కేసీఆర్పై ఏపీలో 87 కేసులున్నాయి: యనమల | 87 cases filed on kcr in andhra pradesh, says yanamala ramakrishnudu | Sakshi
Sakshi News home page

కేసీఆర్పై ఏపీలో 87 కేసులున్నాయి: యనమల

Jun 16 2015 3:49 PM | Updated on Aug 27 2018 8:44 PM

కేసీఆర్పై ఏపీలో 87 కేసులున్నాయి: యనమల - Sakshi

కేసీఆర్పై ఏపీలో 87 కేసులున్నాయి: యనమల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87 కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు.

చంద్రబాబుతో మంత్రుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ ప్రతిచర్య కూడా తప్పనిసరిగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అధికారం ఉంటే, తమకూ ఆ అధికారం ఉంటుందని యనమల చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement