Short Stories | Sakshi
1

లక్కీ ఫెలోస్‌.. టూర్‌ వెళ్తే బంగారు నిధి జాక్‌పాట్‌ తగిలింది..

చెక్ రిపబ్లిక్‌లో ఇద్దరు వ్యక్తులు హైకింగ్ చేసుకుంటూ ఈశాన్య పోడ్‌క్ర్కోనోసి పర్వతాలలోని అడవిలోకి వెళ్లారు. ఒకానొక ప్రదేశంలో తమ కాళ్ల కింద ఏదో ఉందని అనిపించింది. గట్టిగా అడుగులు వేయడంతో శబ్ధం వచ్చింది. దీంతో, అక్కడ కొంత భూమి పొరను తీసి చూడగానే వారిని నిధి కనిపించింది. దానిలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించడంతో పర్యాటకులు ఆశ్చర్యపోయారు. నిధిలో దొరికిన వాటి విలువ సుమారు 2.87 కోట్లు.
Read More
2

2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?: అంబటి

చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్‌ క్లాస్‌ క్యాపిటల్‌ నిర్మిస్తారా?. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్‌..
Read More
3

చంద్రబాబూ.. రైతుల గోడు పట్టదా?: వైఎస్‌ జగన్‌

ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్‌ జగన్‌ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More
4

ఇదిగో ఇల్లు.. హైదరాబాదే టాప్‌

గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి, గృహ కొనుగోలుదారులకు అందజేయడంలో దక్షిణాది నగరాలలో హైదరాబాద్‌ ముందంజలో నిలిచింది. గ్రేటర్‌లో 2024–25లో ఆర్థిక సంవత్సరంలో 57,304 యూనిట్లు డెలివరీ అయ్యాయి. 2023–24లో డెలివరీ అయిన 35,641 ఇళ్లతో పోలిస్తే ఏడాది కాలంలో 61 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో బెంగళూరులో 46,103, చెన్నైలో 19,650 యూనిట్లు డెలివరీ అయ్యాయి.
Read More
5

ఎద్దు టెస్ట్‌ రైడ్‌ బ్రో..!

సోషల్‌ మీడియా (Social media)విశేషాల పుట్ట. రిమ్‌జిమ్‌.. రిమ్‌జిమ్‌.. స్కూటర్‌ వాలా జిందాబాద్‌ అంటూ ఒక ఎద్దు స్కూటర్‌ను ఎంచక్కా రైడ్‌ చేస్తోంది. అదేంటి ఎద్దుల బండి చూశాం కానీ.. ఎద్దు స్కూటరేంటి అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవాల్సిందే. సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్నవీడియో చూసి తీరాల్సిందే.
Read More
6

ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచేది ఆ జట్టే: గావస్కర్‌

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ ఆర్సీబీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తోంది. వాళ్ల ఫీల్డింగ్‌ కూడా సూపర్‌. ఈసారి ఆర్సీబీనే టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది’’ అన్నాడు.
Read More
7

సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లకు గిరాకీ

స్థిరాస్తి రంగానికి ప్రత్యేకించి గృహ విభాగానికి కరోనా మహమ్మారి బూస్ట్‌లా బలానిచ్చింది. హోం ఐసోలేషన్, వర్క్‌ ఫ్రం హోమ్‌ వంటి కారణంగా సొంతింటి అవసరం తెలిసి రావడంతో నివాస విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో కోవిడ్‌ తర్వాత కొత్త ఇళ్లకే కాదు రీసేల్‌ ప్రాపర్టీలకూ గిరాకీ పెరిగింది.
Read More
8

రియల్‌ ఎస్టేట్‌లోకి పెట్టుబడుల వెల్లువ

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఏఐఎఫ్‌) వెల్లువెత్తుతున్నాయి. 2024 డిసెంబర్‌ చివరి నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. గతేడాది డిసెంబర్‌ నాటికి అన్ని రంగాల్లో ఏఐఎఫ్‌లు కలిపి రూ.5,06,196 కోట్లు రాగా.. ఇందులో 15 శాతం వాటా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చాయని అనరాక్‌ నివేదిక వెల్లడించింది.
Read More
9

మా బౌలింగ్‌ చెత్తగా ఉంది.. నేను కూడా.. : కమిన్స్‌

గుజరాత్‌ టైటాన్స్‌తో చేతిలో ఓటమి నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) ఓటమి అనంతరం తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఇటు బౌలింగ్‌లో.. అటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యామని పేర్కొన్నాడు. ఈ ఘోర ఓటమికి తానూ బాధ్యత వహిస్తున్నానని తెలిపాడు.
Read More
10

బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?

దేశంలో భారీగా పెరిగి తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) నెమ్మదిగా దిగివస్తున్నాయి. వరుస తగ్గుదలలతో పసిడి కొనుగోలుదారుల్లో ఉత్సాహం తిరిగొచ్చింది. మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (మే 3) స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్‌లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
Read More
11

Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ప్రవర్తన విమర్శలకు దారితీసింది. సారథిగా సంయమనంతో వ్యవహరించాల్సిన ఆటగాడే ఇలా సహనం కోల్పోవడం సరికాదంటూ క్రికెట్‌ ప్రేమికులు అతడిని విమర్శిస్తున్నారు. గిల్‌ నుంచి ఇలాంటివి అస్సలు ఊహించలేదని.. స్నేహపూర్వకంగా చేసే పనులకు కూడా ఓ హద్దు ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా హితవు పలుకుతున్నారు. అసలు విషయమేమిటంటే..
Read More
12

జుక్‌.. జాబ్స్‌.. గేట్స్‌.. వీళ్ల సీక్రెట్‌ ఇదేనా?

స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్‌బర్గ్.. ముగ్గురూ టెక్‌ ప్రపంచాన్ని శాసించి బిలియన్‌ డాలర్లు సంపాదించిన వ్యాపారాధినేతలు. వీరి విజయ రహస్యమేంటో తెలిసి​పోయింది! బలమైన నాయకత్వం, వ్యూహాత్మక దార్శనికత, సమర్థవంతమైన కమ్యూనికేషన్ ప్రధాన లక్షణాలుగా ఉన్నప్పటికీ, ఈ ముగ్గురికీ సారూప్యత ఉన్న అంశం మరొకటి ఉందని డొనాల్డ్ జి కాస్టెల్లో కాలేజ్ ఆఫ్ బిజినెస్ పరిశోధకులు వెల్లడించారు.
Read More
13

Sunscreen సన్‌స్క్రీన్‌ వాడితే అనర్థమా?

సమ్మర్‌ (Summer)లో సన్‌స్క్రీన్‌ (Sunscreen) లోషన్‌ వాడడం సర్వసాధారణం. 2030 నాటికి భారత సన్‌స్క్రీన్‌ మార్కెట్‌ బాగా పెరగనుందని ఒక నివేదిక అంచనా వేసింది. అయితే మరోవైపు చూస్తే... ఇంటర్నెట్‌లో ఒకవర్గం సన్‌స్క్రీన్‌ వాడొద్దు అని, వాటివల్ల జరిగే నష్టాలు ఇవి... అంటూ ప్రచారం చేస్తోంది. అందులో నిజం ఎంత?
Read More
14

కొత్తగా ఉంది.. ఆలోచనలన్నీ అటే, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా!

మాతృత్వం ఒక వరమే.కానీ అంతకుమించిన బాధ్యతల భారం కూడా. కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఉన్నపుడు నిజంగా ఏ మహిళకైనా గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, పాలిచ్చి పోషించడం లాంటివన్న జీవితాంతం పదిలపర్చుకునే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇదే విషయంపై బాలీవుడ్‌ దీపిక పదుకొణే మాట్లాడింది. కొత్త జీవితాన్నిచూస్తున్నాననీ, ఇపుడు ప్రతీ క్షణం పాపాయి కోసమే నని చెప్పింది.
Read More
15

వెజ్‌..ప్లీజ్‌!

విజయలక్ష్మి.. ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు.
Read More
16

హీరో నానికి బిగ్‌ షాక్‌

టాలీవుడ్‌ని పైరసీ బూతం కుదుపేస్తోంది. సూపర్ హిట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో లీక్ అవుతున్నాయి. ఇప్పటికే రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. తాజాగా, నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది
Read More
17

రూ.21000 కోట్లు: మూడేళ్ళలో యూట్యూబర్ల సంపాదన..

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా సంపాదించడానికి మార్గాలను వెతుకుతున్నారు. పెట్టుబడి లేకుండా సంపాదించడానికి యూట్యూబ్ ఓ మంచి ఫ్లాట్‌ఫామ్. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభిస్తున్నారు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా గత మూడేళ్ళలో కంటెంట్ క్రియేటర్లు ఎంత సంపాదించారనే విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ వెల్లడించారు.
Read More
18

పెళ్లికూతురు అంతలోనే ఎంత పనిచేసింది?!

పెళ్లి అంటే ఆ సందడే వేరు ఉంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్‌, బారాత్‌ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్‌ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్‌ చేసే అల్లరి, అనుకోని సర్‌ప్రైజ్‌లు, సరదా సరదా
Read More
19

మంగళూరులో హై అలర్ట్‌.. కారణం ఇదే..

మంగళూరులో ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య కారణంగా పోలీసుల హై అలర్ట్‌ ప్రకటించి.. నగరంలో భారీ బందోబస్తు ఏ‍ర్పాటు చేశారు. మత ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులను టార్గెట్‌ చేసిన బీజేపీ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌ పాలనలో లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బతిన్నదని ఆరోపిస్తున్నారు.
Read More
20

భారత్‌ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!

పాకిస్తాన్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్‌ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయాన్ని..
Read More
21

పోస్టాఫీస్‌ స్కీములకు కొత్త విధానం

పోస్టాఫీస్‌ పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఈ స్కీములు మారుమూల గ్రామీణులకు సైతం అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని తెరిచేందుకు ఉన్న పేపర్‌ వర్క్‌ సామాన్యులకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన పొదుపు పథకాలను తెరవడానికి తపాలా శాఖ ఇప్పుడు పూర్తి డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.
Read More
22

సింహాచలం ఘటన: సంచలన విషయాలు చెప్పిన కాంట్రాక్టర్‌

సింహాచలం పుణ్యక్షే త్రంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృత్యువాత పడిన ఘటనపై కాంట్రాక్టర్‌ లక్ష్మణరావు సంచలన విషయాలు వె ల్లడించారు. ఆ గోడను తనతో బలవంతంగా కట్టించారని ల క్ష్మణరావు స్పష్టం చేశారు. ముగ్గురు సభ్యుల కమిటీ విచారణలో భాగంగా..
Read More
23

అజిత్ కుమార్‌ బర్త్ ‍డే.. భార్య షాలిని పోస్ట్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న అజిత్ ఇవాళ తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య షాలిని బర్త్‌ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
Read More
24

తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింది. 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ .14.50 మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. తగ్గించిన కొత్త ధర మే 1 నుండి అమలులోకి వస్తుంది. మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్‌ ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.
Read More
25

అంబానీ ‘హ్యాపీ’ ఇక లేదు

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అంబానీకి ముఖ్యంగా చిన్న కుమారుడు, అనంత్‌ అంబానీకి ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క, హ్యాపీ ఇకలేదు. నిన్న (బుధవారం ఏప్రిల్‌ 30)న హ్యాపీ కన్నుమూసింది. అనంత్‌ అంబానీతోపాటు టుంబ సభ్యులు తమ కుక్కకు భావోద్వేగ నివాళిని కూడా పంచుకున్నారు. హ్యాపీ మరణంపై నటుడు వీర్ పహారియా కూడా విచారం ప్రకటించారు. హ్యాపీ జ్ఞాపకార్థం ఫోటో ఒకటి వైరల్‌గా మారింది.
Read More
26

బంగారం ధర భారీ తగ్గింపు

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈరోజు తగ్గుముఖం పట్టింది. బుధవారంతో పోలిస్తే గురువారం భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Read More
27

అన్నింట్లోనూ దోషి చంద్రబాబే

విశాఖ: చంద్రబాబు ఏడాది పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయని, కానీ వేటిలోనూ చర్యలు కనిపించలేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం చంద్రంపాలెంలో సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూ, తొక్కిసలాట ఘటన,శ్రీకూర్మంలో తాబేళ్లు.. తిరుమల గోశాలలో గోవుల మరణం, కాశినాయన కూల్చివేత.. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా..
Read More
28

త్వరలో మూడు సినిమాలు : డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ

ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డ్, నమస్తే సేట్ జీ, దక్ష, మిస్టరీ లాంటి సినిమాలు తీసిన తల్లాడ సాయి కృష్ణ రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు మెగాఫోన్ పట్టనున్నాడు. ఈ రెండేళ్ల గ్యాప్‌లో మూడు కథలని సిద్ధం చేసుకున్నాని సాయి కృష్ట తెలిపారు. అందులో ఒక సినిమా లో ప్రముఖ హిరో ఉండబోతున్నాడు, ఇంకొక సినిమా లో ఫెమస్ ప్రొడ్యూసర్ , పేమస్ హీరో కలసి చేయబోతున్నారు, ఇంకొక సినిమా అందరూ కొత్తవాళ్లే నటిస్తారని చెప్పారు
29

విడాకులా? ఇంకా హనీమూన్‌లా ఉంది!

ప్రిన్స్ హ్యారీ , మేఘన్ మార్కెల్ వివాహం ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన రాయల్‌ వెడ్డింగ్‌గా నిలిచింది. అయితే ఈ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు బాగా వ్యాపించాయి. ఈ వార్తలను మేఘన్ మార్కెల్‌ క్లారిటీ ఇవ్వడం విశేషం. ఆమె చెప్పిందో వివరాలను తెలుసుకుందాం.
Read More
30

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప శ్రేణిలో కన్సాలిడేట్ కావడంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈల్లో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్ లోనూ స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగ్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. గురువారం (మే 1) ట్రేడింగ్ హాలిడే నేపథ్యంలో ట్రేడింగ్ కార్యకలాపాలు మందకొడిగా సాగాయి
Read More
31

అప్పన్న సన్నిధిలో విషాదం.. గోడకూలి ఏడుగురు భక్తులు మృతి

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రు‍తి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు.
Read More
32

సంజయ్‌ మంజ్రేకర్‌కు విరాట్‌ అన్న వికాస్‌ కౌంటర్‌

టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అన్నయ్య వికాస్‌ కోహ్లి సంజయ్‌ మంజ్రేకర్‌కు ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘సంజయ్‌ మంజ్రేకర్‌.. వన్డే కెరీర్‌ స్ట్రైక్‌ రేటు: 64.31.. 200కి పైగా స్ట్రైక్‌రేట్ల గురించి మాట్లాడటం సులువే’’ అంటూ సెటైర్లు వేశాడు.
Read More
33

అక్షయ తృతీయ.. ప్లీజ్‌..గాయని చిన్మయి

పరశురామ జయంతి అని కూడా పిలిచే అక్షయ తృతీయ అనేది వైశాఖ మాసం చివర్లొ శుక్ల పక్ష తదియ నాడు జరుపుకునే వసంత పండుగ. ద్రౌపది అక్షయ పాత్ర విశేషం తరువాత అక్షయ తృతీయను ఆచరణలోకి వచ్చిందని గాయని చిన్మయి శ్రీపాద పేర్కొంది. ఈ రోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, పేదలకు ఒక్క రూపాయి అయినా దానం ఇవ్వాలని సూచించింది.
Read More
34

అక్షయ తృతీయ.. గోల్డెన్‌ ఛాన్స్‌! పసిడి తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం తులం త్వరలో రూ.లక్షలకు చేరుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారంతో పోలిస్తే బుధవారం అక్షయ తృతీయ రోజున పసిడి ధర స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది.
Read More
35

రౌడీ వేర్ లో ఆకట్టుకుంటున్న సూర్య

హీరో విజయ్ దేవరకొండ ప్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ సామాన్యుల నుంచి స్టార్ హీరోల దాకా అందరికీ ఫేవరేట్ క్లాత్ బ్రాండ్ గా మారుతోంది. స్టార్ హీరో సూర్య రౌడీ వేర్ పోలో టీ షర్ట్స్ లు ధరించి స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. రౌడీ వేర్ టీ షర్ట్స్ తో సూర్య తన కొత్త సినిమా రెట్రో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
36

హైద‌రాబాద్ తెలంగాణ‌లో వేస‌వి ముదురుతోంది. ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి. ఈ సీజ‌న్‌లో కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయ‌ని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) త‌న నివేదిక‌లో తెలిపింది. వేస‌వి అంటేనే “స్టోన్ సీజ‌న్” అంటారు. ఈ కాలంలో శ‌రీరంలో నీరు ఆవిరి అయిపోవ‌డం, ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం, త‌గినంత నీరు తీసుకోక‌పోవ‌డం లాంటివి దీనికి కారణం.
Read More
37

దేశ భద్రతపై రాజీపడొద్దు

న్యూఢిల్లీ: ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు.కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముంది. అయితే, దాన్ని ఎవరిపైన ఉపయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా.. దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు.
Read More
38

ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..

2025లోనూ లేఆప్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస తొలగింపులు చేపడుతూనే ఉంది. తాజాగా మరో 195 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాదిలోనే ట్రైనీలను తొలగించడం వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం.
Read More
39

గొంతులేని వారికి బాసటగా నిలవాలి

తాడేపల్లి: ప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది అని పార్టీ జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి..
Read More
40

భారత్‌తో జాగ్రత్త.. పాక్‌ ప్రధానికి నవాజ్‌ షరీఫ్‌ హెచ్చరిక

లాహోర్‌లో నవాజ్‌ షరీఫ్‌తో పాక్‌ పీఎం షహబాజ్‌ భేటీ అయ్యారు. పహల్గాం దాడి తర్వాత భారత్‌ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. భారత్‌ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు. నవాజ్‌ షరీఫ్‌ స్పందించి.. దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్నిదౌత్య మార్గాలను వినియోగించుకోవాలని తన తమ్ముడికి సూచించారు.
Read More
41

భారత్‌తో యుద్ధ భయం.. పాక్‌ సైన్యం సంచలన నిర్ణయం

పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌కు టెన్షన్‌ మొదలైంది. పాక్‌ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్‌’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్‌ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.
Read More
42

అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?

భారత్‌లో బంగరానికి ఉన్న విలువ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తరాలుగా పసిడి సంపదకు గుర్తుగా ఉంటోంది. సంపద ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ఏటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఆరోజు పసిడి కొంటే ఆ ఏడాదంతా సంపద సొంతం అవుతుందని అనుకుంటారు. రేపు అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి.
Read More
43

కూటమి కుట్రలు

అమరావతి: ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్‌ చేసి సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం ఎంతలా వేధిస్తోందో తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు బెయిల్‌ లభించడం దాదాపు ఖాయం అయ్యింది. ఈలోపు కూటమి మళ్లీ కుట్రలకు తెర తీసింది. సీఎస్‌ను రంగంలోకి దించి మరీ విజయవాడలో కేసు నమోదు చేయించింది.
Read More
44

వాట్‌ ఈజ్‌ దిస్‌ సిద్ధూ?

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనదైన వ్యవహార శైలితో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పబ్లిక్‌ మీటింగ్‌లో ప్రతిపక్షాలు ధర్నాకు దిగితే భరించలేకపోయారు. ఆ అసహనం ఓ పోలీస్‌ అధికారిపై చూపించారు. ఆ వీడియో ఇప్పుడు ఆయనపై తీవ్ర విమర్శలకు తావు ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
Read More
45

సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం

తల్లిదండ్రులు ఎంత సంపాదించినా.. వారి ఆస్తి నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఎదిగేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. బిల్‌గేట్స్ కుమార్తె 'ఫోబ్ గేట్స్' (Phoebe Gates). ఈమె తండ్రిపై ఆధారపడకుండానే.. సొంతంగా స్టార్టప్ కోసం నిధులను సమకూర్చుకుంది. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని టెక్ బిలియనీర్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Read More
46

బంగారం లాంటి పాప, చేతులెలా వచ్చాయ్‌!

స్మార్ట్‌ యుగం అని చెప్పుకొని పొంగిపోతున్న నేటి కాలంలో కూడా ఆడ శిశువులపై అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడబిడ్డ మహాలక్ష్మీగా భావించే సమాజమే ఆడబిడ్డను భారంగా భావిస్తుంది. అందుకే కొందరు తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న బాధతో పసిగుడ్డును ఆసుపత్రిలోనే వదిలేసిన ఘటన వైరల్‌గా మారింది.
Read More
47

అతడిని టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోండి: పీటర్సన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ (Kevin Pietersen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడని.. అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు.
Read More
48

గ్రానీ' అభిరుచులే ట్రెండ్‌ అంటున్న యువత..! నిపుణులు ఏమంటున్నారంటే..

ఈకాలం యువత ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇదివరకు 90ల యువత వంటపని, కుట్లు, అల్లికలు వంటి ఇతరత్ర కళలు నేర్చుకునేవారు. ఇప్పుడు ఇంటర్‌నెట్, స్మార్ట్‌ఫోన్‌ల యుగం. ఏది గంటలకొద్దీ నేర్చుకునేందుకు ఇష్టపడరు. క్షణాల్లో పట్టేసి చకచక నేర్చేసే జెన్‌ జెడ్‌ తరం ఇది. వారి మెదుడు కూడా మహాచురుకు. ఇట్టే నేర్చుకునే అపార ప్రతిభాపాటవాలు వారి సొంతం. పైగా డిజిటల్‌ హవా కాబట్టి ఆ దిశగానే స్కిల్స్‌ పెంచుకుంటోంది యు
Read More
49

కేసీఆర్‌ స్పీచ్‌లో పస లేదు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని, చివరి ఆరు నెలల్లోనే వీటిపై కచ్చితంగా చర్చ జరుగుతుందని అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్(KCR) తన అక్కసు మొత్తం గక్కారు. కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పిల్లగాళ్లు అని ఆయన అన్నారు. మరి వాళ్లనెందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు?. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన.
50

వెళ్లకపోతే, మూడేళ్ల జైలు, రూ.3 లక్షల జరిమానా

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ గడువు విధించింది. గడువులోపు దేశాన్ని వీడకపోతే వారిని జాతీయులను అరెస్టు చేసి, విచారణకు ఆదేశించవచ్చు .మూడు సంవత్సరాల జైలుశిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.
Read More