అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం | telugu student dies in illilnoiss | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

May 14 2017 10:19 PM | Updated on Aug 30 2018 4:10 PM

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు.

ఇల్లినాయిస్‌ :
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఇల్లినాయిస్‌లోని లింకన్‌ హైవే పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతున్ని చిత్తూరు జిల్లా నగరికి చెందిన సాయి కుమార్‌ అడ్లూరిగా గుర్తించారు. సాయికుమార్‌ నార్తన్‌ ఇల్లినాయిస్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నట్టు సమాచారం.

ఈ ప్రమాదంలో సాయికుమార్‌తోపాటూ మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. సాయికుమార్‌ ఘటనా స్థలంలోనే మృతిచెందగా, యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయికుమార్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకు వచ్చేందుకు ఎన్‌ఆర్‌ఐలు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement