సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో జగన్ భేటీ | YS Jaganmohan Reddy to Meet Governor Evening 4 o'Clock | Sakshi
Sakshi News home page

సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో జగన్ భేటీ

Sep 30 2013 12:05 PM | Updated on Sep 5 2018 8:33 PM

సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో జగన్ భేటీ - Sakshi

సాయంత్రం 4 గంటలకు గవర్నర్తో జగన్ భేటీ

అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలువనున్నారు.

హైదరాబాద్‌: అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలువనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరనున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు ఓ వినతి పత్రాన్ని కూడా అందజేస్తారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలసి సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచాలని కోరనున్నారు.


కాగా, బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2న ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement