'వ్యక్తిగత వేడుకలకన్నా ప్రజలే ముఖ్యం' | YS jagan mohan reddy spends another wedding anniversary fasting in Jail | Sakshi
Sakshi News home page

'వ్యక్తిగత వేడుకలకన్నా ప్రజలే ముఖ్యం'

Aug 28 2013 2:40 PM | Updated on Aug 8 2018 5:51 PM

'వ్యక్తిగత వేడుకలకన్నా ప్రజలే ముఖ్యం' - Sakshi

'వ్యక్తిగత వేడుకలకన్నా ప్రజలే ముఖ్యం'

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ నేను, నాది, నా కుటుంబం అనే భావనలు పెరిగిపోయాయి.

హైదరాబాద్ : ఈరోజుల్లో  ప్రతి ఒక్కరూ నేను, నాది, నా కుటుంబం అనే భావనలు పెరిగిపోయాయి. నేను బాగుండాలి, నాతోపాటు ఇరుగు, పొరుగు బాగుండాలి అనే ఆలోచనలు దూరమైనాయి. నా ఇల్లు, నా వాళ్లు బాగుంటే చాలు.......ఇరుగుపొరుగు ఎలా పోతే నాకేంటి అనుకునే  కలికాలమిది. కాని ఆ కుటుంబం మాత్రం రాష్ట్రం మొత్తాన్ని  తన కుటుంబంగా భావిస్తుంది.  రాష్ట్రంలో ఏ మూల ఎవరికి బాధ కలిగినా... సమస్య వచ్చినా మేమున్నామని వారికి  అండగా నిలుస్తుంది. ఆ కుటుంబమేదో మీకు  ఈపాటికి అర్థమై ఉంటుంది.

మాట తప్పని... మడమ తిప్పని దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబమది. అనుక్షణం ప్రజలు, ప్రజా సంక్షేమంపై దృష్టి నిలిపే ఆ కుటుంబానికి పెళ్లి రోజులు, పుట్టిన రోజులు ఉండవు.  వ్యక్తిగత వేడుకలకన్నా  ప్రజల పక్షాన నిలవడమంటేనే ఆ కుటుంబానికి మక్కువ. నేడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి- భారతి పెళ్లి రోజు. ములాఖత్‌లు లేకపోవడంతో జగన్‌ను కలవలేని పరిస్థితి. గత ఏడాది పెళ్లిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని భారతి జైల్లోనే కలిశారు.

ఈ సందర్భంగా వారిద్దరు మాట్లాడుకునే సమయంలో కూడా  జైలు అధికారులు అక్కడ నుంచి కదలలేదు. అదేమని అడిగితే తాము ఏమీ వినటం లేదని ....మీరు మాట్లాడుకోండంటూ అధికారులు చెప్పటం గమనార్హం. సమన్యాయం చేయాలంటూ జగన్ జైల్లో దీక్షకు దిగటంతో ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు అనుమతించటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement