వినాయక చవితికి రెండో పాట | Yuddham Sharanam second Single Launch | Sakshi
Sakshi News home page

వినాయక చవితికి రెండో పాట

Aug 23 2017 12:43 PM | Updated on Sep 17 2017 5:53 PM

వినాయక చవితికి రెండో పాట

వినాయక చవితికి రెండో పాట

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల రాఖీ సందర్భంగా చిత్రయూనిట్ ఓ ఫ్యామిలీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఆ పాటతో సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ పరిచయం చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేస్తోంది. వినాయకచవితికి ఒక రోజు ముందుగానే సినిమాలోని రెండో పాటను రిలీజ్ చేయనున్నారు. నాగోల్ లోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పాటను లాంచ్ చేయబోతున్నట్టు హీరో నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement