ఆంక్షలు పౌర హక్కులకు భంగకరమే: దాసరి | Dasari narayana rao supports Mudragada Padmanabham indefinite deeksha | Sakshi
Sakshi News home page

ఆంక్షలు పౌర హక్కులకు భంగకరమే: దాసరి

Feb 6 2016 3:13 AM | Updated on Jul 30 2018 7:57 PM

ఆంక్షలు పౌర హక్కులకు భంగకరమే: దాసరి - Sakshi

ఆంక్షలు పౌర హక్కులకు భంగకరమే: దాసరి

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇంటికి ఎవ్వరూ వెళ్లకుండా రాష్ట్ర

ముద్రగడ దీక్షకు సంఘీభావం

 సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇంటికి ఎవ్వరూ వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పౌరహక్కులకు భంగం కలిగించడమే అని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ముద్రగడ దీక్షకు సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నట్టు చెప్పారు. దీక్ష జరుగుతున్న కిర్లంపూడి గ్రామానికి  కాపులు వెళ్లకూడదన్న నిబంధన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement