కుక్కలదాడిలో మేకల కాపరి మృతి | Shepherd killed in dogs attack | Sakshi
Sakshi News home page

కుక్కలదాడిలో మేకల కాపరి మృతి

May 20 2016 4:41 PM | Updated on Oct 8 2018 5:04 PM

మేకల కాపరిపై కుక్కల మంద దాడి చేసి చంపేశాయి.

మేకల కాపరిపై కుక్కల మంద దాడి చేసి చంపేశాయి. మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం ఈడిగంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లాలమ్మ(45) శుక్రవారం ఉదయం మేకలను మేపేందుకు సమీపంలోకి పొలాల్లోకి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో మేకలపై దాడి చేసేందుకు వచ్చిన కుక్కల గుంపును ఆమె తరిమివేసేందుకు ఆమె యత్నించింది. అయితే, అవి తిరగబడి ఆమెను తీవ్రంగా గాయపరిచాయి. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వాటిని తరిమేశారు. అనంతరం 108 వాహనంలో అయిజ ఆస్పత్రికి తరలిస్తుండగానే లాలమ్మ కన్నుమూసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement