ల వయసు ఉన్న పుడు పోతన వయసు ఇరవైకి లోపు. దీనిని నోరివారు ఆవిష్కరించారు. భాగవతావరణ, ఖేమాభిక్షు (బుద్ధుని జీవితం నుంచి) వంటి చారిత్రక నాటికలను కూడా నోరి రచించారు.

 

 (త్యాగరాయ గానసభలో నోరి 115 జయంతి వేడుక నేడు)

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top