
మార్చి 1 నుంచి జగన్ జనభేరి
మార్చి 1న తిరుపతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జనభేరి ప్రారంభిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
తిరుపతి: మార్చి 1న తిరుపతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జనభేరి ప్రారంభిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. భగవంతుడి సన్నిధి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంన్నారు. రాజన్నరాజ్యం జగన్ ద్వారానే సాధ్యం అని ఆయన చెప్పారు.
జగన్ రాక కోసం ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. మార్చి 1న సాయంత్రం లీలామహల్ సెంటర్‌లో బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. అదే రోజు తిరుపతిలో రెండు కుటుంబాలను జగన్ ఓదారుస్తారన్నారు.
బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని, అక్కడ ఏర్పాట్లను పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి పరిశీలించారు.