వైఎస్ రాజారెడ్డికి ఘన నివాళులు | YS jagan mohan reddy paying tributes to YS Rajareddy on his death anniversary | Sakshi
Sakshi News home page

వైఎస్ రాజారెడ్డికి ఘన నివాళులు

May 23 2016 9:38 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన తాత దివంగత వైఎస్ రాజారెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.

పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన తాత దివంగత వైఎస్ రాజారెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్ రాజారెడ్డి వర్థంతి సందర్భంగా  డిగ్రీ కళాశాల రోడ్డులోని రాజారెడ్డి ఘాట్ ను సందర్శించి ఘనంగా అంజలి ఘటించారు.

అక్కడ నుంచి రాజారెడ్డి పార్కుకు చేరుకుని తాత విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్తో పాటు ఆయన చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.  కాగా నేడు, రేపు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement