ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారా? | CM Chandrababu fires on Police officers | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారా?

Dec 16 2015 3:03 AM | Updated on Aug 14 2018 11:24 AM

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తారా? అంటూ సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పోలీసు అధికారులపై సీఎం ఆగ్రహం

 సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తారా? అంటూ సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం రాత్రి 11.30 గంటల తర్వాత కలెక్టర్లు, ఉన్నతాధికారులు, అదనపు డీజీపీలు, పోలీసు కమిషనర్లు, డీఐజీలు, ఎస్పీలను మాత్రమే లోనికి అనుమతించి శాంతిభద్రతలపై సమీక్ష జరిపా రు. కాల్‌మనీ, కల్తీ మద్యం ఉదంతాలపై సర్కారును పోలీసు శాఖ ఇరుకున పెట్టేలా వ్యవహరించిందని సీఎం అధికారులపై ఫైర్ అయినట్లు సమాచారం.

ఇలాంటి ఘటనలు నివారించడంలో నిఘా వ్యవస్థలు సరిగా పనిచేయలేదని, ఇవి వెలుగులోకి వచ్చిన తర్వాత సరిగా డీల్ చేయకపోవడం వల్ల తలవొంపులు వస్తున్నాయని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అసెం బ్లీ సమావేశాలకు ముందు టీడీపీ నాయకులు కాల్‌మనీ వ్యవహారంలో ఇరుక్కుపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement