రాజధాని కట్టాలంటే 20 ఏళ్లు పడుతుంది: పవన్

రాజధాని కట్టాలంటే 20 ఏళ్లు పడుతుంది: పవన్ - Sakshi


ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని నగరం కట్టాలంటే దానికి 20 సంవత్సరాలు పడుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి సభల్లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రాజధాని నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని, అయితే ఇష్టంలేని గ్రామాల్లో మాత్రం భూములు లాక్కోవద్దని పవన్ అన్నారు. భూసేకరణ చట్టంతో చిన్న కమతాలున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...


  • చంద్రబాబుకు పాలనా అనుభవం ఉందనే మద్దతు ఇచ్చా

  • ఈ క్షణం వరకు కూడా ఆయనంటే గౌరవం ఉంది.

  • ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ క్షణం వరకు నేను బయటకు రాలేదు

  • సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.. ప్రజా సమస్యలను వారే చూసుకుంటారు

  • భూసమీకరణలో భాగంగా అన్ని గ్రామాల ప్రజలు భూములు ఇవ్వడం ఆనందం కలిగించింది.

  • ఎందుకంటే, భూసేకరణ అన్నది చాలా ఇబ్బంది కలిగించే అంశం

  • సింగపూర్ నిర్మాణానికి 50 సంవత్సరాలు పట్టింది

  • టీడీపీయే కాదు.. అన్ని పార్టీలూ బాధ్యతగా ఉండాలి

  • స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు కూడా భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

  • చంద్రబాబు పాలనాదక్షత ఉన్న వ్యక్తి. ఆ భయాలు అక్కర్లేదనే అనుకుంటున్నా

  • మనకు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పింది.. ఇప్పటివరకు ఈ ఊసు ఎత్తలేదు

  • రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు, మాఫీచేయాలని అనుకున్నారు

  • కానీ దానికి తగ్గ నిధుల్లేవు. ఆ నిధులు ఎలా సమీకరించాలన్నదే సమస్య

  • మలేషియా రాజధాని పుత్రజయను 8వేల ఎకరాల్లో ప్రారంభించారు

  • ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అది 16 వేల ఎకరాలకు విస్తరించింది

  • స్వచ్ఛందంగా భూములు ఇచ్చినవాళ్లు అలాగే నిలబడాలి

  • పోలవరం ప్రాజెక్టుకు వేలకోట్లు ఇస్తామని చెప్పి.. రూ. 100కోట్లే ఇచ్చారు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top