ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని హైదరాబాదీలు అంగీకరించరని ఒవైసీ చెప్పారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను గవర్నర్కు అప్పగిస్తారా అని ఒవైసీ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో హైకోర్టును ఆశ్రయించకుండా ఎవరు ఆపారని వ్యాఖ్యానించారు. హైకోర్టును ఆశ్రయించకుండా రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు చేయడం సరికాదని ఒవైసీ చెప్పారు. ఓటుకు నోటు కేసు, హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని చంద్రబాబు కోరిన నేపథ్యంలో ఒవైసీ స్పందించారు.


