Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Chandrababu and Pawan Kalyan in extreme frustration
తారస్థాయికి చేరిన టీడీపీ అరాచకాలు

సాక్షి, అమరావతి: ఇదిగో.. ఓటమి.. కళ్ల ముందు కదలాడుతోంది.. పోలింగ్‌ రోజున ప్రజలు వరుసగా వచ్చి, జన నేత, సంక్షేమ సారథి సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తున్నట్టే కనిపిస్తోంది.. చంద్రబాబు కళ్ల ముందు కూటమి ఘోర ఓటమి కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు వణుకు ఎక్కువైంది. మరో 48 గంటల్లో ఎన్నికల పోలింగ్‌.. చంద్రబాబు, ఆయన కూటమికి మరోసారి కళ్ల ముందు ఘోర పరాజయం ఖాయమైంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు మనమేం చెప్పాలీ అని అంటే.. చెప్పుకొనే పనులేమీ చేయలేదు. చేసినవన్నీ మోసాలు, మాయలే. పోనీ పవన్‌.. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించడం ఒక్కటే ఉంది. మూడు జెండాలు జతకట్టినా, మరో మూడు జెండాల సహాయం తీసుకుంటున్నా.. కోట్ల నోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. మందు మంచి నీళ్లలా పోస్తున్నా.. 2019 ఎన్నికల కంటే ఘోర ఓటమే కళ్ల ముందు కనిపిస్తోంది. కించిత్తు ఆశ లేదు. పిచ్చెక్కిపోయింది.. పచ్చ ద్వయం చంద్రబాబు, పవన్‌కి ఫ్ర్రస్టేషన్‌ పీక్స్‌కి చేరింది. ఇద్దరూ నోటికి పని చెప్పారు. దుష్ఫ్రచారం, దూషణలు, బూతులు, దాడులు, ఎన్నికల అక్రమాలతో చెలరేగిపోతున్నారు. సీఎం జగన్‌ పైన, ఆయన ప్రభుత్వం పైన విషం కక్కుతున్నారు .నాలుక ఎటు తిరిగితే అది మాట్లాడేస్తున్నారు. బూతులూ వచ్చేస్తున్నాయి. చంద్రబాబయితే చంపుతామనీ అంటున్నారు. దు్రష్పచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించి ఉనికిని చాటుకోవాలన్న దింపుడు కళ్లం ఆశతో మైకు ముందుకొస్తున్నారు. ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు కల్పించి, భద్రతనిచ్చే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పైన విష ప్రచారం ప్రారంభించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నీతి ఆయోగ్‌ రూపొందించిన ఈ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై యథేచ్ఛగా దు్రష్ఫచారం చేస్తున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలనూ అడ్డుకొంటున్నారు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో నిధులు జమ కాకుండా అడ్డుపడ్డారు. సిగ్గు విడిచిన చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు స్థాయిని మరిచిపోయారు. సిగ్గెగ్గులు గాలికి వదిలేశారు. అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు.. అంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ అరుస్తున్నారు. రాళ్లతో కొట్టండంటున్నారు. లక్ష పుస్తకాలు చదివానని చెప్పుకొనే స్వయంప్రకటిత మేధావి పవన్‌ కళ్యాణ్‌ కూడా వైఎస్సార్‌సీపీ నేతలను తరిమితరిమి కొట్టండి అంటూ జనసేన–టీడీపీ రౌడీలను రెచ్చగొడుతున్నారు. వీరి వీరంగంతో టీడీపీ, జనసేన గూండాలు రెచ్చిల్పింపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. సీఎం జగన్‌ను కొట్టండంటూ చంద్రబాబు రెచ్చగొట్టిన తర్వాతే జగన్‌పై విజయవాడలో హత్యాయత్నం జరిగింది.గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ప్రచారానికి వచ్చిన బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్యపై టీడీపీ–జనసేన మూక రాళ్ల దాడికి తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి, కార్యకర్తలపై టీడీపీ అభ్యర్థి, ఏడు హత్య కేసుల్లో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డి తన అనుచరులతో దాడి చేయించారు. నంద్యాల జిల్లా బనగానిపల్లెలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి భార్య, తనయుడిపై టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డి గూండాలతో దాడులు చేయించారు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో ప్రచారం ముగించుకుని భోజనం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ నేత, జెడ్పీ మాజీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు తన అనుచరులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇవే కాదు.. రాష్ట్రంలో అనేక చోట్ల ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలుస్తామన్న మహిళలు, వృద్ధులు, యువతపైనా దాషీ్టకాలకు దిగుతున్నారు. విధ్వంసం, భయోత్పాతం సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలన్న కుతంత్రంతో చంద్రబాబు, పవన్‌ ముందుకెళ్తున్నారు. పట్టుబడుతున్న రూ.కోట్ల కట్టలు, మద్యం కేసులన్నీ కూటమివే.. ఓ వైపు విధ్వంసం సృష్టిస్తున్న చంద్రబాబు–పవన్‌ కళ్యాణ్‌.. మరో వైపు ఎన్నికల అక్రమాలకూ తెగబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నోట్ల కట్టలు, మద్యం యథేచ్ఛగా పంచుతున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ధనాన్ని దోచేసి నింపుకొన్న నల్ల ఖజానాను తెరిచి.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వందల కోట్లు రాష్ట్రంలో దించారు.ప్రతి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెదజల్లుతున్నారు. కర్ణాటక, గోవా, తెలంగాణ, చత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున మద్యాన్ని రాష్ట్రంలోకి అక్రమంగా తరలించి, వీధి వీధిలో సీసాలు పంచుతున్నారు. ఎన్నికల అధికారుల దాడుల్లో పట్టుబడుతున్న కోట్లాది రూపాయల నోట్ల కట్టలు, కేసులకు కేసుల మద్యం అంతా కూటమిదే కావడం గమనార్హం.

Sajjala Ramakrishna Reddy comments over Chandrababu
‘ల్యాండ్‌ టైట్లింగ్‌’పై దుర్మార్గ రాజకీయం

సాక్షి, అమరావతి: కూటమి కట్టినా ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు­పై చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో చంద్రబాబు చెప్పించగలరా అని నిలదీశారు. కుట్ర­పూరితంగా చట్టంపై దుష్ప్రచారానికి తెగబడ్డారని మండిపడ్డారు. నీతిఆయోగ్‌ ప్రతిపాదనతో కేంద్రం తెచ్చిన ఈ చట్టం 24 రాష్ట్రాల్లో అమల్లో ఉందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అమలవుతోందని గుర్తు చేశారు. ఆ రాష్ట్రాల్లో ప్రజల భూములను ఎవరైనా దోచేశారా అని ప్రశ్నించారు. పత్రికల్లో అసత్య ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రమాదకరమైతే టీడీపీ శాసనసభల్లో ఎందుకు మద్దతిచ్చిందని నిలదీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు చీడపురుగు..ఉగ్రవాది కంటే ఘోరంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై చంద్రబాబు విష ప్రచారానికి ఒడిగట్టారు. ఎన్నికలకు ముందే ఆయన ఎత్తిపోయారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో సీఎం జగన్‌ను రాక్షసుడిగా చిత్రీకరిస్తున్నారు. 2019 జూలైలో శాసనసభలో ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లుకు టీడీపీ ఆమోదం తెలిపింది. ఆ రోజు 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసన మండలిలో స్వయంగా చంద్రబాబు తనయుడు లోకేశ్‌ కూడా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ‘ల్యాండ్‌ టైట్లింగ్‌ బిల్లు’ అమల్లోకి వస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో కూలంకషంగా వివరించారు (ఈ సందర్భంగా కేశవ్‌ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఆ రోజు మద్దతు తెలిపిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. రద్దు చేస్తానంటే కూటమి ఆమోదం ఉండాలి కదా? అది కూడా మోదీ, అమిత్‌షాతో చెప్పించకుండా ఉత్తుత్తి ప్రచారం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. టీడీపీ పోలింగ్‌కు ముందు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ దుష్ప్రచారంపై ఎన్నికల సంఘం సీఐడీని కేసు నమోదు చేయమని చెప్పాక కూడా ఇలాంటి ప్రకటనలను ఈసీ ఎలా అనుమతించింది? ఎన్నికల్లో ఎప్పుడూ సక్రమ మార్గంలో గెలవని చంద్రబాబు లాంటి చీడ పురుగుకు సమాజంలో ఉండే అర్హత లేదు. ప్రజలు తనను నమ్మట్లేదని, సూపర్‌ సిక్స్‌ పని చేయట్లేదని ఆయన గ్రహించాడు. దీంతో ఓటమి భయంతో, దింపుడు కళ్లం ఆశతో దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు పింఛన్‌ అందకుండా అవ్వాతాతలను రోడ్లపైకి తీసుకొచ్చి బలితీసుకున్నాడు. మహిళలకు అందాల్సిన పథకాల నగదును జమ కాకుండా అడ్డుకున్నాడు. నేడు భూములు లాగేసుకుంటారంటూ సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నాడు. రైతుల భూమికి ప్రభుత్వం గ్యారంటీ..భూ దోపిడీకి కేరాఫ్‌ చంద్రబాబు. వెబ్‌ల్యాండ్‌ పేరుతో ఆయన చేసిన భూదోపిడీ, తీసుకొచ్చిన భూ తగాదాలు అన్నీఇన్నీకావు. చుక్కల భూముల పేరుతో ఎందరో భూ యజమానులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. 22ఏలో పెట్టి.. డబ్బులు ఇస్తేవాటిని విడిపించే సంస్కృతిని తీసుకొచ్చారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక లక్షల ఎకరాల చుక్కలు, ఈనాం భూములకు విముక్తి కల్పించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమలులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దాదాపు 120 ఏళ్ల కింద బ్రిటీష్‌ వాళ్లు సర్వే చేశారు. సీఎం జగన్‌ వచ్చిన తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టారు. యజమానుల ఆధ్వర్యంలో భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారు. వాటిని ఆన్‌లైన్‌లో జియో ట్యాగ్‌ చేస్తారు. తద్వారా తగాదాలు వచ్చే పరిస్థితి ఉండదు. డివిజన్, సబ్‌ డివిజన్లు కూడా సమగ్రంగా జరుగుతాయి. ఇవన్నీ పూర్తి చేశాక యజమానికి ప్రభుత్వం పూచీకత్తుతో, ఇన్సూరెన్స్‌ చేసి భూమికి భద్రత కల్పిస్తూ టైట్లింగ్‌ ఇస్తుంది. ఆ తర్వాత వేరొకరు ఆ భూమి తనదంటూ వచ్చినా టైట్లింగ్‌దారుడికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. ఎవరైనా ఆస్తిని కొని నిశ్చింతగా ఉండొచ్చు. సిగ్గు లేకుండా రాజకీయానికి వాడుకుంటున్నాడు..దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ–స్టాంపు విధా­నాన్ని కూడా చంద్రబాబు సిగ్గులేకుండా తన రాజకీయానికి వాడుకుంటున్నాడు. ఈ–స్టాంపులను ట్యాంపర్‌ చేయడానికి ఉండదు. దీన్ని చంద్రబాబు హయాంలోనే 2016–17లో తీసుకొచ్చారు. అప్పట్లో తెల్గీ స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం కూడా ఉందని తేలింది. ఈ ఏడాది జనవరి 8న నందమూరి బాలకృష్ణ విశాఖలో భూములు కొని 12న రిజి­స్ట్రేషన్‌ చేసుకున్నారు. అలాగే ఫిబ్రవరి 8న ఈ–స్టాంపుతో పవన్‌ కళ్యాణ్‌ కూడా మంగళగిరిలో భూమిని కొనుగోలు చేసి అదే నెల 12న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.ఆ రిజిస్ట్రేషన్లకు విలువ లేకపోతే.. వారి­కిచ్చిన పత్రాలను చించేసి చంద్రబాబు తుడు­చుకోవచ్చు కదా. మీ బావమరిది బాలకృష్ణ, దత్తపు­త్రుడు పవన్‌ ఆస్తికి ఇప్పుడేమైనా అయ్యిందా? వాళ్ల స్థలాల్లో ఎవరైనా వెళ్లి జెండా పాతి నాది అంటే వదిలేస్తారా? వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017–18లో ఈ–స్టాంప్‌ ద్వారా 77 వేలకు పైగా ఆస్తుల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేస్తే అది 2023–24కు వచ్చేసరికి ఏకంగా 62.93 లక్షలకు పెరిగింది (2016–17లో ప్రారంభమై నాటి నుంచి బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ ఆస్తులు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రాల వరకు వీడియోలో చూపిస్తూ).ఈ విధానంలో లోపాలు లేకపోవడంతోనే చాలా మంది ఈ–స్టాంప్‌ల ద్వారా క్రయవి­క్రయాలు చేశారు. వాళ్లందరి భూములు సక్రమంగా ఉన్నాయి కదా! ఎలాగైనా అధికారంలోకి వచ్చేసి రామో­జీరావు ప్రజల సొమ్ముతో తన అక్రమ వ్యాపారాలు చేసుకోవాలని, బాబు అమరా­వతిలో రూ.వేల కోట్లు దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారు.

Lok Sabha Election 2024: People are my security shield asserts says PM Narendra Modi
PM Narendra Modi: ప్రజలు నన్ను సమాధి కానివ్వరు

నందూర్బర్‌: తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, కానీ, దేశ ప్రజలే తనకు రక్షణ కవచమని, తనకు ఎలాంటి హాని కలుగకుండా వారే కాపాడుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మహారాష్ట్రలో ఓటు బ్యాంక్‌ను బుజ్జగించడానికి నకిలీ శివసేన తనను దూషిస్తోందని, బెదిరింపులకు దిగుతోందని శివసేన(ఉద్ధవ్‌)పై మండిపడ్డారు. శనివారం మహారాష్ట్రలోని నందూర్బర్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. విపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజల మద్దతును, విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు. తనను అంతం చేయడానికి సాగుతున్న కుట్రలు ఫలించబోవని తేలి్చచెప్పారు. తనను సజీవంగా గానీ, నిర్జీవంగా గానీ సమాధి చేయకుండా ప్రజలు అడ్డుకుంటారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో మొఘల్‌ రాజు ఔరంగజేబును సమాధి చేసినట్లు మోదీని సైతం సమాధి చేయాలంటూ శివసేన(ఉద్ధవ్‌) నేత సంజయ్‌ రౌత్‌ ఇచి్చన పిలుపును మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. మోదీకి సమాధి తవ్వుతామంటూ కాంగ్రెస్‌ బెదిరిస్తోందని ఆక్షేపించారు. శివసేన(ఉద్ధవ్‌) కూడా తనకు హెచ్చరికలు జారీ చేస్తోందని, బాల్‌థాక్రే బతికి ఉంటే చాలా బాధపడేవారని చెప్పారు.

 Daily Horoscope: Rasi Phalalu On 11-05-2024 In Telugu
Rasi Phalalu: ఈ రాశి వారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.చవితి తె.4.45 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి పంచమి, నక్షత్రం: మృగశిర ప.12.30 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.9.02 నుండి 10.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.15 వరకు,అమృతఘడియలు: రా.2.44 నుండి 4.19 వరకుసూర్యోదయం : 5.34సూర్యాస్తమయం : 6.18రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: పనులు చకచకా పూర్తి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త వస్తువులు కొంటారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.వృషభం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.మిథునం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.కర్కాటకం: పనుల్లో ప్రతిబంధకాలు. ఇంటాబయటా వ్యతిరేకత. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కన్య: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అ«ధిగమిస్తారు.తుల: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.వృశ్చికం: ఆరోగ్య సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలలో అవాంతరాలుల. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.ధనుస్సు: పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ధనప్రాప్తి. ధార్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటుంది.మకరం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కుంభం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.మీనం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూముల వ్యవహారాలలో చికాకులు. ధనవ్యయం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

An article on ETV Bharat on land titling
రామోజీ.. ఈ కథనం నువ్వు వేసిందేగా!

సాక్షి, అమరావతి: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని వక్రీకరించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న రామోజీరావు 7 నెలల క్రితం దాన్ని జగన్‌ ప్రభుత్వం అమల్లోకి తేలేకపోతుందంటూ ఈటీవీ భారత్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. గతేడాది ఆగస్టు 11న ఈటీవీ భారత్‌లో ‘వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్‌’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులకు కూడా కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోలేకపోతున్నారని అందులో వివరించారు. అసెంబ్లీలో ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను ఆమోదించినా కేంద్రం నుంచి అనుమతి తేలేకపోతున్నారని ఆక్షేపించింది.అనేకసార్లు దిల్లీలో ప్రదక్షిణలు చేసిన సీఎం జగన్‌ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌కు కేంద్రం నుంచి ఆమో­దం పొందడంలో విఫలమయ్యారని ఆ కథనంలో రామోజీ గుండెలు బాదుకున్నారు. ఆ కథనం వచ్చిన కొద్దినెలలకే కేంద్రం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోద­ముద్రా పడింది. ఇప్పుడు ఏకంగా విష ప్రచారం చేయడం రామోజీ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎంతో విజన్‌ ఉన్న చట్టం అని చెప్పిన దాని గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఈ చట్టం వస్తే భూ యజమానులకు వరంగా మారుతుందని చెప్పిన ఈటీవీ ఇప్పుడు అది వస్తే భూములు పోతాయని రైతులను భయభ్రాంతులకు గురిచేసే కథనాలు వండి వారుస్తోంది. ఈ చట్టం గురించి వ్యతిరేక ప్రచారం చేసి భూములకు సంబంధించి వారిలో భయాలు సృష్టించి తద్వారా ఎన్నికల్లో చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు రామోజీ ఈ దిగజారుడు పాత్రికేయానికి తెగబడ్డారు. భూ హక్కుల చట్టంతో భూములకు భద్రత వస్తుందని ఈటీవీలో పలు కథనాలు ప్రసారం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు బురద జల్లడం ద్వారా తనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప విలువలు, నీతి అనేదే లేదని రామోజీ నిరూపించుకున్నారు.

KCR comments on BJP and Congress party
చేనేతలపై జీఎస్టీ మోదీ చలవే

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/సాక్షి, సిద్దిపేట: ‘నేతన్నల నడ్డి విరిచేలా చేనేతలపై జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీయే. నేత కార్మికులకు బీమాతోపాటు ఇతర సదుపాయాలు రద్దు చేశాడు. బీజేపీ ఎజెండాలో కార్పొరేట్లే తప్ప చేనేతలు, కార్మికులు, పేదలు ఉండరు. అబ్‌ కీ బార్‌ 400 పార్‌ కాదు.. బీజేపీ మళ్లీ గెలిస్తే పెట్రోల్‌ డీజిల్‌ ధరలు రూ. 400 అవుతాయి. అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ వాటి అమల్లో విఫలమైంది’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పాత బస్టాండ్‌ సమీపంలోని నేతన్న సర్కిల్‌లో రోడ్‌ షోతోపాటు సిద్దిపేట పాత బస్టాండ్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ప్రధాని వేములవాడకు ఒక్క రూపాయి అయినా ఇస్తామన్నాడా? లోక్‌సభ ఎన్నికల బరిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. నిన్న ప్రధాని వేములవాడకు వచ్చిండు. బండి సంజయ్‌ పక్కనే ఉన్నడు. దేశం కోసం ధర్మం కోసం అనే ప్రధాని... పొద్దున లేస్తే హిందూ జపం చేసే బండి సంజయ్‌ వేములవాడకు ఒక్క రూపాయి అయినా ఇస్తామని చెప్పారా? మోదీ వచ్చి గోదావరిని ఎత్తుకుపోతా అంటున్నారు. గోదావరిని ఎత్తుకుపోతే మనం ఎలా బతుకాలే? అందుకే ఆలోచించి ఓటేయండి. వినోద్‌కుమార్‌ పార్లమెంటులో మనకోసం కొట్లాడే వ్యక్తి. 2001 నుంచి తెలంగాణ సాధన ఉద్యమంలో ఉన్నాడు. సీఎం రేవంత్‌ ఈ జిల్లాను రద్దు చేస్తా అంటున్నాడు. సిరిసిల్ల జిల్లా ఉండాలంటే వినోద్‌కుమార్‌ గెలవాలి. కాంగ్రెస్‌వి అలవికాని హామీలు.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఒక్కటీ అమలు చేయలేదు. అవి అమలు అవుతాయన్న ఆశ కూడా లేదు. కాంగ్రెస్‌ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కింది. మహిళలకు రూ. 2500, రుణమాఫీ, రైతుబంధు రాలేదు. కరెంట్‌ లేదు. కరెంట్‌ కోతలు మళ్లీ మొదలయ్యాయి. రంగనాయక సాగర్‌ను ఎండబెట్టడం వల్ల రైతుల పంటలు కూడా ఎండిపోయాయి. ఉచిత బస్సు ఫెయిల్‌ అయింది. మా పాలనలో అందరినీ కాపాడాం.. బీఆర్‌ఎస్‌ పాలనలో రూ. 30 వేల కోట్లను రెండు దఫాలుగా రుణమాఫీ చేశాం. డిసెంబర్‌ 9న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌ ఇప్పటివరకు చేయలేదు. మేం అన్ని వర్గాల ప్రజలను కులమతాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లాం. అందరినీ కాపాడాం. పేదలు, వృద్ధులకు రూ. 2 వేల పెన్షన్‌ ఇచ్చాం. కాంగ్రెస్‌ నేతలు పెన్షన్‌ను రూ. 4 వేలు చేస్తామని చేయట్లేదు. అందుకే రాష్ట్ర, దేశ భవిష్యత్‌ కోసం ఆలోచించి బీఆర్‌ఎస్‌కు ఓటేయండి. సిద్దిపేటను మేం జిల్లా చేస్తే.. సీఎం రద్దు చేస్తా అంటున్నాడు ఎనీ్టఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిద్దిపేట జిల్లా కావాలని అడిగా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేను సీఎం అయ్యాక సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశా. జిల్లాకు రైలు, నీళ్లు తెచ్చాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామంటోంది. ప్రజల చెంతకు పరిపాలన తీసుకురావాలని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఈ మూర్ఖ ముఖ్యమంత్రి, ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తాం అంటున్నారు. సిద్దిపేట ప్రజలు ఎటువంటి పులులో నాకు తెలుసు. మీరు పట్టుబడితే.. జట్టుకడితే.. మెదక్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి లక్ష మెజారిటీ అందించడం మీకు లెక్కనే కాదు. వెంకట్రామిరెడ్డి గెలుపులోనే సిద్దిపేట జిల్లా గెలుపు ఉంది.రూ. 5.04 లక్షలు ఇప్పించండి కొదురుపాకలో మిడ్‌మానేరు నిర్వాసితుల ప్లకార్డుల ప్రదర్శన బోయినపల్లి (చొప్పదండి): ముంపు గ్రామాల బాధితులైన తమకు రూ. 5.04 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ మిడ్‌మానేరు భూ నిర్వాసితులు కేసీఆర్‌ బస్సు యాత్రలో ప్లకార్డులు ప్రదర్శించారు. తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ శుక్రవారం కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు వెళ్తుండగా కొదురుపాక వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కేసీఆర్‌ బస్సు వెళ్లిపోయాక ప్లకార్డులు ప్రదర్శించిన నిర్వాసితులతో స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.బజ్జీలు తిని.. చాయ్‌ తాగి..బస్సులో వెళ్లే క్రమంలో కేసీఆర్‌ బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలోని ఓ హోటల్‌ వద్ద కాసేపు ఆగారు. హోటల్‌లో కూర్చొని మిర్చీ బజ్జీలు తిని, టీ తాగారు. అక్కడే ఉన్న స్థానికులతో కాసేపు మాట్లాడారు. పలువురు చిన్నారులు కేసీఆర్‌తో ఫొటోలు దిగారు. కాగా, కొదురుపాక చెక్‌పోస్టు వద్ద చెక్‌పోస్టు సిబ్బంది కేసీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేశారు.

Election Campaign is Closed: Telangana
నేటితో ప్రచారం బంద్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హోరాహోరిగా సాగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం ఆరు గంటలకు తెరపడనుంది. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఇది సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. ఆ సమయం దాటిన తరువాత నుంచి బహిరంగ సభలు, రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం తదితర ప్రచారంపై నిషేధం కొనసాగనుంది. దృశ్యరూపకంగా ఉండే ఏ ప్రకటన కూడా ప్రచారం చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి (ఉప ఎన్నిక) సోమవారం పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది..బరిలో 525 మంది అభ్యర్థులు..రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఏప్రిల్‌ 18న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం కూడా ప్రారంభమైంది. లోక్‌సభకు మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం నుంచి 15 మంది పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అన్ని సీట్లలోనూ పోటీ చేస్తుండగా సీపీఎం, ఎంఐఎం ఒక్కోచోట బరిలో నిలిచాయి.అగ్ర నేతల ప్రచారం..నామినేషన్ల పర్వం నుంచి విస్తృత ప్రచారం ప్రారంభమవగా రాష్ట్ర, జాతీయ స్థాయిలోని ఆయా పార్టీ­ల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రధా­ని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌­నాథ్‌సింగ్‌తోపాటు పలువురు బీజేపీపాలిత రాష్ట్రా­ల సీఎంలు కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించారు.అలాగే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక బీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార బాధ్యతనంతా మోశారు. ఈ­సారి భారీ బహిరంగ సభలు అతితక్కువగా జర­గ్గా ప్రజలను కలుసుకొనేలా రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లకు అన్ని పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి.పరస్పరం దూషణలపర్వం..ఈసారి ఎన్నికల ప్రచారంలో పార్టీల దూషణలపర్వం తారస్థాయికి చేరింది. ఆరు గ్యారంటీలంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినా.. అమలు చేయలేదని బీఆర్‌ఎస్, బీజేపీలు తీవ్రంగా విమర్శించాయి. గత పదేళ్లలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, కొత్త రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. మరోవైపు బీజేపీ తాము మతపరమైన రిజర్వేషన్ల­ను మాత్రమే రద్దు చేస్తామని బదులిచ్చింది.ప్రలోభాలను అడ్డుకోవడంపై ఈసీ నజర్‌..నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుండటంతో పోలింగ్‌ జరిగే లోగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ఈసీ కృతనిశ్చయంతో ఉంది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు సీ–విజల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడైనా ప్రలోభాలు కొనసాగుతుంటే సమాచారం ఇవ్వాల­ని, తక్షణమే స్పందిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇస్తోంది. ఇప్పటివరకు 180 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణా­లు, తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

Industrial production growth slows to 4. 9percent in March
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం

న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్‌ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్‌ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం. రంగాల వారీగా..(శాతాల్లో) విభాగం 2024 2023 మార్చి మార్చి తయారీ 5.2 1.5 మైనింగ్‌ 1.2 6.8 విద్యుత్‌ ఉత్పత్తి 8.6 – 1.6 క్యాపిటల్‌ గూడ్స్‌ 6.1 10 కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ 9.5 – 8.0 కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ 4.9 –1.9 ఇన్‌ఫ్రా/నిర్మాణం 6.9 7.2 ప్రైమరీ గూడ్స్‌ 2.5 3.3 ఇంటరీ్మడియట్‌ గూడ్స్‌ 5.1 1.8

sakshi special story about International Mothers Day
International Mothers Day: అమ్మ చిరునవ్వును చూద్దామా

ఆమెతో గడపాలి. ఆమె తన పిల్లలకు మనసులోది చెప్పుకునేలా చేయాలి. ఆమె మురిసి΄ోయే కానుక ఇవ్వాలి. ఎదురు చూస్తున్న విహారానికి ఆమెను తీసుకెళ్లాలి. అరె... ఆమెకు ఇష్టమైనది వండితే ఎంత బాగుంటుంది. మనమలు, మనమరాళ్లు ఆమె కాళ్ల దగ్గర చేరితే మరింత బాగుంటుంది. అమ్మకు ఏం కావాలి? చిన్న చిరునవ్వు తప్ప. మే 12 అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మను సంతోషపెట్టేందుకు ఇదే సమయం.అమ్మగా ప్రయాణం ప్రసవ వేదనతో మొదలవుతుంది. బిడ్డకు జన్మనివ్వడానికి వేదనకు సిద్ధమయ్యే అమృతమూర్తి అమ్మ. పుట్టాక బిడ్డ కేర్‌మన్నా, కేరింతలు కొట్టినా ఆమె పెదాల మీద చిర్నవ్వు. అంతవరకూ అనుభవించిన బాధను ఆమె మర్చి΄ోతుంది. ఆ తర్వాత ఆమె జీవితమంతా పిల్లల చుట్టే తిరుగుతుంది. వారు నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. సరిగా చదవక΄ోతే బాధ పడుతుంది. పూర్తిగా స్థిర పడక΄ోతే ఆందోళన పడుతుంది. వారి ఎదుగుదల, పెళ్ళిళ్లు, సంసారాలు, సంపాదనలు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది. ‘నా పిల్లలు చల్లగా ఉండాలి’ అని ్రపార్థనలు చేస్తుంది. చల్లగా ఉంటే సంతోషపడుతుంది. కాని పిల్లలు పెద్దవాళ్లయ్యాక... తాము తల్లిదండ్రులయిన తర్వాత... తల్లి నుంచి ΄÷ందిన ప్రేమంతా తమ పిల్లలకు ఇస్తారు తప్ప తల్లికి ఇవ్వడానికి బద్దకిస్తారు. ‘అమ్మంటే ప్రేమ కదా మనకు’ అనుకుంటారు తప్ప వ్యక్తీకరించరు. ఒకోసారి అమ్మనే మర్చి΄ోయేంత బిజీ అయి΄ోతారు. అలాంటి వారికి అమ్మను గుర్తు చేసేదే కదా ‘మదర్స్‌ డే’.» అమ్మ ఫోన్‌ ఎత్తుతున్నారా?లోకంలో ఎన్నో ఫోన్లు ఫస్ట్‌ కాల్‌కే ఎత్తుతారు చాలామంది. కాని అమ్మ చేస్తుంటే ‘అమ్మే కదా’ అని ఎత్తరు. అమ్మ ఫోన్‌లో పెద్ద విశేషం లేక΄ోవచ్చు. రొటీన్‌ కాలే కావచ్చు. ‘భోజనం చేశావా నాన్నా’ అనే అదే ప్రశ్నను అడుగుతుండవచ్చు. కాని అమ్మ కదా. కొడుకు ఎంత పెద్దవాడైనా, కూతురు ఎంత పెద్ద సమర్థురాలైనా వారు క్షేమంగా ఇల్లు చేరి నిద్రకు ఉపక్రమిస్తున్నారని తెలుసుకుంటే తప్ప ఆమె నిద్ర΄ోదు. ఆ విషయం తెలిసీ ఫోన్‌ ఎత్తరు. ఒకోసారి విసుక్కుంటారు. పిల్లలే ఫోన్‌ చేసి ‘అమ్మా అన్నం తిన్నావా?’ అని అడగడం ఎందరు అమ్మల విషయంలో జరుగుతున్నదో. పిల్లల పలకరింపే అమ్మకు అసలైన భోజనం.» అమ్మను మాట్లాడనిస్తున్నారా?అమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు. ఆమె ఎంతో జీవితం చూసి ఉంటుంది. అనుభవం ఉండి ఉంటుంది. పిల్లల జీవితాల్లో జరుగుతున్న విషయాలు ఆమె చెవిన పడి చూపుకు అందుతుంటాయి. ఏదో చె΄్పాలని ఉంటుంది. తోబుట్టువుల ఫిర్యాదులు, పట్టింపులు ఒకరివి మరొకరికి చేరవేసి ప్రేమలు గట్టి పడాలని పరితపిస్తూ ఉంటుంది. భర్త గురించి కూడా పిల్లలకు ఏదో చెప్పుకోవాలని ఉంటుంది. పిల్లలు వింటున్నారా? నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని తీరిగ్గా ఆమె పక్కన కూచుని అడుగుతున్నారా? ఆమెను అర్థం చేసుకుంటూ ఆమె చెప్పింది పాటిస్తున్నారా? పాటించడమే కదా ఆమెకు తెలుపగల కృతజ్ఞత. ఇవ్వగల గౌరవం.» అమ్మకు కానుకఅమ్మ డబ్బు దాచుకోదు. దాచుకున్నా పిల్లల కోసమే. అమ్మ తన కోసం ఏదీ కొనుక్కోదు. కొనుక్కున్నా పిల్లల కోసమే. తమకు పిల్లలు పుట్టాక తమ పిల్లలకు ఏమేమి కొనిపెడదామా అనుకునే తల్లిదండ్రులు తమకు జన్మనిచ్చిన తల్లికి ఏదైనా కొని పెడదామా అనుకోరు. ఒక మంచి స్మార్ట్‌ వాచ్‌ (ఆమె ఆరోగ్యాన్ని సూచించేది), పాటల పెట్టె (సారెగమా కారవాన్‌ రేడియో), మంచి ఫోన్‌ హెడ్‌ఫోన్స్‌తో పాటుగా (ప్రవచనాలు వినడానికి), ఆమెకు నచ్చిన బంగారు ఆభరణం, ఆమెకు ఆసక్తి ఉన్న చానల్స్‌ సబ్‌స్క్రిప్షన్, ఓటీటీల సబ్‌స్క్రిప్షన్, ఏదైనా మంచి ప్రకృతి వైద్యశాలలో రెండు వారాలు ఉండటానికి కావలసిన ఏర్పాట్లు, ఆమె ప్రముఖంగా కనిపించేలా ఫ్యామిలీ ఫొటో... ఇవన్నీ ఆమె మళ్లీ మళ్లీ చూసుకుని ఆనందించే కానుకలు. చిరునవ్వుల మాలికలు. ‘మా పిల్లలు కొనిచ్చారమ్మా’ అని వారికీ వీరికి చెప్పుకునే ఘన విషయాలు.» మనం తప్పఅమ్మకు పిల్లలు తప్ప వేరే ఏ ఆస్తిపాస్తులు పట్టవు. అమ్మకు నిత్యం కళ్ల ముందు పిల్లలు కనిపించాలి. ఆమె మీద ఫిర్యాదులు చేసి, సాకులు చూపి, లేదా తప్పనిసరయ్యి ఆమెకు దూరంగా ఉండాల్సి వస్తే ఆ దూరాన్ని దాని వల్ల వచ్చే లోటును పూర్తిగా పూడ్చేంతగా పిల్లలు అమ్మకు ఇవ్వాలి. ‘అమ్మ’ అని పిలుచుకునే అదృష్టంతో ఒక మనిషి మన కోసం ఉండటం వరం. ఆ వరం అపురూపం. అది గ్రహిస్తే చాలు–ఈ మదర్స్‌ డే రోజున. అమ్మతో ప్రయాణంసెలవులొస్తే అచ్చోటకి వెళ్దాం ఇచ్చోటకి వెళ్దాం అని ΄్లాన్‌ చేసుకునే ఓ పిల్లలూ... మీ ప్రయాణంలో ఎన్నిసార్లు అమ్మను తీసుకెళ్లారు? జీవితం మొత్తం పిల్లల కోసం ఆమె ఇంటికే పరిమితమైంది. ఇప్పుడైనా లోకం చూడాలని అనుకుంటోంది. ‘నువ్వు రాలేవు’, ‘నువ్వు తిరగలేవు’, ‘నిన్ను చూసుకోవడం కష్టం’ అని ఆమెను ఇంటికే పరిమితం చేస్తే ఆమె మనసు ఆహ్లాదం ΄÷ందేదెప్పుడు. ఆమెకు ఆటవిడుపు లభించేదెప్పుడు. ఆమెకు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చింత ఉంటే అది తీరేదెప్పుడు. శ్రావణ కుమారుడిలా కావడిలో మోయక్కర్లేదు... రెండు రోజులు సెలవు పెట్టి ఆమెతో రైలు ప్రయాణమే ఆమెకు ఇవ్వగల వీక్షణ దరహాసం.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all