చిన్న సినిమాలకు ఆదరణ | Exclusive Interview With Prabhas Seenu | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలకు ఆదరణ

Sep 16 2016 4:28 AM | Updated on Oct 3 2018 7:48 PM

చిన్న సినిమాలకు ఆదరణ - Sakshi

చిన్న సినిమాలకు ఆదరణ

ప్రస్తుతం తెలుగు రాష్ట్రా ల్లో చిన్న సినిమాలకు ఆదరణ బాగుం దని ప్రముఖ సినీ హాస్యనటుడు ప్రభాస్ శ్రీను అన్నారు.

 సినీ నటుడు ప్రభాస్ శ్రీను
 నరసన్నపేట: ప్రస్తుతం తెలుగు రాష్ట్రా ల్లో చిన్న సినిమాలకు ఆదరణ బాగుం దని ప్రముఖ సినీ హాస్యనటుడు ప్రభాస్ శ్రీను అన్నారు. నరసన్నపే ట కొత్తవీధిలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన శ్రీను గురువారం తిరిగి హైదరాబాద్ వెళ్తూ స్థానిక విలేకరులతో మాట్లాడారు.
 
  హీరోతో సంబంధం లేకుండా కథ, కథనాలతో సినిమాలు హిట్ అవుతుండటంతో నటులకు చేతినిండా పని లభిస్తోందని చెప్పారు. కొంచెం టాలెంట్ ఉంటే మరింతగా సినిమా అవకాశాలు వస్తున్నాయని శ్రీను తెలిపా రు. చిన్న సినిమాలు తనలాంటి ఎందరో కళాకారులకు బతుకుతెరువును ఇస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు 150 సినిమాల్లో నటించానని పేర్కొన్నారు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో కెరీర్ ఊపందుకుందన్నారు.
 
 శుక్రవారం రిలీజ్ అవుతున్న సిద్ధార్థ, రామ్ హీరోగా నటించిన హైపర్, ఇంట్లో దెయ్యం- నాకేంటి భయ్యం సినిమాలో మంచి పాత్రలు పోషించినట్లు చెప్పారు. ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చినట్లు వివరించారు. సినిమా ఇండస్రీ ్టలో నిలదొక్కుకున్నామని, కొత్తవీధి వినాయకుడే తన ఎదుగుదలకు కారణమని అన్నారు. ఎక్కడ ఉన్నా నరసన్నపేట అంటే ప్రత్యేక అభిమానమని చెప్పారు. రెవెన్యూ అధికారిగా నాన్న ఇక్కడ పనిచేసినప్పుడు నరసన్నపేటలో ఎక్కువ కాలం ఉన్నామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement