చోరీ కేసులో సినీ రచయిత కులశేఖర్‌కు జైలు | Writer Kulasekhara sent to Jail in Robbery case | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో సినీ రచయిత కులశేఖర్‌కు జైలు

Dec 17 2013 12:47 AM | Updated on Aug 30 2018 5:24 PM

చోరీ కేసులో సినీ రచయిత కులశేఖర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం కాకినాడ ఐదో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్.సన్యాసినాయుడు తీర్పు చెప్పారు.

కాకినాడ, న్యూస్‌లైన్: చోరీ కేసులో సినీ రచయిత కులశేఖర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం కాకినాడ ఐదో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్.సన్యాసినాయుడు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. సినిమా కథలు, పాటలు రాసే హైదరాబాద్‌కు చెందిన టి.పి.కులశేఖర్.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉన్న త్రిపురసుందరి ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి ఉన్న 350 గ్రాముల వెండి కిరీటాన్ని దొంగిలించాడు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement