స్విస్ చాలెంజ్‌పై ఏపీ సర్కారు యూటర్న్ | ap government takes u turn in swiss challenge issue | Sakshi
Sakshi News home page

స్విస్ చాలెంజ్‌పై ఏపీ సర్కారు యూటర్న్

Oct 26 2016 3:49 PM | Updated on Aug 18 2018 8:05 PM

స్విస్ చాలెంజ్‌పై ఏపీ సర్కారు యూటర్న్ - Sakshi

స్విస్ చాలెంజ్‌పై ఏపీ సర్కారు యూటర్న్

స్విస్ చాలెంజ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.

స్విస్ చాలెంజ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. రాజధాని నిర్మాణానికి అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు హైకోర్టు డివిజన్ బెంచి ఎదుట దాఖలుచేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. 
 
దీనిపై బుధవారం నాడు విచారణ ప్రారంభం కాగానే ఆయన ఈ విషయాన్ని కోర్టుకు చెప్పారు. చట్టంలో ప్రభుత్వం అనేక మార్పులు చేసిందని, ఆ మార్పులకు అనుగుణంగా మళ్లీ తాజా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. మరి సింగిల్ బెంచి లేవనెత్తిన అంశాల మాటేంటని బెంచి ప్రశ్నించగా, ఆయన మౌనం వహించారు. తాజా నోటిఫికేషన్ గనుక కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉంటే మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషన్‌కు కోర్టు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement