Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌(PC: BCCI/Jio Cinema)
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌

ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌ కథ ముగిసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్‌ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్‌ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్‌ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్‌ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో రిలీ రొసోవ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్‌ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్‌ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్‌ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్‌ గోయెంకాకు చురకలుమ్యాచ్‌ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్‌ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. ‌చదవండి: ద్రవిడ్‌ గుడ్‌ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్‌?.. జై షా కామెంట్స్‌ వైరల్‌Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024

 AP Election May 9th Politics Latest News Updates Telugu
మే 9: ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు

ఏపీలో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌..

 Daily Horoscope: Rasi Phalalu On 11-05-2024 In Telugu
Rasi Phalalu: ఈ రాశి వారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.చవితి తె.4.45 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి పంచమి, నక్షత్రం: మృగశిర ప.12.30 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.9.02 నుండి 10.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.15 వరకు,అమృతఘడియలు: రా.2.44 నుండి 4.19 వరకుసూర్యోదయం : 5.34సూర్యాస్తమయం : 6.18రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: పనులు చకచకా పూర్తి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త వస్తువులు కొంటారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.వృషభం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.మిథునం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.కర్కాటకం: పనుల్లో ప్రతిబంధకాలు. ఇంటాబయటా వ్యతిరేకత. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కన్య: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అ«ధిగమిస్తారు.తుల: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.వృశ్చికం: ఆరోగ్య సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలలో అవాంతరాలుల. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.ధనుస్సు: పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ధనప్రాప్తి. ధార్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటుంది.మకరం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కుంభం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.మీనం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూముల వ్యవహారాలలో చికాకులు. ధనవ్యయం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

Actress Laila Khan Death Mystery Revealed
నటి దారుణ హత్య.. 13 ఏళ్ల తర్వాత దోషిని తేల్చిన కోర్టు

దాదాపు 13 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ప్రముఖ నటి కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆమెని దారుణంగా హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది. ఈ క్రమంలోనే విచారణ పూర్తవగా.. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. సవతి తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసి అందరూ షాకవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?1978లో ముంబయిలో పుట్టి పెరిగిన రేష్మా పటేల్.. సినిమాల్లోకి వచ్చేటప్పుడు లైలా ఖాన్ అని తన పేరు మార్చుకుంది. 2002లో కన్నడ మూవీతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ రాజేశ్ ఖన్నాతో చేసిన 'వాఫా'.. ఈమెకు ఓ మాదిరి గుర్తింపు తీసుకొచ్చింది. 2011లో 'జిన్నాత్' అనే సినిమా చేస్తుండగా.. విరామం రావడంతో కుటుంబంతో కలిసి ట్రిప్‌కి వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది.(ఇదీ చదవండి: రొమాంటిక్ సీన్స్.. నాకు ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్)దీంతో లైలా తండ్రి నాదిర్ పటేల్.. తన కుటుంబ సభ్యులు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ మొదలుపెట్టారు. నటి మొబైల్ సిగ్నల్ చివరగా నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించారు. లైలాకు అక్కడ ఫామ్ హౌస్ ఉందని తెలిసి పోలీసులు వెళ్లగా.. అది కాస్త కొంతవరకు అగ్ని ప్రమాదానికి గురై ఉంది. కొన్నాళ్ల తర్వాత జమ్ము కశ్మీర్‌లో వీళ్ల వాహనం దొరకడంతో కేసు క్లిష్టంగా మారింది. అయితే లైలాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ మాత్రం దొరకలేదు.లైలా సవతి తండ్రి పర్వేజ్ తక్‌పై ఎందుకో పోలీసులకు అనుమానమొచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి విషయంలో గొడవ జరిగిందని.. దీంతో భార్య షెలీనాను చంపి ఆ తర్వాత లైలా-ఆమె అక్క అమీనా, కవలలు జారా-ఇమ్రాన్, కజిల్ రేష్మాని హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత బంగ్లా నుంచి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలని వెలికి తీశారు. మొత్తంగా 40 మందిని విచారించారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబై సెషన్స్ కోర్టు.. పర్వేజ్‌ని ఈ కేసులో దోషిగా తేల్చింది. మే 14న శిక్ష ఖరారు చేయనుంది.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్‌బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం)

Aiyar, Pitroda, Raut Are Jokers, Says Shivraj Singh Chouhan
ఆ ముగ్గురు రాజకీయ జోకర్లు.. మాజీ సీఎం సెటైర్లు

బీజేపీ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కాంగ్రెస్‌, శివసేన నేతలను జోకర్లుగా అభివర్ణించారు. ఆ ముగ్గురు రాజకీయ జోకర్లుకాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, శామ్‌ పిట్రోడా, శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోకర్లని, వాళ్లని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో హాస్యాస్పదమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇలా చేస్తూనే ఉంటారు. ప్రజలు వాటిని ఎంటర్‌టైన్‌గా భావిస్తారని తెలిపారు. ఎవరూ సీరియస్‌గా తీసుకోరువారి స్థాయి కంటే దిగజారి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప‍్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో రాజకీయ జోకర్లుగా మారారు. అయ్యర్, పిట్రోడా, రౌత్‌లను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు అని చౌహాన్ వ్యాఖ్యానించారు. 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ‘ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు మేధోపరంగా దివాళా తీశారు. ఇది మునుపటి బలహీనమైన యూపీఏ ప్రభుత్వం కాదని, 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం’ అని ఇదే విషయాన్ని అయ్యర్ గమనించాలి చౌహాన్ సూచించారు.భారత్‌ అంటే అభివృద్దికి కేరాఫ్‌ అడ్రస్‌మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన చౌహాన్‌.. ‘భారత్‌ అంటే అభివృద్దికి కేరాఫ్‌ అడ్రస్‌. దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టి అభివృద్ధి బాటలు వేశారని అన్నారు. అదే సమయంలో దేశానికి ఇబ్బంది కలిగించే ఎవరినీ విడిచిపెట్టరని హెచ్చరించారు.ప్రపంచ దేశాలకు భారత్‌ విశ్వ గురువు ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం విశ్వ గురువుగా మారుతుంది. ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాంగ్రెస్ మరో ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడవలసి ఉంటుంది. కానీ అలా చేయడానికి తగినంత మంది సభ్యులు ఉండరు’ అని చౌహాన్ నొక్కాణించారు.

Delhi Court Orders Framing Charges Against Brij Bhushan Sharan Singh
బ్రిజ్​భూషణ్​కు షాక్​.. రౌస్‌ అవెన్యూ కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ : జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై అభియోగాలు మోపాలని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని కోర్టు పేర్కొంది. బ్రిజ్ భూషణ్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 354-ఎ (లైంగిక వేధింపులు), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఫెడరేషన్ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పై కూడా సెక్షన్ 506 కింద అభియోగాలు మోపాలని పోలీస్‌ శాఖకు కోర్టు సూచించింది. గత ఏడాది జూన్‌లోలైంగిక వేధింపుల కేసులో గత ఏడాది జూన్‌లో బ్రిజ్ భూషణ్,అతని సహచరుడు వినోద్ తోమర్‌పై ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. ఛార్జిషీట్‌లో ఐపీసీ సెక్షన్‌లు 354 (దౌర్జన్యం లేదా నేరపూరిత శక్తి), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంబడించడం), 109 (ప్రేరేపణ), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు.1,500 పేజీల ఛార్జిషీట్‌లోపోలీసులు 1,500 పేజీల ఛార్జిషీట్‌లో బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలకు మద్దతుగా రెజ్లర్లు, ఒక రిఫరీ, ఒక కోచ్, ఫిజియోథెరపిస్ట్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది సాక్షుల వాంగ్మూలాలను చేర్చారు.నో టికెట్‌ఉత్తర్‌ ప్రదేశ్‌ కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్‌భూషణ్‌ ప్రాతినిధ్యం వహించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో సాక్షి మలిక్‌, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‌ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ సారి కైసర్‌గంజ్‌ స్థానంలో పార్టీ ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌కు అవకాశం కల్పించింది. కాగా, గత నెలలో కరణ్‌ భూషణ్‌ సింగ్‌ ఎంపీగా నామినేషన్‌ వేసే సమయంలో 10 వేలమంది బ్రిజ్‌భూషణ్‌ అనుచరులు.. 700 వాహనాలతో తరలివచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

Laapataa Ladies Pratibha Ranta On Her Journey In Bollywood
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్‌ ప్రతిభ ఇంట్రస్టింగ్‌ జర్నీ

బాలీవుడ్‌ దర్శకురాలు కిరణ్‌రావు (బాలీవుడ్‌ హీరో ఆమీర్‌ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్‌ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు, అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది. సిమ్లా టూ బాలీవుడ్‌ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్‌ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్‌ హువా టీవీ సీరియల్‌తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్‌ చేస్తుండగా కిరణ్‌ రావు దృష్టిలో పడింది. అలాలాపతా లేడీస్‌లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్‌కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్‌ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్‌తో, ముఖ్యంగా లాపతా లేడీస్‌ 'జయ' పాత్రలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్‌లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా రాంటాసందేశనా రాంటా,, రాజేశ్‌ రాంటా దంపతుల కుమార్తె ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్‌ అంటే ఇష్టం. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్‌ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్‌గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్‌లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్‌లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది. 2018లో మిస్ ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్‌ ముంబై అందాల పోటీల్లో మిస్‌ ముంబై కిరీటం గెలుచుకుంది. దీంతో కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్‌ హువా’ టీవీ సీరియల్‌ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్‌ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్‌ ఆఫర్‌ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

We Have Already Given Looted Money Said Modi
ఆ సొమ్మును తిరిగి పేదలకే అందిస్తాం.. ప్రధాని మోదీ స్పష్టత

అవినీతి పరులు ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు ఎలా ఇవ్వాలనే దానిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అవినీతి బాధితులకు ఇప్పటికే రూ.17,000 కోట్లు తిరిగిచ్చామని అన్నారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో స్వాధీనం చేసుకున్న డబ్బులో మరో రూ. 1.25 లక్షల కోట్లను బాధితులకు తిరిగి ఇవ్వనున్నట్లు ప్రధాని వెల్లడించారు. కేరళలో కోఆపరేటివ్ బ్యాంకుల్లో కుంభకోణం జరిగింది. వీటిని ఎవరిని నియంత్రిస్తున్నారో అందరికి తెలుసు. ఆ డబ్బు మధ్యతరగతి, పేదలకు చెందినది. ఇందులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకుల ఆస్తులను అటాచ్ చేశాం. దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. అవినీతి సొమ్మును బాధితులకు ఇప్పటికే రూ. 17,000 కోట్లు చెల్లించినట్లు మోదీ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థ మరో రూ.1.25 లక్షల కోట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఆ విషయం టీవీల్లో కూడా వచ్చింది. ఆ డబ్బంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందింది. దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణల్ని ప్రధాని మోదీ తోసిపుచ్చారు.

 AP Election May 9th Politics Latest News Updates Telugu
మే 9: ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు

ఏపీలో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌..

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all