'అసెంబ్లీ సాక్షిగా యనమల అసత్యాలు' | YSRCP MLA mekapati gowatham reddy demands to revalidate of AP state budget reports | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీ సాక్షిగా యనమల అసత్యాలు'

Apr 20 2016 3:03 PM | Updated on Jul 12 2019 6:01 PM

'అసెంబ్లీ సాక్షిగా యనమల అసత్యాలు' - Sakshi

'అసెంబ్లీ సాక్షిగా యనమల అసత్యాలు'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ గణాంకాలన్నీ పారదర్శకమేనంటూ అసెంబ్లీ సాక్షిగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసత్యాలు చెప్పారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ గణాంకాలన్నీ పారదర్శకమేనంటూ అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసత్యాలు చెప్పారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి విమర్శించారు. బడ్జెట్ గణాంకాలన్నీ తప్పని కేంద్రం వెనక్కి పంపిందని ఆయన అన్నారు. బుధవారం గౌతం రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. . కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తప్పుడు లెక్కలు పంపిందని ప్రశ్నించారు.

పరిమితికి మించి అప్పులు తెచ్చుకునేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారంటూ మేకపాటి గౌతంరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రిపోర్టులన్నీ రీ-వాలిడేట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకుని వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన  సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement