జననేతకు ఘన స్వాగతం | Y.S jagan mohan redyy grand wel come | Sakshi
Sakshi News home page

జననేతకు ఘన స్వాగతం

Nov 9 2013 3:49 AM | Updated on Sep 4 2018 5:07 PM

జననేతకు పాలమూరు జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు రైల్లో బయలుదేరిన వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నీరా‘జనం’ పలికారు.

 మహబూబ్‌నగర్ అర్బన్/షాద్‌నగర్ టౌన్, న్యూస్‌లైన్: జననేతకు పాలమూరు జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు రైల్లో బయలుదేరిన వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నీరా‘జనం’ పలికారు. శుక్రవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో తమ అభిమాన నేత వస్తున్నారని తెలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం 8 గంటల నుంచే ఆయా రైల్వేస్టేషన్ల వద్ద ఆయన రాకకోసం నిరీక్షించారు. రైల్వేబోగీ నుంచి బయటికి వ చ్చిన జననేత జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేశారు. తనదైన శైలిలో చిరునవ్వుతో ఆయన కనిపించగానే జగన్నినాదాలతో రైల్వేస్టేషన్లు మార్మోగాయి. జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్  తదితర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు కలవగా వారి పట్ల తనకున్న ఆప్యాయత, అనురాగాన్ని వ్యక్తం చేశారు.
 
 పాలమూరు పట్టణంలో జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం పార్టీ నాయకులతో పాటు సామాన్య జనం కూడా భారీసంఖ్యలో తరలి వచ్చి ఘన స్వాగత ం పలికారు. జిల్లాకేంద్రానికి రాత్రి 10.25 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి రాగా, ఆయనకు పలువురు నేతలు బొకేలు, పుష్చగుచ్ఛాలు అందించి తమ అభిమానం చాటుకున్నారు. ‘జై జగన్, వచ్చాడు.. వచ్చాడు పులిబిడ్డ వచ్చాడు’ అంటూ చేసిన నినాదాలు , కేరింతలతో రైల్వేస్టేషన్ దద్దరిల్లింది. హైదారాబాద్ నుంచి అదే రైలులో వచ్చిన ప్రయాణికులు జగన్నను చూసేందుకు పోటీపడ్డారు.
 
 అంతకుముందు శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు వైఎస్‌ఆర్ సీపీ షాద్‌నగర్ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, నాయకులు శేఖర్ పంతులు జగన్‌తో వెంట రైల్లో ప్రయాణించారు. షాద్‌నగర్‌లో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రచారకులు రమాదేవి, నాయకులు ఖాదర్‌ఘోరీ, ఇబ్రహీం, జంగయ్య, శర్ఫోద్దీన్, షఫీ, అద్నమ్, అంజి, దామోదర్ యాదవ్ తదితరులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రవిప్రకాశ్,  మహ్మద్ వాజిద్, రాశెద్ ఖాన్ , హైదర్ అలీ, సర్దార్, అంతయ్య,  కురుమూర్తి, అంజాద్ అలీ, ముజాహిద్, మహమూద్ అలీ సనా, చిన్నా, సాదిఖ్ ఖురేషీ, సురేశ్, కామేశ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement