‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సంపాదకీయంకథ

కువైట్‌లో చాకిబండ వాసి మృతి

Sakshi | Updated: January 11, 2017 22:49 (IST)

చిన్నమండెం(రాయచోటి రూరల్‌):  చిన్నమండెం మండల పరిధిలోని చాకిబండ గ్రామం బలిజపల్లెకు చెందిన పి. నాగరాజ(38) శనివారం కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అతని సమీప బంధువులు పేర్కొన్నారు. జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లి, నిత్యం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వస్తున్న వ్యక్తి ఆకస్మికంగా రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, భార్య లక్ష్మీ కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామం బలిజపల్లెలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందడంతో భార్య, పిల్లలు దీపక(8), రిషిక(4), శ్రీహాన్‌(2)లు ఆదరణ కోల్పోయారు. ప్రభుత్వం సాయం అందించి కుటుంబానికి అండగా ఉండలాని పలువురు కోరుతున్నారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

బీసీ కులాలకు బడ్జెట్‌ భరోసా

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC