Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP CM YS Jagan Election Campaign Schedule
నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలోని రాజానగరం నియోజక­వర్గంలో ఉన్న కోరుకొండ జంక్షన్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని ఇచ్ఛాపురం మున్సిపల్‌ ఆఫీస్‌ సెంటర్‌లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం లోక్‌సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 

lok sabha election 2024: Phase 3 polling updates in telugu
LS Elections 3rd Phase: ఓటేసిన ప్రధాని మోదీ

updatesమహారాష్ట్ర:షోలాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని, ప్రణితి షిండే,  మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే ఓటు వేశారు.#WATCH | Solapur: Congress Solapur Lok Sabha candidate Praniti Shinde and Former Maharashtra CM Sushil Kumar Shinde cast their votes at a polling booth in Solapur. BJP has fielded Ram Vitthal Satpute from Solapur. BJP's Dr.Jaisiddeshwar Shivacharya Mahaswamiji is the sitting MP… pic.twitter.com/6468jda0Af— ANI (@ANI) May 7, 2024కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప, ఆయన కుమారుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఓటు వేశారు.#WATCH | Former Karnataka CM BS Yediyurappa and his sons - state BJP chief BY Vijayendra and sitting MP & party candidate from Shimoga, BY Raghavendra - cast their votes at a polling booth in Shivamogga.Congress has fielded Geetha Shivarajkumar and BJP's K.S. Eshwarappa is… pic.twitter.com/U6HQw0J2zU— ANI (@ANI) May 7, 2024ఓటు వేసిన ప్రధాని మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Prime Minister Narendra Modi shows his inked finger after casting his vote at a polling booth in Ahmedabad, Gujarat#LokSabhaElections2024 pic.twitter.com/OI0LzIJ0dQ— ANI (@ANI) May 7, 2024 అహ్మదాబాద్‌లోని నిశాన్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో మోదీ ఓటు చేశారు.Prime Minister Narendra Modi casts his vote for #LokSabhaElections2024 at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat pic.twitter.com/5r6Hsm1AZ3— ANI (@ANI) May 7, 2024 బీజేపీ నేత  హరనాథ్ సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని ఎటా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారుBJP leader Harnath Singh Yadav casts his vote at a polling booth in Etah, Uttar PradeshBJP has fielded Rajveer Singh, the son of former Uttar Pradesh CM and BJP leader Kalyan Singh from the Etah Lok Sabha constituency. He is pitted against SP's Devesh Shakya and BSP's Mohammad… pic.twitter.com/8e3f1zIdAu— ANI (@ANI) May 7, 2024 మధ్య ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు  ఖజురహో అభ్యర్థి వీడీ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు.భోపాల్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh BJP President and candidate from Khajuraho constituency VD Sharma casts his vote at a polling booth in Bhopal. BJP has fielded Alok Sharma from here, Congress has fielded Arun Shrivastava. BJP's Sadhvi Pragya Singh Thakur is the sitting MP from the… pic.twitter.com/34ZA8VRERu— ANI (@ANI) May 7, 2024 కర్ణాటకలోని కలబురిగి  పోలింగ్‌ కేంద్రంలో  బీజేపీ అభ్యర్థి డా. ఉమేష్‌ యాదవ్‌ ఓటు వేశారు.#WATCH | Karnataka: BJP candidate Dr Umesh Jadhav shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Kalaburagi.Congress has fielded party chief Mallikarjun Kharge's son-in-law Radhakrishna Doddamani against him from here.… pic.twitter.com/6TQNcePEvq— ANI (@ANI) May 7, 2024ఓటు వేయాలని ప్రధాని మోదీ  ట్వీట్‌..‘నేటి మూడో దశలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను ఉత్సాహంగా మారుస్తుంది’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.Urging all those who are voting in today’s phase to vote in record numbers. Their active participation will certainly make the elections more vibrant.— Narendra Modi (@narendramodi) May 7, 2024  లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైందిఓటు వేయడానికి ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారుVoting for the third phase of #LokSabhaElections2024 begins. Polling being held in 93 constituencies across 11 states and Union Territories (UTs) today.17.24 crore voters are casting their votes today. pic.twitter.com/CpQ7gGurNG— ANI (@ANI) May 7, 2024 నేడు లోక్ సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్11 రాష్ట్రాల్లోని 93 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1352 మంది అభ్యర్థులుగుజరాత్ , మహారాష్ట్ర,  కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ సహ పలు రాష్ట్రాలలో ఎన్నికలుఅహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాఓటు హక్కు వినియోగించుకోనున్న 17.24 కోట్ల మంది ఓటర్లు1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘంఓటు హక్కు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఎస్ఎంఎస్ / వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్న ఎన్నికల సంఘంమూడో విడత పోలింగ్ రోజున సాధారణ వాతావరణమే ఉంటుందని అంచనాలువడగల్పుల ప్రభావం తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, నీళ్లు, ఓఆర్ఎస్   ఏర్పాటుచేసిన ఈసీఎన్నికల ను ప్రత్యక్షంగా చూసేందుకు 23  దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన ఈసీపరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్‌ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులు కేంద్రమంత్రులు అమిత్‌ షా(గాంధీనగర్‌), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్‌సుఖ్‌ మాండవీయ(పోర్‌బందర్‌), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్‌), ప్రహ్లాద్‌ జోషి (ధార్వాడ్‌), ఎస్పీ సింగ్‌ బఘేల్‌(ఆగ్రా)మధ్యప్రదేశ్‌ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌(విదిశ), దిగ్విజయ్‌సింగ్‌(రాజ్‌గఢ్‌), ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్ కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్‌ పూర్తిఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్‌ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్‌ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఈరోజు పోలింగ్‌ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్‌ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్‌ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్‌ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్‌ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్‌ 4న చేపడతారు.రాష్ట్రం               సీట్లుగుజరాత్‌           25కర్ణాటక             14మహారాష్ట్ర          11ఉత్తరప్రదేశ్‌         10మధ్యప్రదేశ్‌          9ఛత్తీస్‌గఢ్‌            7బిహార్‌                5అస్సాం               4బెంగాల్‌              4గోవా                  2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్‌        2 

AP Elections 2024: May 7th Politics Latest News Updates Telugu
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం

AP Political And Elections News Updates In Telugu8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని  ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్‌సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్ 7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్‌.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్‌ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌.. ఈసీ సీరియస్‌ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా  వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం  జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్‌ చేసిన వైస్సార్‌సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 

MLA Vasantha Krishna Prasad Vs TDP Devineni Uma Maheswara Rao
‘ఒకడు మైలవరం మాయలోడు.. ఇంకోడు ఉప్మాగాడు!’

దేవినేని: వసంత రాజకీయ వ్యభిచారి. వసంత: ఉమ ఒక లుచ్చా. లఫంగి. జీవన్మృతుడు. దేవినేని: వాడొక పందికొక్కు. తోడేలు. ఇసుకాసురుడు.  వసంత: ఆ వెధవొక బురదపంది. శవాల వెంట చిల్లర పెంకులు ఏరుకునే సన్నాసి. ప్లాట్‌ ఫారంగాడు. నీ అయ్య ఒక సోడాబుడ్డి. 0.01 సెంటు పట్టా ప్రభుత్వం ఇస్తే బతికినోడివి. ఎలా పైకి వచ్చావో, రూ.వేల కోట్లు ఎలా సంపాదించావో అందరికీ తెలుసు.  దేవినేని: కిట్టప్రసాద్‌ హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాలు కొట్టేసి విల్లాలు, అపార్టుమెంట్లు కట్టినోడు. డబ్బు ఉందనే అహంకారి.  వసంత: నేను కిట్టప్రసాద్‌ అయితే వాడు ఉమాగాడు. ఉమక్కాయ్‌గాడు. ఉప్మాగాడు. లంగాహరి, భగవాన్‌దాస్‌. పోరంబోకు.  దేవినేని: ఇప్పుడు కులం (కమ్మ) గుర్తుకొచ్చి కులానికి మద్దతుగా అబ్బా (నాగేశ్వరరావు) కొడుకులిద్దరూ సన్నాసుల్లా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కడప నుంచి రౌడీలను తీసుకొచ్చి నన్ను హత్య చేయిస్తానన్నాడు.  వసంత: మతి తప్పి మాట్లాడుతున్నాడు. నేను కడప రౌడీలను తీసుకొచ్చి హత్య చేయిస్తానంటే నువ్వు మంత్రివి. నీ నాయకుడు సీఎం. మరి ఏం పీకారు అప్పుడు. దేవినేని: కిట్టప్రసాద్‌ తండ్రి నాగేశ్వరరావు మంత్రి పదవి కోసం, ఆర్టీసీ డైరెక్టర్‌ పదవి కోసం జై ఆంధ్ర ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడు. నేడు ఇతను అమరావతి రాజధానిని తాకట్టు పెట్టాడు. బయటి వ్యక్తులతో మైలవరంలో ఒక దళితుడి మీద, ఒక మైనారిటీ వ్యక్తి మీద దాడి చేయించాడు.  వసంత: అరే నీ అయ్య, నీ బాబు సినిమా హాల్లో ఆడోళ్లకి టికెట్‌లు ఇచ్చే దగ్గర వెకిలి వేశాలు        వేసినోడు. నా బాబు మాజీ హోం మంత్రి రా. గుర్తుపెట్టుకో.  దేవినేని: కొండపల్లి బొమ్మలకు ముడి సరుకు కోసం వాడే పునికి చెట్లను వందల ఎకరాల్లో తొలగించి అక్రమంగా గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకున్న దొంగోడు. వసంత: చంద్రబాబుకు పోలవరం ఏటీఎంలా ఎలా మారిందో అలా ఉమాకి మైలవరం నియోజకవర్గంలో క్రషర్‌లు, క్వారీలు ఏటీఎంలా మారాయి. క్రషర్‌లు, క్వారీల యజమానులపై కేసులు పెట్టించి బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన దొంగ. దేవినేని: మట్టి, ఇసుక, వీటీపీఎస్‌ డస్టుని దోచుకున్న మైలవరం వీరప్పన్‌. కిట్టప్రసాద్‌. రూ.వందకోట్లు ఇచ్చి మరీ టీడీపీలో చేరుతున్నాడు. వసంత: మైలవరం మాయలోడు. హత్యారాజకీయాలు అతని నైజం.సాక్షి ప్రతినిధి, విజయవాడ/ జి.కొండూరు :  ఇలా మాట్లాడుకుంది మతి తప్పిన వాళ్లో, మద్యం తాగేసి విచక్షణ కోల్పోయిన ఇద్దరో, వీధి రౌడీలో, గూండాలో కాదు. ఒకరేమో ఇంజినీరింగ్‌ చేశారు. మరొకరు పదో తరగతి వరకు చదివారు.  ఇద్దరూ ఇద్దరే...   ..దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యక్ష రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. నందిగామ, మైలవరం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఏళ్ల తరబడి కొనసాగారు. సొంత సోదరుడు దేవినేని వెంకట       రమణ సైతం మాజీ మంత్రే. వసంత వెంకట కృష్ణప్రసాద్‌ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. ప్రస్తుతం కృష్ణ ప్రసాద్‌ పోటీలో ఉన్నారు.నందిగామ నుంచి మైలవరం వరకు...   ..దేవినేని, వసంత కుటుంబాల రాజకీయాలు నందిగామలో మొదలయ్యాయి. ఎన్నికల్లో తలపడ్డాయి. ఆ స్థానం రిజర్వుడు కావడంతో మైలవరం చేరాయి. ఉమా సోదరుడు దేవినేని వెంకటరమణ, కృష్ణప్రసాద్‌ తండ్రి వసంత నాగేశ్వరరావు ఇద్దరూ టీడీపీ నుంచి గెలుపొంది మంత్రి పదవులు నిర్వర్తించిన వారే. వారసత్వంగా మైలవరం చేరుకున్న ఉమ టీడీపీ నుంచి, కృష్ణప్రసాద్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యరి్థగా 2019 ఎన్నికల్లో పోటీపడ్డారు. వసంత విజయం సాధించారు. అంతకుముందు రాజకీయంగా ఎవరేమి అనుకున్నప్పటికీ.. గత 55 నెలల వ్యవధిలో రాజకీయాలను ఎంతగా భ్రష్ఠుపట్టించారో, పరస్పరం ఎంత హీనంగా మాట్లాడుకున్నారో వివిధ సందర్భాలే గుర్తు      చేస్తాయి. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చెప్పలేనన్ని. చెప్పుకోలేనన్ని. ఇద్దరూ ఎంతెంత అవినీతిపరులో, ఎంతటి అక్రమార్కులో వారంతట వారు మీడియా ఎదుట వెల్లడించినవే నిదర్శనాలు. ఇప్పటికీ అవన్నీ ఆడియోలు, వీడియోల రూపంలో ససాక్ష్యంగా నిలుస్తున్నాయి. కేసులు పెట్టుకోవడం పరాకాష్ఠ. నాయకులు, కార్యకర్తలే బకరాలా?  ..మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు వసంత, దేవినేనిలకు అప్పుడు, ఇప్పుడు బకరాల్లా కనిపిస్తున్నట్లుంది. వైఎస్సార్‌ సీపీ నుంచి గత ఎన్నికల్లో గెలుపొంది ఆ పారీ్టకి వెన్నుపోటు పొడిచి ప్రస్తుతం టీడీపీ మైలవరం అభ్యరి్థగా ఎన్నికల బరిలో ఉన్న వసంత ఇరుపారీ్టల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. డబ్బు ఉందనే అహంకారంతో పేదలు, బడుగువర్గాల ఓటర్లను కొనుగోలు చేసేయవచ్చనే అంచ నాలతో ఇష్టారీతిన ప్రలోభాలకు ప్రయతి్నస్తున్నారు. నోట్ల కట్టలను పరిచేయవచ్చనే భావజా  లంతో తమను చిన్నచూపు చూస్తున్నారని స్థానిక నేతలు గుర్తుచేస్తున్నారు.  రాజకీయం కోసం దేనికైనా.. ఎంతవరకైనా.. ..గడిచిన ఐదేళ్లలో వసంత, దేవినేని ఆయా పారీ్టల నాయకులను, కార్యకర్తలను తమ ఇష్టానుసారం వాడేసుకున్నారు. ఇప్పుడు తామిరువురం ఒక్కటేనని చేయిచేయి కలుపుకొని, పచ్చ చొక్కాలు తొడుక్కుని అదే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఉమ్మడిగానూ మాట్లాడుతున్నారు. పైగా వసంతను గెలిపించాలని దేవినేని ఉమా అభ్యరి్థస్తుండటమే అత్యంత హాస్యాస్పదమని, ఇంతకన్నా దివాళాకోరుతనం ఉంటుందా? అని ఇరువర్గాల నాయకులు నోరెళ్లబెడుతున్నారు. మనిషన్నాక కాస్త అయినా సిగ్గూ శరం ఉంటుందని వీరికి అలాంటి వేమీ లేవని స్వపక్షీయులే అసహ్యించుకుంటు న్నారు. ‘ఉమా మా నాయకుడని, మాకు అత్యంత సన్నిహితుడని చెప్పుకోవడానికి మాకిప్పుడు        సిగ్గేస్తోంది. వాళ్ల అన్నయ్య వెంకటరమణ స్నేహితులుగా గడచిన అన్ని ఎన్నికల్లో ఉమకు తోడుగా నిలిచాం. అన్నిటికీ తెగించి తలపడ్డాం. ఉమ్మడిగా కష్టపడ్డాం. గెలిపించాం కూడా. ఇలా నేను ఒక్కడినే కాదు. పది మందికి పైగా మేమంతా జట్టుగా ఉన్నాం. ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరం ఉమ వెంట నడవడం లేదు. పార్టీ కూడా అతనికి సీటు ఇవ్వలేదులెండి’ అని విజయవాడ గాయత్రీనగర్‌లో        ఉంటున్న వారు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటి వరకు ఉమ ఒక్కడినే తప్పుడోడు అనుకున్నాం. అతనికన్నా పనికిమాలిన వాడు, పచ్చిమోసగాడుగా వసంత కనిపిస్తున్నాడు’ అని ముక్తాయించారు. గత ఐదేళ్లలో పారీ్టని, కులాన్ని అడ్డుపెట్టుకుని చాలా అరాచకాలే చేశాడు. ఇప్పటికి వైఎస్సార్‌ సీపీకి కృష్ణప్రసాద్‌ అనే చీడ పోయిందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. వారిద్దరి గురించి మా వద్ద చాలా విషయాలు, వివరాలే ఉన్నాయని, అటు వెళ్లడానికి ఇష్టంలేకే ఇప్పుడు విజయవాడ నగరంలో, ముఖ్యంగా వెస్ట్‌లో పార్టీ తరఫున తిరుగుతున్నాం. మైలవరాన్ని విడిచి ఇలా రావాల్సి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదని పంటకాలవ ప్రాంతంలోని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తంచేశారు. మేం అంతా టీడీపీ వీరవిధేయులమైనప్పటికీ మైలవరం ఓటర్లు వసంతకు తగిన       బుద్ధి చెప్పాలని, ఉమకు ఇంకా గుణ పాఠం నేర్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని  అభిప్రాయపడటాన్ని చూస్తుంటే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమల స్థితిగతులు ఎలాంటివో తేటతెల్లమవుతున్నాయి.

NASA Sunita Williams 3rd Mission To Space Called Updates
ఆగిన సునీతా విలియమ్స్‌ రోదసీ యాత్ర

తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. అయితే ఈ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్‌ ద్వారా తెలిపింది. అయితే తిరిగి యాత్ర ఎప్పుడు ఉంటుందనేదానిపై నాసా స్పష్టత ఇవ్వలేదు.బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ Starliner వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి ఈ వ్యోమనౌక అట్లాస్‌-V రాకెట్‌ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. Today's #Starliner launch is scrubbed as teams evaluate an oxygen relief valve on the Centaur Stage on the Atlas V. Our astronauts have exited Starliner and will return to crew quarters. For updates, watch our live coverage: https://t.co/plfuHQtv4l— NASA (@NASA) May 7, 2024అయితే 90 నిమిషాల ముందర రాకెట్‌లో సమస్యతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది.  ఇందులో సునీత.. మిషన్‌ పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆమెతో పాటు బుచ్‌ విల్‌మోర్‌ కూడా వెళ్లాల్సి ఉంది.మిషన్‌ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌లైనర్‌ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.ప్రస్తుతం ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.అందుకే ఒకింత ఆత్రుత.: సునీతతాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఐఎస్‌ఎస్‌కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది. స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉంది. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదు. రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టం. నేను ఆధ్యాత్మికవాదిని. గణేశుడు నా అదృష్ట దైవం. అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళతాను’’ అని ఆమె పేర్కొన్నారు.  సునీత ఒక మారథాన్‌ రన్నర్‌. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు.

Lok sabha elections 2024: PM Narendra Modi, Amit Shah to Cast Vote in Ahmedabad
Lok Sabha Election 2024: మోదీ, షా కంచుకోటలో... కాంగ్రెస్‌కు పెనుసవాల్‌

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శుక్రవారం మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కీలకమైన రాష్ట్రం గుజరాత్‌లో మొత్తం స్థానాలకూ ఇదే విడతలో పోలింగ్‌ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌చేసింది. అదే ఊపులో ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అంతకంతకూ చిక్కిపోతున్న కాంగ్రెస్‌ ఈసారి ఆప్‌తో కలిసి ‘ఇండియా’ కూటమి కింద బీజేపీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కీలక లోక్‌సభ స్థానాలపై ఫోకస్‌...                  వదోదర... కొత్త ముఖాలు గుజరాత్‌లో మూడో అతి పెద్ద నగరమిది. ఇక్కడ వరుసగా రెండు ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో గెలుపొందిన రంజన్‌బెన్‌ ధనంజయ్‌ భట్‌ను బీజేపీ అనూహ్యంగా పక్కనబెట్టింది. డాక్టర్‌ హేమంగ్‌ జోషీని పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ తరఫున పధియార్‌ జస్పాల్‌సింగ్‌ మహేంద్రసింగ్‌ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కొత్తవారే కావడం విశేషం. ఈ సీటు 1998 నుంచి బీజేపీ గుప్పిట్లోనే ఉంది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో మరోసారి నెగ్గుతామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 సెగ్మెంట్లలో 6 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. మిగతా చోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. 2014లో మోదీ లోక్‌సభ అరంగేట్రం వారణాసి, వదోదరల నుంచే జరగడం తెలిసిందే. ఇక్కడ ఆయనకు ఏకంగా 5.7 లక్షల మెజారిటీ లభించింది. వారణాసి నుంచి ఎంపీగా కొనసాగి వదోదరను వదులుకున్నారు. రాజ్‌కోట్‌... రూపాలాకు రాజ్‌పుత్‌ గండం గుజరాత్‌లో ఎదురే లేని కమలనాథులకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. సిట్టింగ్‌ ఎంపీ మోహన్‌ కుందరియాను కాదని బీజేపీ ఆయనకు టికెటిచి్చంది. కానీ ‘మహారాజులు బ్రిటి‹Ùవారికి, విదేశీ పాలకులకు లొంగిపోయారని, వారితో విందువినోదాల్లో మునగడమే గాక వాళ్లకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లిళ్లు చేశా’రని రాజ్‌పుత్‌లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం భగ్గుమంది. ఆయన్ను రాజ్‌కోట్‌ బరి నుంచి తప్పించాలని, లేదంటే ఓడించి తీరుతామని బీజేపీకి వారు అలి్టమేటమిచ్చారు! ఆందోళనలు కూడా చేశారు. రూపాలా పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పరేశ్‌బాయ్‌ ధనాని పోటీలో ఉన్నారు. రాజ్‌పుత్‌లు, పటీదార్లు, మధ్య ఎప్పటినుంచో వైరముంది. పటీదార్‌ సామాజికవర్గానికి చెందిన రూపాలా దానికిలా ఆజ్యం పోయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది.భావనగర్‌.. బరిలో ఆప్‌ ఈ స్థానంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్నేసింది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా భావనగర్, బరుచ్‌లను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ గట్టి పట్టున్న బీజేపీని ఢీకొట్టేందుకు ఉమేశ్‌బాయ్‌ నరన్‌బాయ్‌ మక్వానాను పోటీకి దించింది. బీజేపీ కూడా సిట్టింగ్‌ ఎంపీ భారతీబెన్‌ ధీరూబాయ్‌ శియాల్‌ను పక్కనబెట్టి నింబూబెన్‌ బంభానియాకు టికెటిచి్చంది. 1991 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. గత ఎన్నికల్లో భారతీబెన్‌కు 4.29 లక్షల మెజారిటీ లభించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. మిగతా స్థానం ఆప్‌ది కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 5 సీట్లు నెగ్గిన ఆప్‌ లోక్‌సభ బరిలో బీజేపీకి సవాలు విసురుతోంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రచారంతో హోరెత్తిస్తోంది. కేజ్రీవాల్‌ భార్య సునీత కూడా ప్రచారానికి దిగారు.  పోర్‌బందర్‌.. మన్‌సుఖ్‌ అరంగేట్రం బీజేపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2012 నుంచీ రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయన పోటీతో పోర్‌బందర్‌పై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేశ్‌బాయ్‌ ధడక్‌ చేతిలో 2.3 లక్షల ఓట్ల తేడాతో ఓడిన లలిత్‌ వసోయాకే కాంగ్రెస్‌ మళ్లీ టికెటిచి్చంది. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కుతియానాలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది.  బనస్కాంత.. గెనీబెన్‌ సవాల్‌ ఉత్తర గుజరాత్‌లోని ఈ స్థానంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ‘వావ్‌’ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గెనీబెన్‌ ఠాకోర్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దించడమే అందుకు కారణం. దాంతో బీజేపీ కూడా సిట్టింగ్‌ ఎంపీ పర్వత్‌బాయ్‌ పటేల్‌ను కాదని ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ రేఖా బెన్‌ చౌదరి రూపంలో మహిళకే టికెటివ్వాల్సి వచ్చింది. ఆమెకు రాజకీయ అనుభవం లేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గుజరాత్‌లో ఇరు పారీ్టల నుంచీ మహిళలే రంగంలో ఉన్న ఏకైక సీటు కావడంతో బనస్కాంత అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే గెనీబెన్‌ కమలం హవాలో కూడా విజయం సాధించి ‘వావ్‌’ అనిపించారు. రేఖాబెన్‌కు రాజకీయ అనుభవం లేకున్నా నియోజకవర్గంతో సత్సబంధాలున్నాయి. బనస్‌ డెయిరీ ఈ నియోజకవర్గంలోని 4.5 లక్షల మంది రైతుల నుంచి రోజూ పాలు సేకరిస్తుంది. దీని వ్యవస్థాపకుడు గల్బాబాయ్‌ చౌదరి మనుమరాలు రేఖ. ఆమె భర్త హితేశ్‌ చౌదరి బీజేపీ నాయకుడు. అయినా గెనీబెన్‌ వంటి బలమైన ప్రత్యరి్థపై రేఖ వంటి కొత్త ముఖాన్ని నిలబెట్టడంపై బీజేపీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి!గాంధీనగర్‌.. అద్వానీ కోటలో షా పాగా! ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటైన ఈ నియోజకవర్గం 1989 నుంచి కమలనాథుల గుప్పిట్లోనే ఉంది. శంకర్‌ సింఘ్‌ వాఘేలా, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ వంటి హేమాహేమీలకు నెలవైన ఈ స్థానంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ దిగ్గజం అమిత్‌ షా పాగా వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 5,57,014 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఈసారి మెజారిటీ మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి! చివరకు 62 ఏళ్ల సోనల్‌ పటేల్‌ను రంగంలోకి దించింది. ఆమె ఏఐసీసీ సెక్రటరీగా. ముంబై, పశి్చమ మహారాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్నారు. గిఫ్ట్‌ సిటీ అభివృద్ధి, గాంధీ సబర్మతి ఆశ్రమానికి మెరుగులు, అయోధ్య రామ మందిరం, మోదీ ఫ్యాక్టర్‌ తదితరాలతో తనకు తిరుగులేదని షా ధీమాతో ఉన్నారు. గాం«దీనగర్‌ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలూ బీజేపీవే! సీఎం భూపేంద్ర పటేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘట్లోడియా కూడా వాటిలో ఒకటి.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

 Sreeja Konidela Comments On Divorce
విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్‌ వైరల్‌

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్‌ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే, పలు విభేదాల కారణంగా ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్‌ దేవ్‌ వద్ద ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీజ నెటిజన్లకు టచ్‌లోనే ఉంటుంది.విడాకుల అంశం గురించి శ్రీజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. కానీ ఆమె తన భర్తతో విడాకుల గురించి రియాక్ట్‌ కాలేదు. సోషల్‌ మీడియా ద్వారా ఓ అమ్మాయి ది ఆంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్‌కు ఇలా ప్రశ్న పంపింది. 'నా భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది. కానీ, నా భర్తే ఈ విషయంలో అడ్డు పడుతున్నాడు. తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వద్దని కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలి..?' అని అడిగింది. ఇందుకు సమాధానంగా వాళ్లు.. ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు క్వశ్చన్‌ చేసుకోండి  అంటూ చెప్పుకొచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ అంశంలో ఇతరుల ప్రమేయం లేకుండా మీరే నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు.ఈ క్రమంలో  విడాకుల విషయంపై ఆ అమ్మాయికి వారు ఇలా సూచించారు. 'బబుల్ బాత్ చేయడం, స్పాకి వెళ్లడం, నచ్చిన డ్రెస్సులు కొనుక్కోవడం, చక్కగా రెడీ కావడం, మీకు నచ్చిన గిఫ్టులు మీరే కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్. ఈ విషయంలో మళ్లీ ఒక్కసారి ఆలోచించండి. సెల్ప్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ అనే పోరాటంలో మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకుందా..?' అని ఆ యువతితో వారు చెప్పుకొచ్చారు. ఈ మెసేజ్‌లను శ్రీజ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. గతంలో కూడా శ్రీజ సెల్ఫ్‌ లవ్‌ అంటూ పలు పోస్టులు పెడుతుండేది. దీనినిబట్టి చూస్తే భవిష్యత్‌లో ఎవరితోనూ ప్రేమలో పడేది ఉండదని ఆపై పెళ్లి చేసుకునే ఛాన్స్‌ కూడా లేదన్నట్లుగా ఆమె మెసేజ్‌లు ఉన్నాయని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.వ్యాపారంలో శ్రీజ తొలి అడుగుకొద్దిరోజుల క్రితం శ్రీజ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. స్టూడియో అనంత పేరుతో హైదరాబాద్‌లో ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ను ఆమె ప్రారంభించింది. తాను ఇలా వ్యాపార రంగంలోకి రావడం, ఫిట్‌నెస్ సెంటర్‌లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ గతంలో శ్రీజ తెలిపింది. ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లో జిమ్, యోగా కూడా ఉంటాయని ఆమె చెప్పింది.     View this post on Instagram           A post shared by Sreeja (@sreejakonidela)

Confusion in Postal Ballot Polling
ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు

నరసరావుపేట రూరల్‌/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పెనమలూరు: పోలింగ్‌తేదీ సమీపిస్తున్న కొద్దీ ఓటమి తథ్యమనే విషయం తెలుస్తుండటంతో టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను కొల్లగొట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్ల­ంఘించి ప్రలోభాల వలలు విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం కూడా నగదు ఎర వేస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, బెదిరిస్తూ.. ఏదో ఒకరకంగా ఓట్లు వేయించుకోవాలని బరితెగించి వ్యవహరించారు. ప్రశ్నించినవారిపై దాడిచేసి కిడ్నాప్‌ చేస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ వారిపై రాళ్లదాడులకు దిగుతున్నారు. నరసరావుపేటలో ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి కిడ్నాప్‌ నరసరావుపేటలో ఎస్‌ఎస్‌ అండ్‌ ఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్‌ల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద  టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఓటర్లకు నగదు ఎర చూపారు. దీన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి సత్యనారాయణరెడ్డి అక్కడున్న పోలీసు అధికారులకు చూపించారు. పోలీసులు.. టీడీపీ నాయకుల ప్రచారానికి అభ్యంతరం తెలిపి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో టీడీపీ వారు సత్యనారాయణరెడ్డిపై దాడిచేసి కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. విషయం తెలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. అక్కడున్న టీడీపీ వారిని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తెలుగుదేశం వర్గీయులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.  కాగా, తనపై దాడిచేసి బలవంతంగా కారులో ఎక్కించి  తీసుకెళ్లారని రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి మధిర సత్యనారాయణరెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులకు చెందిన ఈ విద్యాసంస్థలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంపై వైఎస్సార్‌సీపీ వర్గీయులు కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిస్పాక్షికంగా ఉన్న ఉద్యోగులే లక్ష్యం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ హై సూ్కల్‌కు ఎదురుగా ఉన్న పోలింగ్‌ కేంద్రం సమీపంలో టీడీపీ నాయకులు పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, బొట్ట రమణ నిస్పాక్షికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా హడావుడి చేశారు. ఓటర్ల వివరాలు నమోదు చేసుకున్న కార్యకర్తలు తర్వాత ఫోన్‌ పే, గుగూల్‌ పే వంటి వాటిని ఉపయోగించినట్లు తెలిసింది.ఉద్యోగి ఓటు వేసిన మరో వ్యక్తికృష్ణాజిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన 141 పోలింగ్‌ కేంద్రంలో పెనమలూరు సచివాలయం–1లో డిజిటల్‌ అసిస్టెంట్‌ మట్ట కిషోర్‌బాబు ఓటును గుర్తుతెలియని వారు వేశారు. సోమవారం ఓటేసేందుకు వచ్చిన కిషోర్‌బాబు తన ఓటు అప్పటికే వేసి ఉండటంతో అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు కూడా నిరసన తెలిపి కిషోర్‌కు ఓటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కిషోర్‌బాబుకు మంగళవారం 140వ బూత్‌లో ఓటు కల్పిస్తామని ఏఆర్‌వో వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రం హెల్ప్‌డెసు్కలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఎల్‌.గోవిందరాజులు టీడీపీకి ఓటేయాలని తమకు సూచించారని ఉయ్యూరు ఏజీ ఆండ్‌ ఎస్‌జీ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు చెప్పారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఏఆర్‌వోకి ఫిర్యాదు చేశారు. దీంతో గోవిందరాజులును ఎన్నికల విధుల నుంచి తప్పించారు.

Sakshi Editorial On Rahul Gandhi Rae Bareli
రాయ్‌బరేలీ వ్యూహం

ఎట్టకేలకు ఒక చర్చ ముగిసింది, మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌ శుక్రవారం రాయ్‌బరేలీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయడంతో ఉత్తర ప్రదేశ్‌లో ఆయన పోటీ చేస్తారా, లేదా అన్న చర్చకు ఫుల్‌స్టాప్‌ పడింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతుల్లో ఓటమి పాలైన అమేథీని కాకుండా, ఇటీవల రాజ్యసభకు వెళ్ళేంత వరకు తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీని ఆయన ఎన్నుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. భారత రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్‌ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు రాహుల్‌ తీసుకున్న నిర్ణయంపై అంచనాలున్నాయి, అనుమానాలూ ఉన్నాయి. ఈ పోటీతో ఎన్నికల వ్యూహంలోనూ, ఇటు విస్తృత రాజకీయ కథనంలోనూ కాంగ్రెస్‌ పార్టీ గట్టి మార్పు తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడానికి దీన్ని ఒక అవకాశంగా కాంగ్రెస్‌ భావిస్తోంది. అమేథీ స్థానంలో కాకున్నా కుటుంబానికి కలిసొచ్చిన రాయ్‌బరేలీని ఎంచుకోవడం ద్వారా యూపీ ఎన్నికల క్షేత్రంలో పార్టీకి రాహుల్‌ కొత్త ఉత్సాహం తెచ్చారనుకోవాలి. చిరకాలంగా గాంధీ కుటుంబ వారసులే పోటీ చేస్తున్న కంచుకోట లాంటి అమేథీ స్థానాన్ని... నియోజకవర్గం బాగోగులు చూసే మరో విధేయ నేత కేఎల్‌ శర్మకు కట్టబెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 ఎన్నికల్లో 17 సార్లు కాంగ్రెస్‌కే జై కొట్టిన స్థానం రాయ్‌బరేలీ. ప్రధాని ఇందిరాగాంధీ మొదలు పలువురు గాంధీ కుటుంబ సభ్యులకు పట్టం కట్టిన మరో కంచుకోట. అక్కడ పోటీ ద్వారా యూపీలో క్రియాశీలకంగా నిలవడమే కాక, తనపై బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాహుల్‌ వీలు చిక్కించుకున్నారు. అయితే, ఆఖరు నిమిషంలో ప్రకటించిన ఈ అభ్యర్థిత్వంతో అనేక సవాళ్ళూ తప్పవు. వాటిని ఎలా అధిగమించి, సంక్లిష్ట సామాజిక – రాజకీయ కోణాలున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లో పట్టు సాధిస్తారన్నది చూడాలి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నంత బలమైన ఎన్నికల యంత్రాంగం, పార్టీ వ్యవస్థ ప్రస్తుతం కాంగ్రెస్‌కు లేకపోవడం లోటు. వాటిని అధిగమించి, ప్రస్తుత ఉత్సాహాన్ని ఎన్నికల లబ్ధిగా ఎలా మలచగలుగుతారో వేచిచూడాలి. నిజానికి, క్రితంసారి ఉత్తరాదిన కాంగ్రెస్‌ ఊపు తగ్గినా దక్షిణాదిలో ఉనికి నిలిపిన కేరళలోని వయనాడ్‌ స్థానమంటే సహజంగానే రాహుల్‌కు ప్రత్యేక అభిమానం. అది ఆయన మాటల్లో, చేతల్లో కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణాదిన హస్తం హవా కొనసాగేందుకు వయనాడ్‌ భావోద్వేగ బంధంగా ఉపకరిస్తుందని ఆయన ఆలోచన. అందుకే, ఈసారీ ఆయన అక్కడ నుంచి కూడా పోటీ చేశారు. వయనాడ్‌లో రాహుల్‌ స్థానికేతరుడనీ, యూపీలో గెలిస్తే ఈ స్థానాన్ని వదిలేస్తాడనీ ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నందు వల్లే అక్కడ ఎన్నికలయ్యేంత వరకు తెలివిగా తన రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఆఖరి వరకూ అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ అంశాన్ని సస్పెన్స్‌లోనే ఉంచుతూ, అధికార పార్టీని ఇరుకునపెట్టారు. బీజేపీ సైతం పోటీకి భయపడి రాహుల్‌ వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారంతో ఒత్తిడి పెంచింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, ముఖాముఖి పోరుకు వెరవడం లేదని నిరూపించేందుకు రాహుల్‌కు ఈ రాయ్‌బరేలీ అభ్యర్థిత్వం ఉపకరించనుంది. హస్తం పార్టీకి రాయ్‌బరేలీ ఎంత అడ్డా అయినా, రాహుల్‌ పోటీలో రిస్కులూ ఉన్నాయి. యూపీలోని మొత్తం 80 లోక్‌సభా స్థానాల్లో క్రితంసారి 64 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అలవాటైన స్థానం వదిలేసి, సాహసించారు. కానీ, ఆయన ఛరిష్మా, కాంగ్రెస్‌కు చిరకాలంగా ఉన్న స్థానిక సంబంధాలు పనికొస్తాయని భావిస్తున్నారు. అసలు అమేథీలో ప్రియాంక, రాయ్‌బరేలీలో రాహుల్‌ పోటీ చేయాలన్న ఆలోచనా ఒక దశలో జరిగింది. కానీ, ప్రతిపక్షం ఆరోపిస్తున్న వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతికి ఊతమిచ్చినట్టు అవుతుందని దానికి స్వస్తి చెప్పారు. ఇక, అమేథీలో పోటీచేస్తున్న కేఎల్‌ శర్మ పంజాబ్‌ నుంచి వచ్చినవారైనప్పటికీ, ఇరుగుపొరుగు స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో గత 30 ఏళ్ళుగా పార్టీ తరఫున పనిచేస్తున్నారు. జనంతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన, స్టార్‌ అభ్యర్థి స్మృతీ ఇరానీపై గెలుస్తారని కాంగ్రెస్‌ ఆశ. 1977లో ఇందిరా గాంధీపై రాజ్‌నారాయణ్, గడచిన 2019లో రాహుల్‌పై స్మృతి గెలిచినట్టే, రేపు స్మృతిపై శర్మ గెలవకూడదని ఏమీ లేదు. అధిక సంఖ్యాక ప్రజల మద్దతే కీలకమైన ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. అసలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సదరు వ్యక్తుల, పార్టీల నిర్ణయం. అయితే, దేశంలోని అనేక ప్రధాన సమస్యల కన్నా అమేథీ, రాయ్‌బరేలీలలో రాహుల్‌ పోటీ చేస్తారా, లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా జాతీయ టీవీ ఛానళ్ళు దీనిపైనే చర్చోపచర్చలు చేయడం విచిత్రం. 1952లో ఫిరోజ్‌ గాంధీ, తర్వాత ఇందిర, అటుపైన సోనియా, ఇప్పుడు రాహుల్‌ పోటీతో రాయ్‌బరేలీతో కాంగ్రెస్‌ బంధం అమేథీ కన్నా పాతది, పట్టున్నది. కానీ, ఇల్లలకగానే పండగ కాదు. సాక్షాత్తూ ప్రియాంక యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ 398 స్థానాల్లో పోటీ చేసినా, రెండంటే రెండింట్లో గెలిచింది. ఇప్పుడు లోక్‌సభకు 17 స్థానాల్లో బరిలో నిలిచింది. అభ్యర్థుల పేర్లు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ రేపు వయనాడ్, రాయ్‌బరేలీ – రెంటిలోనూ రాహుల్‌ గెలిస్తే, దేన్ని వదులుకోవాలన్నదీ చిక్కే. రాగల రోజుల్లో మరిన్ని విడతల పోలింగ్‌తో ఎన్నికల వేడి పెరిగాక కానీ, యూపీలో రాహుల్‌ పోటీ తాలూకు సిసలైన ప్రభావమేమిటో అర్థం కాదు. ఒకవేళ పాచిక పారి, రాయ్‌బరేలీలోనే కాక యూపీ అంతటా రాహుల్‌ ప్రభావం కనిపిస్తే రాజకీయాలు మళ్ళీ మలుపు తిరుగుతాయి. హస్తం పార్టీ ఆశ కూడా అదే! 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all