ఓటుకు నోటుపై రేపు గవర్నర్ కు వైఎస్ జగన్ ఫిర్యాదు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు.
హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధిష్టానంపై వైఎస్ జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి వైఎస్ జగన్ రాజ్భవన్లో గవర్నర్ తో సమావేశంకానున్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు ప్రయత్నించి.. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సంగతి తెలిసిందే.


