ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే.. | ys jagan mohan redday takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

Aug 25 2015 5:35 PM | Updated on Mar 20 2024 1:45 PM

ఓటుకు కోట్లు కేసు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన వైఎస్ జగన్.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు నాడు చెప్పిందేమిటి?.. ఇప్పుడు చేసేదేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను బాబు మోసం చేస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు గురించి కేంద్రంతో మాట్లాడుకోవటం వల్లే చంద్రబాబు మౌనం దాల్చుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి తగ్గినా.. చంద్రబాబు మిన్నుకుండిపోవడానికి కారణం ఓటుకు కోట్లు కేసేనన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధానితో చంద్రబాబు ఏమీ మాట్లాడలేదనేది అందరికీ అర్ధమైందన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలను బాబు కలిసినా.. ప్రత్యేక హోదాపై వారు కానీ, బాబు కానీ మాట్లాడటకపోవటాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ఏపీ ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల హక్కని, దానిని సాధించుకుందామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement