ధోని హ్యాట్రిక్ సిక్సర్లు! | Sakshi
Sakshi News home page

ధోని హ్యాట్రిక్ సిక్సర్లు!

Published Sun, Jul 23 2017 3:59 PM

ధోని హ్యాట్రిక్ సిక్సర్లు!

చెన్నై: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. వేలాది అభిమానులు వీక్షిస్తుండగా ధోని వరుసగా మూడు బంతుల్ని బౌండరీ దాటించాడు. శనివారం తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్) రెండో సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమన కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన క్రికెటర్ల మధ్య సరదాగా సిక్సర్ల హిట్టింగ్ పోటీ జరిగింది.

దీనికి ఎంఎస్ ధోనితో పాటు ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్, లక్ష్మీపతి బాలాజీ, పవన్ నేగీ తదితురులు హాజరయ్యారు.  ముందుగా పలువురు క్రికెటర్లకు ధోని బంతుల్ని విసిరాడు. ఆపై బ్యాట్ ను అందుకున్న ధోని బౌలింగ్ మెషీన్ విసిరిన బంతుల్ని ఆడాడు. ఇందులో మూడు బంతుల్ని ఎదుర్కొన్న ధోని వాటిని భారీ సిక్సర్లగా మలిచి అభిమానుల్ని  అలరించాడు.  ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన యెల్లో  జెర్సీని ధోని ధరించి కార్యక్రమంలో పాల్గొన్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement