ఈ-టికెట్ బుకింగ్‌లకు ఐఆర్‌సీటీసీ ఆఫర్ | IRCTC waives off service charge for e tickets till year end | Sakshi
Sakshi News home page

ఈ-టికెట్ బుకింగ్‌లకు ఐఆర్‌సీటీసీ ఆఫర్

Nov 23 2016 5:45 PM | Updated on Sep 27 2018 9:08 PM

ఈ-టికెట్ బుకింగ్‌లకు ఐఆర్‌సీటీసీ ఆఫర్ - Sakshi

ఈ-టికెట్ బుకింగ్‌లకు ఐఆర్‌సీటీసీ ఆఫర్

ఐఆర్‌సీటీసీ సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈనెల 23వ తేదీ.. బుధవారం నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీసు చార్జీ మినహాయింపు ఇచ్చింది.

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎలక్ట్రానిక్ చెల్లింపులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఐఆర్‌సీటీసీ ఓ సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. టికెట్ కౌంటర్ల వద్దకు వెళ్లి నేరుగా నగదు చెల్లించేవారు కాకుండా, ఐఆర్‌సీటీసీ సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈనెల 23వ తేదీ.. బుధవారం నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీసు చార్జీ మినహాయింపు ఇచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో ఈ టికెట్లు లేదా ఐ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేవారు ఆ టికెట్ల మీద సర్వీసు చార్జీని చెల్లించాల్సిన అవసరం ఉండదన్న మాట. 
 
ప్రస్తుతం స్లీపర్/ సెకండ్ క్లాస్ టికెట్ల మీద ఒక్కో టికెట్‌కు రూ. 20, ఏసీ టికెట్ల మీద రూ. 40 చొప్పున సర్వీస్ టాక్స్ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. బేసిక్ ఫేర్‌తో పాటు రిజర్వేషన్ ఫీజు, సంబంధిత బ్యాంకు వసూలుచేసే అదనపు చార్జీలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి సర్వీసు చార్జి మినహాయింపు వచ్చింది. తర్వాత క్రమంగా బ్యాంకులు వసూలుచేసే గేట్‌వే చార్జీలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement