Short Stories | Sakshi
1

‘మిమ్మల్ని క్షమాపణలు ఎవరు అడిగారు?’

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కీలక భూమిక పోషించిన కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై..
Read More
2

‘మహిళలకు ఫ్రీ బస్సు పథకానికి ముహూర్తం ఏంటి?’

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ పథకం ప్రస్తావన తీసుకురాకపోవడంపై..
Read More
3

‘బ్రదర్.. ఇది ఉగ్రవాదంపై పోరు.. లోకల్ పాలిటిక్స్ పక్కనపెట్టు’

ఉగ్రవాద మూకలను తన దేశంలోనే పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగట్టే క్రమంలో భారత ప్రజాప్రతినిధులను విదేశాలకు పంపే ప్రక్రియను ‘ ఇండియా కూటమి’ బాయ్ కాట్ చేయాలంటూ శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై..
Read More
4

శరణార్థులపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఢిల్లీ: శ్రీలంక శరణార్థుల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక శరణార్థులు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్‌పై సోమవారం(మే 19 వ తేదీ) విచారించిన ధర్మాసనం... విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Read More
5

Yoga ప్రాణాయామంతో బాడీకీ రీచార్జ్‌

యోగాలో ప్రాణాయామం ప్రయోజనాలు యోగాకు మించి ఉంటాయి.శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తూనే తగినంత ఆక్సిజన్‌ సరఫరాతో శ్వాసను నియంత్రించడం, సరైన విధంగా సాధన చేయడం ఈ యోగాలో కీలకం. శరీరాన్ని రీఛార్జ్‌ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది ప్రాణాయామం జీర్ణాశయానికి ఆక్సిజన్‌ సరఫరాను పెంచుతుంది, మెరుగైన జీర్ణక్రియ కోసం రక్త ప్రవాహాన్ని, ప్రేగుల బలాన్ని పెంచుతుంది.
Read More
6

హత్యాయత్నం కేసులో నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్‌

హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్‌. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది.గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసిన అల్లర్లతోపాటు, పార్టీకి ఆర్థిక సాయంచేసిందనే ఆరోపణలున్నాయి.
Read More
7

అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: క్లెయిమ్ ప్రాసెస్ ఇలా..

అసలే వేసవి కాలం.. భానుడి భగభగలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సాధారణంగా అగ్ని ప్రమాదాలు, షార్ట్‌ సర్క్యూట్‌లు జరుగుతుంటాయి. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని 'గుల్జార్‌హౌస్‌'లో జరిగిన అగ్ని ప్రమాదంలో.. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది.
Read More
8

చెట్టాపట్టాలేసుకుని.. జాలీగా సండే షాపింగ్‌

బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్‌బర్డ్స్‌ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్‌లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్‌ చేయడం సోషల్‌ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్‌డేట్ పేజీ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది.
Read More
9

మరింత ఖరీదైన బంగారం.. నేడు తులం..

దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ ఎగిశాయి. రెండు రోజులు నిలకడగా ఉన్న పసిడి ధరలు నేడు (మే 19) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులు కాస్త ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మే 19 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Read More
10

ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ.. వైద్య రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆధునిక వైద్య శాస్త్రాన్ని పునర్నిర్వచించగల చర్యలో భాగంగా.. చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI ఆధారిత ఆసుపత్రి (ఏజెంట్ హాస్పిటల్)ని ప్రారంభించింది.
Read More
11

ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సంచలన డైరెక్టర్‌ రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద సందడి చేశారు. హాలీవుడ్‌ మూవీని థియేటర్లో వీక్షించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా సినిమాను చూసి బయటకు వచ్చిన ఆర్జీవీని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. సినిమా ఎలా ఉందని అడగడంతో సూపర్‌గా ఉందంటూ రాం గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. టామ్ క్రూయిజ్ అద్భుతంగా చేశాడని కొనియాడారు.
Read More
12

నటుడు మిథున్‌ చక్రవర్తికి నోటీసులు

సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్‌లో ఉండే ఎరంగేల్‌ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్‌ ఒక గ్రౌండ్‌ ఫ్లోర్‌, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది.
Read More
13

కొత్త మార్కెట్‌కు తెరలేపిన ఆర్‌బీఐ నిర్ణయం

మొబైల్‌ వాడకం కోవిడ్‌–19 తరువాత భారత్‌లో గణనీయంగా పెరిగింది. డేటా ఫర్‌ ఇండియా 2025 ఫిబ్రవరి నివేదిక ప్రకారం.. ఈ విషయంలో 10–19 ఏళ్ల వయసువారు ముందంజలో ఉన్నారు. మొబైల్‌ వినియోగంలో నైపుణ్యత పట్టణ ధనిక వర్గం పిల్లలకే పరిమితం కాలేదు. గ్రామాల్లోనూ పెరిగింది.
Read More
14

ఎస్‌బీఐ-అపోలో కొత్త క్రెడిట్‌ కార్డు..

న్యూఢిల్లీ: ప్రముఖ క్రెడిట్‌ కార్డుల జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్, దిగ్గజ రిటైల్‌ ఫార్మసీ చెయిన్‌ అపోలో హెల్త్‌కో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అపోలో ఎస్‌బీఐ కార్డ్‌ సెలెక్ట్‌ కార్డ్‌ను ఆవిష్కరించాయి. ఈ కార్డ్‌ ద్వారా అపోలో ఫార్మసీతో పాటు అపోలో 24/7 యాప్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. ఫార్మసీ ఉత్పత్తులు, ఆరోగ్య పరీక్షలు, ఇతర పలు రకాల సేవలకు చెల్లింపులు చేయొచ్చు.
Read More
15

బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్‌ 9 ఫుడ్స్‌

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ ఉండాలి. లమన శరీర బరువు నియంత్రణలో ఉండాలన్నా, శరీర బరువును తగ్గించుకోవాలన్నా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అందుకు మన ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన కొన్నిముఖ్యమైన ఆహార పదార్థాలు ఆకుకూరలు, ఓట్స్‌, గ్రీక్‌ యోగర్ట్‌ , నట్స్‌,గుడ్లు, చిక్కుళ్లు, అవకాడో,బెర్రీ , ఆకుకూరలు, చాలా ముఖ్యం.
Read More
16

చికెన్‌ లెగ్స్‌.. అగ్గిపుల్ల అని బాడీ షేమింగ్‌ చేశారు :అనన్య పాండే

తాను కూడా బాడీ షేమింగ్‌కి గురయ్యానంటోంది బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సమయంలో తన శరీర సౌష్ఠవం కామెంట్స్‌ చేశారని చెప్పింది. అప్పుడు తను సన్నగా ఉండడంతో చికెన్‌ లెగ్స్‌.. అగ్గిపుల్ల అని విమర్శించారని చెప్పింది. ఇప్పుడు సహజంగా మారితే..ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందని ట్రోల్‌ చేస్తున్నారని.. మహిళలు ఎలా ఉన్నా ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయని, వాటిని పట్టించుకోవద్దని సూచించింది
17

కేరళలో 'అల్లు అర్జున్‌'కు స్టార్‌ ఇమేజ్‌.. కారణం ఎవరో తెలుసా?

అల్లు అర్జున్‌కు మలయాళంలో భారీగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అక్కడ బన్నీకి అంతలా గుర్తింపు రావడం వెనుక ఒక నిర్మాత ఉన్నారని మీకు తెలుసా? ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. మలయాళీలు ఆయన్ను మల్లు అర్జున్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్‌లో మాదిరే అక్కడ ఏమాత్రం తగ్గకుండా బన్నీ సినిమాలు కేరళలోనూ ఆడుతుంటాయి. అయితే, మలయాళీ గడ్డమీద మన బన్నీ అడుగులు ఎలా పడ్డాయో తెలుసా..
Read More
18

ఇంగ్లండ్‌ టూర్‌: వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?

భారత్‌-‘ఎ’- ఇంగ్లండ్‌ లయన్స్‌ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్‌ 6 నుంచి రెండో మ్యాచ్‌ జరుగుతాయి. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఐపీఎల్‌-2025 ప్లే ఆఫ్స్‌నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పినట్లు సమాచారం.
Read More
19

హమ్మయ్య.. పసిడి ప్రియులకు ఊరట

పసిడి ప్రియులకు ఊరట లభించింది. దేశంలో బంగారం ధరలు (Gold Prices) నేడు (మే 17) నిలకడగా కొనసాగుతున్నాయి. క్రితం రోజున భారీగా పెరిగిన పసిడి ధరలు ఈరోజు మరింతగా పెరగకుండా స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభించింది. మే 17 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Read More
20

గుడ్‌ న్యూస్‌ : బట్టతలపై తిరిగి జుట్టు వస్తుంది

వయసు మీరుతున్న కొద్దీ తలపై జుట్టూడిపోవడం సాధారణం. కానీ.. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంటుంది. అయితే త్వరలోనే ఈ సమస్య తీరి పోతుందంటున్నారు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా... రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని వీరు చెబుతున్నారు .నొప్పి లేకుండా, ఇది సాధ్యమని వారు వివరించారు.
Read More
21

సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్‌ వచ్చేసింది.. సరికొత్త టెక్నాలజీతో..

సుజుకి ద్విచక్రవాహనాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్ సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్‌ను ఆ కంపెనీ తాజాగా విడుదల చేసింది. జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ కు చెందిన భారత విభాగమైన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త వేరియంట్ సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది.
Read More
22

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్‌..

ఐపీఎల్ 2025 పునఃప్రారం వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లో ఆడేందుకు ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అతడు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. మెక్‌గర్క్ స్ధానంలో బంగ్లాపేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది.
Read More
23

‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’

‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు’.
Read More
24

‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’

ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గో స్థానం. అయితే ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత..
Read More
25

అరుదైన గౌరవం.. రోహిత్‌ శర్మ భావోద్వేగం

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) ఘనంగా సత్కరించింది. వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో రోహిత్‌ శర్మ పేరిట ఉన్న స్టాండ్‌ను శుక్రవారం ఆరంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి రోహిత్‌ తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్‌ శర్మ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టేడియంలో రోహిత్‌ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు.
Read More
26

ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన లోహాల్లో బంగారం ఒకటి. బంగారాన్ని వేలాది సంవత్సరాలుగా ఐశ్వర్యానికి, హోదాకు ప్రతిరూపంగా పరిగణిస్తూ వస్తున్నారు. బంగారం మంచి విద్యుత్ వాహకం. దీని ఉపయోగాలు ఎలా ఉన్నా మృదువైన, అరుదైన, సులభంగా ఆకృతులు చేసేందుకు అనువైన ఈ లోహాన్ని ముఖ్యంగా ఆభరణాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. డిమాండ్‌ కారణంగా బంగారం విలువ అంతకంతకూ పెరుగుతూ అత్యంత ఖరీదైన లోహంగా మారింది.
Read More
27

కేటీఎం బైక్‌ల ధరలు పెరిగాయ్‌..

ప్రముఖ ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ కేటీఎం ఇండియన్ మార్కెట్లో విక్రయించే తమ ద్విచక్ర వాహనాల ధరలను సవరించింది. ఈ మార్పులతో వివిధ బైక్‌ల ధర రూ.12,000 వరకు పెరిగింది. ఆయా మోడళ్లపై కనీసం రూ.1,000 మేర ధరలను కంపెనీ పెంచేసింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులతోపాటు ద్రవ్యోల్బణ వ్యత్యాసానికి అనుగుణంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఇతర కంపెనీలతోపాటు కేటీఎం కూడా తమ బైక్‌ల ధరలను పెంచింది.
Read More
28

‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కానీ పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలతో బీజీ కావడం వల్ల షూటింగ్‌ అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకోవడంతో రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.జూన్‌ 12నీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.
Read More
29

అసుపత్రిలో బిగ్‌బాస్‌ విన్నర్‌, పోస్ట్‌ వైరల్‌

దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు. అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీ తోనే బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్‌గా నిలిచింది. తాజాగా దీపిక కాకర్‌ను లివర్‌లో పెద్ద ట్యూమర్‌ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని తొలగించేందుకు ఆసుపత్రిలో చేరింది.
Read More
30

మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్‌

ఐపీఎల్‌-2025లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) అదరగొడుతోంది. కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ దిశగా దూసుకుపోతున్న ఆర్సీబీ... ఈసారైనా టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఒకప్పుడు తనకు జట్టులో చోటే ఇవ్వని ఆర్సీబీకి తిరిగి రావొద్దని పాటిదార్‌ అనుకున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.
Read More
31

స్పెషల్‌ హెయిర్‌ స్టైల్‌తో మెరిసిన 17 ఏళ్ల యంగ్‌ బ్యూటీ

లాపతా లేడీస్‌ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్‌హీరోయిన్‌ నితాన్షి గోయల్ (Nitanshi Goel). 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటైన లాపతా లేడీస్‌లోని ఫూల్‌ పాత్రతో అభిమానులను కట్టిపడేసింది. ఇన్‌స్టాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న అతి పిన్న వయస్కురాలైన నటి కూడా నితాన్షి కావడం విశేషం. తాజాగా కాన్స్‌లో తనదైన స్టైల్‌తో అందర్నీ దృష్టినీ తన వైపుతిప్పుకుంది.
Read More
32

ఉగ్రవాది కథ.. తల్లి ప్రేమ వద్దంది.. యమలోకం రమ్మంది!

శ్రీనగర్‌: ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) తర్వాత జమ్మూకశ్మీర్‌ (jammu and kashmir)లో ఉగ్రవేట మళ్లీ జోరందుకుంది. రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
Read More
33

కేన్స్‌: అరంగేట్రం ఆనందం ఆవిరి : ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ మాయం

ఫ్యాషన్ సిటీ ఫ్రాన్స్‌లో కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌కుచెందిన భారతీయ ప్లస్-సైజ్ ఇన్‌ఫ్లుయెన్సర్ , ఫ్యాషన్ ఐకాన్ సాక్షి సింధ్వానీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేన్స్ రెడ్ కార్పెట్ అరంగేట్రానికి కొన్ని గంటల ముందు, సాక్షి సింద్వానీ లగేజీ మొత్తం మాయమైపోయింది.
Read More
34

WTC: డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రైజ్‌ మనీ ప్రకటన

డబ్ల్యూటీసీ 2023-25 ఫైన‌ల్ ప్రైజ్ మ‌నీనీ ఐసీసీ ప్ర‌క‌టించింది. ఫైన‌ల్లో విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు 3.6 మిలియ‌న్ల డాల‌ర్లు( భార‌త కరెన్సీలో సుమారు రూ. 31 కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌నున్న‌ది. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జ‌ట్టుకు 2.1 మిలియ‌న్ల డాల‌ర్ల ( సుమారు రూ. 18 కోట్లు) న‌గ‌దు బ‌హుమ‌తి ల‌భించ‌నుంది. జూన్ 11 నుంచి 15 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న తుది పోరులో ద‌క్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జ‌ట్లు తలపడనున్నాయి.
Read More
35

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

విశాఖ: రానున్న ఐదు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. నేడు అల్లూరి, మన్యం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కేంద్రకృతమైంది.
Read More
36

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన రష్మిక!

బేబీ మూవీతో సూపర్ హిట్‌ కొట్టిన జోడీ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఆనంద్, వైష్ణవి మరోసారి లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read More
37

పాకిస్తాన్‌ మొత్తం జీడీపీ కలిపితే.. తమిళనాడంత లేదు!

పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను చూసి.. ప్రపంచ దేశాలే జాలిపడుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర వంటి భారతీయ రాష్ట్రాల కంటే ముందున్న దాయాది దేశం (పాకిస్తాన్) ఆర్థిక స్థితి గత రెండు దశాబ్దాలుగా గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. తమిళనాడు జీడీపీ ఇప్పుడు పాకిస్తాన్ జీడీపీని దాటేసినట్లు కొత్త డేటా ద్వారా తెలుస్తోంది.
Read More
38

భర్తల మోసం, పెళ్లి చేసుకున్న మహిళలు

బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా వీరిద్దరు ఈ పెళ్లికి చేసుకునేందుకు చెప్పిన కారణం ఏంటో తెలుసా? వారికి పురుషులంటే ఇష్టం లేదుట. డేటింగ్‌లు, డేటింగ్‌ యాప్‌ మెసాలు, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న నమ్మకద్రోహాలతో విసిగిపోయి, పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడం వల్ల పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ జంట తెలిపింది.
Read More
39

పసిడి ఢమాల్‌.. రూ.వేలల్లో తగ్గిన బంగారం

దేశంలో బంగారం ధరలు (Gold Prices) భారీగా పడిపోయాయి. వరుసగా రెండో రోజూ గణనీయ తగ్గుదలను నమోదుచేశాయి. అమెరికా, చైనా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రభావంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు పతయ్యాయి. దీంతో బంగారం తులం ధర నేడు (మే 15) రూ.వేలల్లో క్షీణించింది. మే 15 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Read More
40

ట్రంప్‌ బ్రాండ్‌ ఇళ్లు.. లాంచ్‌ రోజునే అన్నీ సేల్‌!

గురుగ్రామ్‌లోని ట్రంప్‌ బ్రాండ్‌ నివాసాలు రికార్డ్‌ సృష్టించాయి. స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్, ట్రిబెకా డెవలపర్స్ అభివృద్ధి చేసిన ట్రంప్ రెసిడెన్స్ లాంచ్ రోజునే మొత్తం అమ్ముడుపోయాయి. రూ.3,250 కోట్ల కేటాయింపులు నమోదయ్యాయి. ఇందులో రూ.125 కోట్ల విలువైన నాలుగు అల్ట్రా ప్రీమియం పెంట్‌ హౌస్‌లను కూడా పూర్తిగా కేటాయించినట్లు స్మార్ట్‌ వరల్డ్ డెవలపర్స్ తెలిపింది.
Read More
41

భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ

ఇస్లామాబాద్‌: భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందంపై (indus waters treaty) సమీక్షించుకోవాలని ప్రాధేయపడింది.
Read More
42

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న సెమీకండక్టర్ పరిశ్రమ ఇప్పుడు భారత్‌లోనూ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే దేశంలో ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణ దశలో ఉండగా ఆరో యూనిట్‌గా ఇది ఏర్పాటవుతోంది.
Read More
43

మీ వైఖరేంటో?... మొన్న కాల్పుల విరమణ.. నేడు డిన్నర్!

ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జ‌పిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్‌ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకుంటున్నారు ట్రంప్. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?..
Read More
44

‘బద్మాషులు’ విజయం సాధించాలి: నవీన్‌ చంద్ర

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లోకం మారిందా సాంగ్ ను హీరో నవీన్ చంద్ర విడుదల చేసి జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాషులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
45

'వారికి ఆ ధైర్యం లేదు.. అందుకే సందీప్‌ రెడ్డి వంగాను టార్గెట్‌ చేశారు'

ది కశ్మీర్‌ ఫైల్స్ మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో వివేక్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్‌ దర్శకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
Read More
46

డయాబెటిస్‌ని చిటికెలో నయం చేసే గుడి.. ఎక్కడుందంటే?

భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్‌తో బాధపడుతున్నారు.
Read More
47

ఆపరేషన్‌ సిందూర్‌ : రాంబాబు సింగ్‌ వీరమరణం

పహల్గామ్‌ ఉగ్రదాడి అనేక కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపిండి. తాజాగా BSF కానిస్టేబుల్ రాంబాబు సింగ్ అసువులు బాశాడు. మే 9, 2025న ఇండో-పాక్ సరిహద్దులో తన ధైర్య సైనికుల సోదరులతో కలిసి పోరాడుతున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లో ప్రత్యర్థుల కాల్పులకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతను మే 13న తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.
Read More
48

హీరో సూర్యలా 100 రోజుల్లోనే సిక్స్‌ ప్యాక్‌ సాధ్యమేనా! నిపుణుల వార్నింగ్‌ ఇదే..

కోలీవుడ్‌ నటుడు సూర్య శివకుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన పరంగా ఆయనకు సాటి లెరెవ్వరూ. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఒదిగిపోవడం సూర్య ప్రత్యేకత. తన వైవిధ్యభరితమైన నటనతో మంచి ప్రేక్షకాధరణ ఉన్న నటుడు. తాను నటించే పాత్ర కోసం మొత్తం ఆహార్యమే మార్చుకునేందుకు వెనకడుగువేయని గొప్ప నటుడు.
Read More
49

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. టీ20, టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా ఈ ఇద్దరి గ్రేడ్‌ ఏ ప్లస్‌ కాంట్రాక్ట్‌ కొనసాగుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పష్టం చేశారు. రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికినా రోహిత్‌, కోహ్లి ఇంకా భారత క్రికెట్‌లో భాగమేనని, గ్రేడ్‌ ఏ ప్లస్‌లో సకల సదుపాయాలకు వారు అర్హులేనని సైకియా తెలిపారు.
Read More
50

IPL 2025: ముంబై ఇండియ‌న్స్‌కు అదిరిపోయే న్యూస్‌..

ఐపీఎల్‌-2025 సీజ‌న్ పునఃప్రారంభం వేళ ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. న్యూజిలాండ్ స్టార్ పేస‌ర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి ముంబై జ‌ట్టులో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ తాత్కాలికంగా వాయిదా ప‌డ‌డంతో బౌల్ట్ త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ మే 17న‌ తిరిగి ప్రారంభమ‌వ్వుతుండ‌డంతో బౌల్ట్ ఒక‌ట్రెండు రోజుల్లో భార‌త గ‌డ్డ‌పై అడుగుపెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.
Read More