హుదూద్ ప్రాంతాల్లో రేపు వైఎస్ జగన్ పర్యటన | YS Jagan to visit Hudhud cyclone-hit areas | Sakshi
Sakshi News home page

హుదూద్ ప్రాంతాల్లో రేపు వైఎస్ జగన్ పర్యటన

Oct 13 2014 2:37 PM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ జగన్మోహన రెడ్డి - Sakshi

వైఎస్ జగన్మోహన రెడ్డి

హుదూద్ పెను తుపాను బీభత్సం సృష్టించిన ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రేపు పర్యటించనున్నారు.

హైదరాబాద్: హుదూద్ పెను తుపాను బీభత్సం సృష్టించిన ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రేపు పర్యటించనున్నారు. ఈ తుపాను ఉత్తరాంధ్రను వణికించిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాలో భారీ నష్టం సంభవించింది. ఈ ప్రాంతాలలో పర్యటించేందుకు జగన్మోహన రెడ్డి రేపు విశాఖపట్నం వెళుతున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాద రావు చెప్పారు.

జగన్ ఇక్కడ నుంచి రాజమండ్రి వరకు విమానంలో వెళతారని చెప్పారు. అక్కడ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు మార్గంలో కారులో వెళతారన్నారు. కారు వెళ్లే అవకాశం లేని చోట్లకు ద్విచక్రవాహనంపై వెళతారని చెప్పారు. అవసరమైతే కాలినడకన కూడా వెళ్లి బాధితులను పరామర్శిస్తారన్నారు. తుపాను సహాయ కార్యక్రమాలు ముగిసే వరకు జగన్ అక్కడే ఉంటారని ధర్మాన చెప్పారు.

వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు తుపాను సహాయ కార్యక్రమాలలో విధిగా పాల్గొనాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ నెల 16న పార్టీ ఆధ్వర్యంలో చేయతలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ధర్మాన తెలిపారు.
**

Advertisement
 
Advertisement
Advertisement