చిలకలూరిపేట చేరుకున్న వైఎస్ జగన్ | YS Jaganmohan Reddy reaches chilakaluripeta | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేట చేరుకున్న వైఎస్ జగన్

Dec 23 2015 7:49 PM | Updated on Jul 25 2018 4:09 PM

చిలకలూరిపేట చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi

చిలకలూరిపేట చేరుకున్న వైఎస్ జగన్

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వెళ్లారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వెళ్లారు. బుధవారం హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరిన వైఎస్ జగన్.. విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేటకు వెళ్లారు.

వైఎస్ జగన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. చిలకలూరిపేటలో జరిగిన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, హరికృష్ణ కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement