సూపర్ స్టార్తో అల్లరోడు..? | Mahesh Babu multi Starer with Allari naresh | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్తో అల్లరోడు..?

Jun 21 2017 1:53 PM | Updated on Sep 5 2017 2:08 PM

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా ఫైనల్ చేశాడు. మురుగదాస్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' అనే పొలిటికల్ థ్రిల్లర్లో నటించనున్నాడు. ఆ తరువాత తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసేందుకు అంగీకరించాడు. అశ్వనిదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న సినిమా మల్టీ స్టారర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించాడు మహేష్. ఈ సారి ఓ యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడట. వంశీ డైరెక్ట్ చేయబోయే సినిమాలో మహేష్ బాబుతో పాటు కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫామ్ చేయకపోయినా.. మహేష్ సినిమాలో నరేష్ నటించటం ఖాయంగానే కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement