ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట! | Angelina Jolie, Brad Pitt heading for splitsville? | Sakshi
Sakshi News home page

ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!

Jan 22 2016 6:02 PM | Updated on Sep 3 2017 4:07 PM

ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!

ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!

ఈ ఏడాది సెలబ్రిటీ దంపతులకు ఏమాత్రం కలిసివచ్చినట్టు కనిపించడం లేదు.

ఈ ఏడాది సెలబ్రిటీ దంపతులకు ఏమాత్రం కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. అన్యోన్యంగా తిరిగిన వాళ్లు, చెట్టాపట్టాలేసుకొని మీడియా ముందు కనిపించిన వారూ.. చిలుకా గోరింకలు అంటే ఉదాహరణ అనిపించిన జంటలు సైతం ఈ ఏడాది మొదలైంది మొదలు తలోబాట పడుతున్నారు. ఇన్నాళ్ల బంధానికి విడాకులు ఇస్తూ వేరవుతున్నారు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్‌, కత్రినా కైఫ్‌ల మధ్య బ్రేకప్‌ ఖాయమైపోయింది. 16 ఏళ్ల పెళ్లి బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ ఫర్హాన్ అఖ్తర్, అధునా అఖ్తర్ వేరవుతున్నట్టు ప్రకటించారు. ఇక జాబితాలో చేరేదిశగా హాలీవుడ్‌లోనే అన్యోన్యమైన జంటగా పేరొందిన ఏంజిలీనా జోలీ, బ్రాడ్‌ పిట్ సాగుతున్నారు.

నిజమే ఈ దంపతుల అభిమానులకు ఇది షాకింగ్ వార్తనే. అయినా వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట తమ అందమైన వైవాహిక అనుబంధానికి తెరదించేదిశగా సాగుతున్నదని హాలీవుడ్‌లైఫ్‌.కామ్‌ వెల్లడించింది. తనకున్న సమయాన్ని ఏంజెలీనా పిల్లలు, సామాజిక కార్యక్రమాలకు వెచ్చించడంతోనే సరిపోతున్నదని, దీంతో బ్రాడ్‌తో గడుపడానికి ఆమె వద్ద పెద్దగా సమయం ఉండటం లేదని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. అంతేకాకుండా ఏంజిలీనాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, దీంతో ఆమె తరచూ అజ్ఞాతంలో గడుపుతుండటం బ్రాడ్ భరించలేకపోతున్నాడని, ఈ నేపథ్యంలో తమ అనుబంధాన్ని తెంచుకోవాలని ఈ జంట నిర్ణయించిందని ఆ వెబ్‌సైట్‌ తన కథనంలో తెలిపింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement