బాబుపై అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు | Cases in police stations all over on chandrababu | Sakshi
Sakshi News home page

బాబుపై అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు

Feb 10 2016 2:25 AM | Updated on Aug 14 2018 11:26 AM

బాబుపై అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు - Sakshi

బాబుపై అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు

కుల దురహంకారంతో దళితుల్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్ని పోలీసు స్టేషన్లలో

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

 హైదరాబాద్: కుల దురహంకారంతో దళితుల్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్ని పోలీసు స్టేషన్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. దళితులపట్ల చంద్రబాబు వివక్ష చూపారని, ఆయన వ్యాఖ్యలు దళిత జాతిని తీవ్రంగా కించపరిచాయన్నారు. కులాలు ఓట్లేస్తే గెలవలేమని చెబుతున్న చంద్రబాబుకు.. 2014 ఎన్నికల్లో మాదిగలు, కాపులు ఓట్లేయలేదా? తుని ఘటన, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందని ఎద్దేవా చేశారు.

ముద్రగడ దీక్షకు తాను వెళ్లకపోయినా మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పడం ఎంతవరకూ సమంజసమని, బీసీలకు నష్టం కలుగుతుందన్న ఆలోచనతోనే కాపు రిజర్వేషన్లకు ఎమ్మార్పీఎస్ మద్దతివ్వలేదని చెప్పారు.  కాగా, చంద్రబాబు దళితులను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలపై వెంటనే అంబేడ్కర్ పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా దళిత క్రిష్టియన్ జేఏసీ కన్వీనర్ గద్దపాటి విజయరాజు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement