ఇప్పటికైనా చంద్రబాబు అప్రూవర్గా మారాలి.. | C Ramachandraiah takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా చంద్రబాబు అప్రూవర్గా మారాలి..

Jun 4 2015 1:39 PM | Updated on Mar 18 2019 7:55 PM

ఇప్పటికైనా చంద్రబాబు అప్రూవర్గా మారాలి.. - Sakshi

ఇప్పటికైనా చంద్రబాబు అప్రూవర్గా మారాలి..

రేవంత్రెడ్డి ఓటుకి నోటు వ్యవహారంలో రాష్ట్ర ప్రజలు తలవంచుకునేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య గురువారం హైదరాబాద్లో ఆరోపించారు.

హైదరాబాద్: రేవంత్రెడ్డి ఓటుకి నోటు వ్యవహారంలో రాష్ట్ర ప్రజలు తలవంచుకునేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య గురువారం హైదరాబాద్లో ఆరోపించారు. ఆంధ్రుల అభిమానాన్ని దిగజార్చారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పు ఒప్పుకుని అప్రూవర్గా మారి తన గౌరవాన్ని పెంచుకోవాలని ఆయనకు రామచంద్రయ్య హితవు పలికారు.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్ ఎందుకు వచ్చినట్లు అని ఆయన ప్రశ్నించారు. పీయూష్ గోయల్... తన మిత్రుడు చంద్రబాబుని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ప్రధాని మోదీ మాత్రం చంద్రబాబును రక్షిస్తారన్న నమ్మకం లేదన్నారు. ఇంత జరిగాక కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగడం సరికాదన్ని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.

వెంటనే చంద్రబాబు రాజీనామా చేసి... సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉంటే... కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ అవినీతిమయమవుతాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రేవంత్ విచారణ నిష్పక్షపాతంగా జరగదన్నారు. చంద్రబాబు సర్కార్ నిండా అవినీతిలో మునిగిపోయిందని సి. రామచంద్రయ్య అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement