‘భూమా మృతికి చంద్రబాబే కారణం’ | chandrababu is responsible for bhuma nagireddy death says karunakar reddy | Sakshi
Sakshi News home page

‘భూమా మృతికి చంద్రబాబే కారణం’

Mar 13 2017 9:00 AM | Updated on Jul 28 2018 3:39 PM

‘భూమా మృతికి చంద్రబాబే కారణం’ - Sakshi

‘భూమా మృతికి చంద్రబాబే కారణం’

నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మరణానికి ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు

హైదరాబాద్‌: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మరణానికి ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. భూమాపై అక్రమ కేసులు బనాయించి ఆర్థికంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని,  ఆ కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేసి టీడీపీలో చేర్చుకుని అవమానాలపాలు చేశారన్నారు.

మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆయన మృతికి కారణమయ్యారన్నారు. ఎస్సీ,ఎస్టీ, ఎర్రచందనం కేసులు బనాయించిన చంద్రబాబుకు భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించే అర్హత లేదన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement