నాకు డబ్బుతో పనిలేదు
‘‘నాకు డబ్బుతో పనిలేదు.. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కొట్టిస్తుంది. ఇంట్లో సరిపడా నిత్యావసర వస్తువులున్నాయి. అరుునా నేను ఎప్పుడూ డబ్బు వాడిన దాఖలాలు లేవు.
- ఇంట్లో సరిపడా నిత్యావసరాలున్నాయి
- నోట్ల రద్దు ఒక సంస్కరణ.. ఇబ్బందులుంటాయి
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ‘‘నాకు డబ్బుతో పనిలేదు.. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కొట్టిస్తుంది. ఇంట్లో సరిపడా నిత్యావసర వస్తువులున్నాయి. అరుునా నేను ఎప్పుడూ డబ్బు వాడిన దాఖలాలు లేవు. నా జేబులో డబ్బులు కూడా ఉండవు...’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మీ వ్యక్తిగత అవసరాలకు ఎంత డబ్బు మార్చుకున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానమిది. నోట్ల రద్దు పరిణామాలను విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్న ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది ఒక సంస్కరణ అని, నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో రూ.6,500 కోట్ల సొమ్మును బ్యాంకులు పంపిణీ చేసినా, అందులో రెండు వేల నోట్లే ఎక్కువగా ఉన్నాయని, వాటికి చిల్లర దొరకడంలేదని తెలిపారు. ఈ ఇబ్బందులను తగ్గించేందుకు లీడ్ బ్యాంకై న ఆంధ్రాబ్యాంకు, లావాదేవీలు ఎక్కువగా జరిగే ఎస్‌బీఐ, ఆర్‌బీఐ రీజినల్ అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. డిజిటల్ లావాదేవీలకు పరిమితి లేనందున అందరూ దాన్ని వినియోగించుకోవాలన్నారు.
1,500 కోట్ల విలువైన నోట్లు పంపండి
పెద్ద నోట్ల మార్పిడితో ఏర్పడిన ఇబ్బందుల నుంచి రాష్ట్రం బయటపడేందుకు రూ.1,500 కోట్ల నోట్లు పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. రూ. 500 నోట్లు వెరుు్య కోట్లు, రూ. 100 నోట్లు 500 కోట్లు పంపాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గరవ్నర్ ఉర్జిత్ పటేల్‌లకు లేఖ రాసినట్లు వెల్లడించారు.


