వైఎస్ జగన్‌తో మంత్రి ఈటల భేటీ | Etela Rajender invites ys jagan to attend his son marriage | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌తో మంత్రి ఈటల భేటీ

Jun 14 2017 11:25 AM | Updated on Mar 25 2019 3:09 PM

వైఎస్ జగన్‌తో మంత్రి ఈటల భేటీ - Sakshi

వైఎస్ జగన్‌తో మంత్రి ఈటల భేటీ

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిశారు.

హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిశారు. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రి ఈటల... త్వరలో జరగనున్న తన కుమారుడు నితిన్‌ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఇప్పటికే మంత్రి ఈటల.. తన కొడుకు వివాహానికి రావాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే.

గత నెల 25వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలసి న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్.. గత శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌ను నేరుగా కలుసుకుని వివాహానికి మంత్రి ఈటల ఆహ్వానం అందించారు. నితిన్‌ పెళ్లి ఈ జూన్‌ 18న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement