
‘మాది ఒబామా సర్కార్ కాదు.. సంగతి తేలుస్తాం’
ఇరాన్ విషయంలో కఠినంగా ఉండాలని అమెరికా నిర్ణయించింది. తాము అణు క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు ఇరాన్ బుధవారం స్పష్టం చేసిన నేపథ్యంలో గుర్రుమన్న అమెరికా ఇరాన్‌పై ఒక కన్నేసి ఉంచాలని, ప్రత్యేక నోటీసులు సంబంధిత అధికారులకు సూచించిందట.
వాషింగ్టన్: ఇరాన్ విషయంలో కఠినంగా ఉండాలని అమెరికా నిర్ణయించింది. అణు క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు ఇరాన్ బుధవారం స్పష్టం చేసిన నేపథ్యంలో గుర్రుమన్న అమెరికా ఇరాన్‌పై ఒక కన్నేసి ఉంచాలని, ప్రత్యేక నోటీసుల్లో సంబంధిత అధికారులకు సూచించిందట. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైఖెల్ ఫ్లిన్ చెప్పారు. ట్రంప్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా బహిరంగంగా మాట్లాడుతూ నేరుగా గతంలో ఉన్న బరాక్ ఒబామా ప్రభుత్వాన్ని విమర్శించారు.
టెహ్రాన్ చేస్తున్న అడ్డగోలు మాలిన్య చర్యలకు ప్రతిస్పందించడంలో ఒబామా సర్కార్ ఘోరంగా విఫలమైందని, ఆ కారణంగానే ఇప్పుడు ఇరాన్ బీరాలు పోతుందని అన్నారు. ఇటీవల యెమెన్‌లో ఇరాన్ జరిపిన అణు క్షిపణుల పరీక్షలు, ఇరాన్‌ను బలపరిచే ఇతరుల చేష్టలు టెహ్రాన్ దుశ్చర్యలకు నిదర్శనం అన్నారు. ఇప్పుడు ఇరాన్ ఒక దుర్భలమైన దేశంగా భావిస్తోందని, దీనంతటికీ కారణం ఒబామా సర్కార్ ఫేలవమైన తీరు ప్రదర్శించడమేనని చెప్పారు. ఇక నుంచి ఇరాన్‌ను ప్రత్యేకంగా గుర్తుంచుకొని తీరుతామని, ఎప్పటికప్పుడు ఆ దేశ కదలికలు పసిగడతామని అన్నారు. తమది ఒబామా సర్కార్‌లాగా ఉదాసీనంగా ఉండే ప్రభుత్వంకాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.