లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణకు ఢిల్లీలో తెలంగాణ సెగ తగిలింది. ఏపీ భవన్ వద్ద ఆయనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని తెలంగాణ న్యాయవాదులు, విద్యార్థులు అడ్డుకున్నారు. జై తెలంగాణ, జేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జేపీ చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణవాదుల ఆందోళన మధ్య జేపీని పోలీసులు అక్కడిని నుంచి ఏపీ భవన్లోపలికి తీసుకెళ్లారు.
Feb 11 2014 7:50 PM | Updated on Mar 28 2019 5:23 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement